Hin

15th-oct-2023-soul-sustenance-telugu

October 15, 2023

భగవంతుని తో కనెక్ట్ అవుతూ దివ్యత్వాన్ని అనుభవం చేసుకొనండి (పార్ట్ 1)

నవరాత్రి యొక్క ఆధ్యాత్మిక సందేశం

దైవీ దృష్టి, దేవతా వస్త్రాలు, ఆయుధాలు, అద్వితీయమైన రథం (వాహనం), వరద హస్తం మరియు గౌరవం, ప్రేమ మరియు మర్యాదల ముఖం – శక్తి స్వరూపిణి యొక్క దివ్య రూపం. నవరాత్రిలో  విగ్రహం కోసం పవిత్ర స్థలాన్ని కేటాయించడం, అరటి ఆకులపై గోధుమ విత్తనాలను వేయడం, దాని పైన ఒక కుండ ఉంచి, ఆ కుండ నుండి నిరంతరం నీటి బిందువులు రావడం. ఈ కుండలో పూల దండలు వేస్తారు. ఒక దీపాన్ని నిరంతరం వెలిగిస్తారు. తొమ్మిది రోజుల పాటు ఉపవాసాలు మరియు ప్రార్థనలు జరుగుతాయి. ఆధ్యాత్మిక అర్థాన్ని పరిశీలిస్తే, ఈ ఆచారాలు భగవంతునితో అనుసంధానించడం ద్వారా మన దైవత్వాన్ని ఎలా అనుభవించవచ్చో తెలియజేస్తాయి.

  1. శివుడు మరియు శక్తి అంటే పరమాత్ముడు మరియు ఆత్మ. ప్రతి దేవత ఒక కుమారి(కన్య) కానీ వారిని తల్లి(అమ్మ) అని పిలుస్తారు, ప్రతి దేవత రాక్షసులను వధించడానికి ఆయుధాలతో చూపబడుతుంది. ఆత్మనైన నేను (శక్తి) పరమాత్మ లేదా భగవంతుడు (శివుడు)తో కనెక్ట్ అయి వారిని స్మరించినప్పుడు, నా నుండి పవిత్రత (కుమారి యొక్క గుణం), ప్రేమ (తల్లి యొక్క గుణం) మరియు శక్తి (రాక్షసులను చంపే ఆయుధాలు) వెలువడతాయి.  పవిత్రత, ప్రేమ మరియు శక్తి ప్రతి ఆత్మ యొక్క అసలైన గుణాలు.
  2. ఆ శక్తి స్వరూపిణి 8 భుజాలు కలది. ఇది ప్రతి ఆత్మకు ఉన్న 8 శక్తులను సూచిస్తుంది – సహన శక్తి, సర్దుకునే శక్తి, ఎదుర్కొనే శక్తి, ఇముడ్చుకునే శక్తి, పరిశీలన శక్తి, నిర్ణయ శక్తి, సంకీర్ణ శక్తి మరియు సహయోగ శక్తి.
  3. ఆ శక్తి స్వరూపిణి 8 చేతులలో ఒక్కొక్క ఆయుధాన్ని పట్టుకుని రాక్షసులను జయిస్తుంది. ఆయుధాలు జ్ఞానం యొక్క సాధనాలను సూచిస్తాయి. మనము ఈ సాధనాలను ఉపయోగించినప్పుడు, మనలో కామం, క్రోధం, లోభం, మోహం, అహంకారం మరియు అనేక ఇతర నెగెటివ్ అలవాట్లు మరియు సంస్కారాలనే రాక్షసులను అంతం చేస్తాము.
  4. మనం ఆధ్యాత్మిక జ్ఞానం యొక్క జలాలు మట్టి కుండ అనే మన బుద్ధి లో మన ఆలోచనల(విత్తనాలు) పై పడేలా చేసినప్పుడు, మన ఆలోచనలు స్పష్టంగా, పాజిటివ్ గా మరియు శక్తివంతంగా మారుతాయి. విత్తనాలు మొలకెత్తడం అంటే మన ప్రయత్నాలు ఫలిస్తాయి. జీవితంలోని అన్ని రంగాలలో మనం విజయాన్ని చూస్తాము. పువ్వులు అనగా ఈ ప్రక్రియ ద్వారా మనలో దైవీ గుణాల ఆవిర్భావానికి ప్రతీక.

 (రేపు కొనసాగుతుంది…)

మీ సమీపంలో ఉన్న రాజయోగ మెడిటేషన్ సెంటర్ కొరకు

రికార్డు

14th october 2024 soul sustenance telugu

అహంకారం లేకుండా నొక్కిచెప్పడం

కుటుంబంలో మరియు కార్యాలయంలో మన వేర్వేరు పాత్రలలో, కావాల్సిన ఫలితాలను పొందేందుకు వ్యక్తులను ప్రభావితం చేయడానికి మనం దృఢంగా ఉండాలి. మన అభిప్రాయాలను మర్యాదగా చెప్పడానికి, ఇతరులను గౌరవించడానికి, ఖచ్చితంగా ఉంటూ మార్పుకు అనువుగా

Read More »
13th october 2024 soul sustenance telugu

భగవంతుని 5 గొప్ప విశేషతలు

అందరూ భగవంతుడిగా ఒప్పుకునేవారు – భారతదేశంలో అనేకులు దేవి దేవతలను పూజిస్తారు. భారతదేశం వెలుపల, వివిధ మత పెద్దలను చాలా గౌరవంతో పూజిస్తారు. కానీ భగవంతుడు నిరాకారుడైన పరమ జ్యోతి. ఎల్లప్పుడూ స్థిరంగా ఉండే

Read More »
12th october 2024 soul sustenance telugu

ఆంతరిక రావణుడిని కాల్చి స్వేచ్ఛను అనుభవం చేసుకోవటం  (పార్ట్ 2)

దసరా నాడు ఆధ్యాత్మిక సందేశం-అక్టోబర్ 12 శ్రీ సీతారాములు మరియు శ్రీ లక్ష్మణుడు 14 సంవత్సరాల వనవాసంలో ఉండగా,  ఒక రోజు శ్రీ సీత తన ఆశ్రమానికి సమీపంలో వెండి చుక్కలతో ఉన్న అందమైన

Read More »