Hin

26th feb 2025 soul sustenance telugu

February 26, 2025

భగవంతుని సాన్నిధ్యాన్ని గుర్తించి, వారి వారసత్వాన్ని తీసుకుందాం

మహాశివరాత్రి నాడు ఆధ్యాత్మిక సందేశం-ఫిబ్రవరి 26

భగవంతుడు మనకు సదా ఆత్మిక తండ్రి మరియు మనం ఆధ్యాత్మిక జీవులం అనగా ఆత్మలం, సదా వారి సంతానం. అలాగే, భగవంతుడు సదా గుణాల, శక్తుల మరియు జ్ఞాన సాగరుడు. భగవంతునితో ఈ సంబంధం అనాదిగా ఉన్న కారణంగా, ప్రపంచంలోని ప్రతి ఆత్మకు భగవంతుని వారసత్వంపై హక్కు ఉంది. ప్రపంచంలో, ఎప్పుడైతే సృష్టిని పరివర్తన చేసే పాత్రను భగవంతుడు పోషిస్తారో అప్పుడు ప్రపంచ నాటకంలో భగవంతుడు మరియు ప్రపంచంలోని ఆత్మల మధ్య వారసత్వాన్ని ఇచ్చి-పుచ్చుకోవడం జరుగుతుంది. విశ్వ పరివర్తన కార్యాన్ని చేయడానికి ప్రపంచంలో భగవంతుని దివ్యమైన అవతరణను శివరాత్రి లేదా శివ జయంతిగా జరుపుకుంటారు. ఇది అసలు ఎప్పుడు జరుగుతుంది, భగవంతుడు తన వారసత్వాన్ని ఎలా ఇస్తాడు? ఆత్మలు ఈ వారసత్వాన్ని పొందినప్పుడు ఏమి జరుగుతుంది మరియు అవి ఎలా పరివర్తన చెందుతాయి? ఈ సందేశంలో పరిశీలిద్దాం –

 

  1. భగవంతుడు దివ్యమైన పరిజ్ఞానం కలిగిన పరమాత్మ. వారు జ్ఞాన సాగరుడు. సర్వాత్మలు, వారి జననం, భగవంతుడు సమ్మిళితమై ఉన్న విశ్వ నాటకం, అన్ని జీవరాశుల ఆత్మలు, సృష్టి అన్నింటి జ్ఞాత. అలాగే, వారు సర్వ గుణాల మరియు శక్తుల సాగరుడు.

 

  1. భగవంతుని వారసత్వం ఆయన జ్ఞానం, గుణాలు మరియు శక్తులపై ప్రతి మానవ ఆత్మకు హక్కు ఉంది. ఇనుప యుగం లేదా కలియుగం చివరిలో, ప్రస్తుత సమయం, ప్రపంచం మొత్తం ఆధ్యాత్మిక చీకటిలో (మానవత్వం యొక్క రాత్రి లేదా చీకటి) ఉన్నప్పుడు భగవంతుడు ఈ ప్రపంచంలో అవతరించి తన తరంగాలు, ఆలోచనలు, మాటలు మరియు చర్యల ద్వారా తన పిల్లలకు ఈ వారసత్వాన్ని ఇస్తారు.

 

  1. ఈ వారసత్వం ఆత్మను అంతర్గతంగా సంతృప్తి చేస్తుంది మరియు ఈ అంతర్గత సంతృప్తి, ఆత్మ తన ఆధ్యాత్మిక గృహానికి – శాంతిధామానికి తిరిగి వెళ్లి, ఆలోచనలు లేకుండా, లోతైన శాంతి దశలో ఉంటుంది. అది మళ్ళీ భూమిపైకి వచ్చినప్పుడు, వివిధ భౌతిక జన్మలలో దాని పాత్రలను పోషించడానికి, అది పూర్తిగా భగవంతుని వారసత్వంతో నిండి ఉంటుంది, మరియు ఈ కారణంగా, అది మనస్సు, బుద్ధి, అంతర్గత వ్యక్తిత్వం లేదా సంస్కారాలు, శారీరక ఆరోగ్యం, అందం, సంపద, సంబంధాలు మరియు పాత్ర యొక్క అన్ని అందమైన ప్రాప్తులను కలిగి ఉంటుంది. అనేక ప్రతిభలు మరియు నైపుణ్యాలతో నిండి ఉంటుంది. అంతర్గత ప్రాప్తి ఈ ప్రాప్తులన్నింటినీ ఆధ్యాత్మిక స్థాయిలో అలాగే భౌతిక స్థాయిలో ఆకర్షిస్తుంది.

 

  1. అలాగే, ప్రపంచ నాటకంలో ఈ ఒక కొత్త దశ, అన్ని ప్రాప్తులతో ఉన్న స్వర్ణయుగం లేదా సత్యయుగం. దీనిలో ఆత్మలు పూర్తి శాంతి మరియు ఆనందాన్ని అనుభవం చేసుకుంటూ పూర్తిగా స్వచ్ఛంగా ఉంటాయి.

 

  1. శివరాత్రి ప్రపంచంలో నిరాకారుడైన భగవంతుడు లేదా పరమాత్మ అవతరణను మరియు ప్రపంచంలోని ఆత్మలకు తన వారసత్వాన్ని ఇచ్చే ఈ కార్యాన్ని జరుపుకుంటుంది.

రికార్డు

28th march 2025 soul sustenance telugu

సోషల్ మీడియా లైక్‌లు ముఖ్యమా?

ప్రతి రోజు మీ వాట్సప్ లో ఒక మంచి విషయాన్ని తెలుసుకునేందుకు సోషల్ మీడియా ఆధారిత సమాజంలో, మనం పోస్ట్ చేసే దానిపై ప్రజల ఆమోదం పొందడం మన స్వీయ-విలువ మరియు కీర్తికి కొలమానంగా

Read More »
27th march 2025 soul sustenance telugu

6 రకాల సంతృప్తులను మీ జీవితంలో భాగం చేసుకోండి

ప్రతి రోజు మీ వాట్సప్ లో ఒక మంచి విషయాన్ని తెలుసుకునేందుకు నేను నాతో సంతృప్తిగా ఉన్నానా – నాతో, నా సంస్కారాలతో, నా ఆలోచనలతో, మాటలు మరియు చర్యలతో సంతృప్తి చెందడం మరియు

Read More »
26th march 2025 soul sustenance telugu

ఈజీగా ఉండండి , బిజీగా కాదు

ప్రతి రోజు మీ వాట్సప్ లో ఒక మంచి విషయాన్ని తెలుసుకునేందుకు నేను చాలా బిజీగా ఉన్నాను…నాకు సమయం లేదు అని తరచుగా అంటూ ఉంటాము. ఇలాంటి మనస్తత్వం మనల్ని సమయానికి ప్రాధాన్యత ఇవ్వనివ్వదు.

Read More »