Hin

9th jan 2025 soul sustenance telugu

January 9, 2025

భగవంతుని ప్రేమ మరియు సహాయంతో సానుకూలతను అనుభవం చేసుకోవటం  (పార్ట్ 2)

ప్రతికూల పరిస్థితులను ఎదుర్కోవడానికి మనం సిద్ధంగా ఉన్నామా?

 

మన జీవితంలో పరిస్థితులు తరచుగా మరియు కొన్నిసార్లు అకస్మాత్తుగా తలెత్తుతాయి. జీవితం మనకు ప్రతికూల ఆశ్చర్యాలను తెస్తుంది. సానుకూలంగా ఉండటం అంటే మన జీవితంలో ప్రతి సన్నివేశం పరిపూర్ణంగా ఉంటుందని కాదు. జీవిత సంఘటనలను మనం నియంత్రించలేనప్పటికీ, వాటికి స్థిరంగా ప్రతిస్పందించడానికి మనం సిద్ధంగా ఉన్నామని మాత్రమే దీని అర్థం. విషయాలు తప్పుగా జరుగుతాయని కాదు,  కేవలం  బయట ఏమి తప్పు జరిగినా మనపై ప్రతికూల ప్రభావం చూపదు  అనే దృక్పథంతో మన తయారీ అనేది ఉండాలి. మనలో చాలా మంది విషయాలు సానుకూలంగా, సున్నితంగా మరియు ఆహ్లాదకరంగా ఉండే కంఫర్ట్ జోన్ కు ముడిపడి ఉంటాము. ఇది మార్పులకు అనుగుణంగా సర్దుకుపోవడాన్ని కష్టతరం చేస్తుంది. మానసిక సిద్ధత లేకపోవడం ఎక్కువ అయితే అది శారీరక ఆరోగ్య సమస్యలుగా మారవచ్చు, ముఖ్యంగా కుటుంబంలో మరణం వంటి పరిస్థితులలో, వ్యాపారం విఫలమైనప్పుడు, కొన్ని అనారోగ్యాలతో బాధపడుతున్నప్పుడు లేదా ఇష్టమైన జట్టు క్రీడలలో ఓడిపోయినప్పుడు కూడా. ఇటువంటి సంఘటనలలో కొందరు గుండెపోటు, తీవ్ర భయాందోళనలు లేదా శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది పడటం గురించి మనం వింటాము. 

జీవితం ఒత్తిడితో కూడుకున్నది కావచ్చు కాబట్టి మనందరికీ తగినంత మానసిక దృఢత్వం అవసరం. ఆధ్యాత్మికతను తీసుకురావడం మనకు భయాన్ని అధిగమించడానికి, ప్రశాంతంగా ఉండటానికి మరియు జీవితాన్ని ధైర్యంగా ఎదుర్కోవడానికి ఒక శక్తివంతమైన మార్గాన్ని అందిస్తుంది. ఆధ్యాత్మికత ఉత్తేజకరమైనది మరియు సమగ్రమైనది – ఇది జీవితం యొక్క వివిధ ప్రతికూల పరిస్థితుల వెనుక ఉన్న కారణాల గురించి మనకు అవగాహన ఇస్తుంది, వాటిని అంగీకరించడానికి సహాయపడుతుంది, పరిష్కారాల కోసం పనిచేయడానికి మనకు సాధికారతను ఇస్తుంది మరియు వాటిని సురక్షితంగా దాటే వరకు మనల్ని నిలబెడుతుంది. ఆధ్యాత్మిక జ్ఞానాన్ని క్రమం తప్పకుండా అధ్యయనం చేయడం వల్ల  ఆలోచనల పరంగా సూక్ష్మ స్థాయిలో, మాటలు మరియు చర్యల పరంగా భౌతిక స్థాయిలో మన మనస్సును ప్రతికూల పరిస్థితులను అధిగమించడానికి సానుకూల దశల గురించి ఆలోచించేలా చేస్తుంది. ధ్యానం మనల్ని భగవంతునితో కలుపుతుంది మరియు భగవంతుని హస్తం మనల్ని నడిపించినప్పుడు, జీవితం సానుకూల దిశలో పయనించడం ప్రారంభిస్తుంది, దీనిలో మనం సానుకూలంగా ప్రయోజనం పొందుతాము.

(సశేషం…)

రికార్డు

30th april 2025 soul sustenance telugu

విజయం యొక్క 5 అందమైన అంశాలు (పార్ట్ 3)

ప్రతి రోజు మీ వాట్సప్ లో ఒక మంచి విషయాన్ని తెలుసుకునేందుకు జీవితంలోని వివిధ లక్ష్యాలను సాధించేటప్పుడు మనం ఎంత వినయంగా మరియు నిజాయితీగా ఉన్నాము అనేదే మన విజయం. నమ్రత అన్నింటికంటే గొప్ప

Read More »
29th april 2025 soul sustenance telugu

విజయం యొక్క 5 అందమైన అంశాలు (పార్ట్ 2)

ప్రతి రోజు మీ వాట్సప్ లో ఒక మంచి విషయాన్ని తెలుసుకునేందుకు విజయం అంటే మన జీవతపు క్వాలిటి పెరగడం. మనం ఖరీదైన కారు,  ఖరీదైన బట్టలు కొనుగోలు చేసి  గర్వపడతాము. కొన్నిసార్లు ఈ

Read More »
28th april 2025 soul sustenance telugu

విజయం యొక్క 5 అందమైన అంశాలు (పార్ట్ 1)

ప్రతి రోజు మీ వాట్సప్ లో ఒక మంచి విషయాన్ని తెలుసుకునేందుకు మనమందరం మనకు మరియు ఇతరులకు సాధ్యమైనంత ఉత్తమమైన రీతిలో ప్రయోజనం చేకూర్చే పనులు చేసే ప్రత్యేకమైన వారము. ఉద్యోగంలో, మార్కెట్‌కు వెళ్లేటప్పుడు,

Read More »