Hin

10th jan 2025 soul sustenance telugu

January 10, 2025

భగవంతుని ప్రేమ మరియు సహాయంతో సానుకూలతను అనుభవం చేసుకోవటం  (పార్ట్ 3)

ప్రతికూల పరిస్థితులను అధిగమించడంలో భగవంతుడు మనకు ఎలా సహాయం చేస్తారు?

 

కొందరు భగవంతుడు నాకు ఈ సమస్యలను ఎందుకు ఇచ్చాడు? వారు కేవలం ఒక ప్రేక్షకుడిలా మాత్రమే ఉండి, దాన్ని పరిష్కరించడానికి నాకు ఎందుకు సహాయం చేయడం లేదు? అని అడుగుతారు.  భగవంతుడు మన పరమ పిత మరియు మనం వారి పిల్లలం. వారి సహాయం తీసుకోవడం మన హక్కు. కాని వారి సహాయం కేవలం ఒక ఆలోచన దూరంలో ఉన్నప్పటికీ మనం  మొదట కుటుంబంతో, స్నేహితులతో చర్చిస్తూ భగవంతుడు మన పిలుపు కోసం వేచి ఉన్నారని మర్చిపోతాము. మనలో కొందరు భగవంతుడు తనంతట తానే మనకు సహాయం చేస్తాడని ఆశిస్తారు, కానీ అలా కాదు. ఒక పిల్లవాడు తన తల్లిదండ్రులు చూస్తున్నప్పుడు జిగ్సా పజిల్ ని పరిష్కరించే ఉదాహరణను పరిగణించండి. పిల్లవాడు ఏదో ఒక సమయంలో చిక్కుకున్నప్పటికీ తెలివైన తల్లిదండ్రులు జోక్యం చేసుకోరు. పిల్లవాడు మరింత కష్టపడి దృష్టి పెట్టాలని, ఆలోచించాలని, ఎంపికలను అంచనా వేయాలని… తన వంతు కృషి చేయాలని తల్లిదండ్రులు ఆశిస్తారు.  ఒకవేళ పిల్లవాడు పజిల్ ని విడిచిపెడితే అది చూసిన తల్లిదండ్రులు  ఒక సూచన మాత్రమే ఇస్తారు, వాళ్లు బిడ్డకు తదుపరి అడుగు మాత్రమే చెబుతారు, మొత్తం పరిష్కారం చెప్పరు. కాని పిల్లలకి మిగిలిన పజిల్ ని పరిష్కరించడానికి తల్లిదండ్రుల ప్రేమ మరియు జ్ఞానం సరిపోతాయి. సరిగ్గా ఈ విధంగానే భగవంతుడు మనకు సహాయం చేస్తారు. 

మనం సానుకూలత లేదా ధైర్యంతో ఒక అడుగు వేసినప్పుడు, భగవంతుడు మన వైపు వెయ్యి అడుగులు వేస్తారని చెబుతారు. వారు సహాయం చేయడానికి ఆసక్తిగా ఉంటారు, కానీ మనం నిజాయితీగా ప్రయత్నించిన తర్వాత మాత్రమే. అంతేకాని భగవంతుడు  స్వయంగా మన పరిస్థితిని మార్చరు. వారు మనకు జ్ఞానం, ప్రేమ మరియు శక్తి రూపంలో సూచనలు ఇస్తారు. మనం వాటిని ఉపయోగించుకొని సవాలును అధిగమించాలి. భగవంతునితో వ్యక్తిగత సంబంధాన్ని ఏర్పరచుకోవడం చాలా ముఖ్యం. మనం నిరంతరం వారితో ప్రేమగా జోడించి ఉంటే, మనం నిరంతరం సానుకూలత, వివేకం మరియు ప్రతి సన్నివేశాన్ని నిర్భయంగా, విజయంతో దాటగల శక్తితో నిండి ఉంటాము.

రికార్డు

15th jan 2025 soul sustenance telugu

బ్రహ్మా కుమారీల 7 రోజుల కోర్సు (పార్ట్ 3)

ఆత్మ మరియు భగవంతుని జ్ఞానాన్ని పంచుకున్న తరువాత, బ్రహ్మా కుమారీల 7 రోజుల పరిచయ కోర్సు ప్రపంచ నాటకం అంటే ఏమిటి మరియు అది 4 యుగాలతో ఎలా రూపొందించబడిందో మనకు బోధిస్తుంది –

Read More »
14th jan 2025 soul sustenance telugu 2

బ్రహ్మా కుమారీల 7 రోజుల కోర్సు (పార్ట్ 2)

మనలాగే, భగవంతుని ఆధ్యాత్మిక రూపం కూడా భౌతిక కళ్ళకు కనిపించని ఉన్నతోన్నతమైన జ్యోతిర్బిందువని తెలుసుకున్న తరువాత, ఎలా మనం భగవంతుడిని అర్థం చేసుకొని వారితో ఎలా అనుసంధానించగలము అనేదానికి బ్రహ్మా కుమారీల 7 రోజుల

Read More »
13th jan 2025 soul sustenance telugu 3

బ్రహ్మా కుమారీల 7 రోజుల కోర్సు (పార్ట్ 1)

మనమందరం భగవంతుడి నుండి ఆధ్యాత్మిక జ్ఞానాన్ని నేర్చుకుంటూ ప్రతిరోజూ ధ్యానాన్ని అభ్యసించే ఆధ్యాత్మిక విద్యార్థులం. ధ్యానం అంటే భగవంతునితో ఆధ్యాత్మిక అనుసంధానం. ఆధ్యాత్మిక జీవితంలోని ఈ రెండు అంశాలతో  అనగా ఆధ్యాత్మిక జ్ఞానం మరియు

Read More »