Hin

16th-oct-2023-soul-sustenance-telugu.

October 16, 2023

భగవంతుని తో కనెక్ట్ అవుతూ దివ్యత్వాన్ని అనుభవం చేసుకొనండి (పార్ట్ 2)

నవరాత్రి యొక్క ఆధ్యాత్మిక సందేశం

  1. శరీరం అనేది భౌతికమైన తత్వాలతో తయారు చేయబడింది మరియు ఆత్మనైన నేను ఆధ్యాత్మిక దీపం అని ప్రమిద మనకు గుర్తు చేస్తుంది. శరీరం, సంపద, సంబంధాలు, పాత్రలు వగైరా అనే బాహ్యమైన అసత్యపు గుర్తింపులను వదిలేసి ఆత్మిక స్మృతిలో ఉండటమే దీపాన్ని వెలిగించటం.
  2. ఉపవాసం అంటే పరంధామం లో పైన ఉండే భగవంతుని తో కనెక్ట్ అయ్యి వారికి దగ్గరగా ఉండటం. ఈ కనెక్షన్ యొక్క శక్తితో, మన సంకల్పాలలో, మాటల్లో, చర్యల లో వికారాలు లేకుండా ఉంటామని, నెగిటివిటీ ని ఇతరులకు ప్రసరింపజేయమని ప్రతిజ్ఞ చేద్దాము. ఇది మన జీవితంలో పాటించే శాశ్వతమైన ఉపవాసం.
  3. సాత్విక ఆహారం మరియు స్వచ్ఛత – ఆత్మ మరియు శరీరం యొక్క స్వచ్ఛతను పెంచడానికి మనం చూసే, చదివే, వినే, మాట్లాడే, తినే మరియు త్రాగే ప్రతిదీ ఉన్నతమైన ఆధ్యాత్మిక శక్తితో నిండి ఉండాలి.
  4. జాగరణ – అంధకారం అనేది విలువలు అనే వెలుగు లేకపోవడాన్ని, తప్పుఒప్పుల అజ్ఞానతను సూచిస్తుంది. భగవంతుడు మనతో పంచుకున్న ఆధ్యాత్మిక జ్ఞానం ఆధారంగా ఒక కొత్త ఆలోచనా విధానాన్ని జాగృతం చేసుకొని, ధారణ చేస్తూ జీవించడమే జాగరణ.
  5. రాస్ లేదా గర్బా డ్యాన్స్ – ప్రతి వ్యక్తి తమ స్టెప్పులను పక్క వ్యక్తి యొక్క స్టెప్పులకు అనుగుణంగా సమన్వయంతో చేయాల్సిన నృత్యం. ఏదైనా స్టెప్ మిస్ అయితే, డ్యాన్స్ పాడైపోతుంది, గాయం అవ్వగలదు. ఇది మన సంబంధాలను సూచిస్తుంది, దీనిలో మనం ఇతరుల సంస్కారాల ప్రకారం అడ్జెస్ట్ అవుతాము, దీనిని సంస్కరాల రాస్ అని కూడా అంటారు. మనం అడ్జస్ట్ అయ్యి సహించగలిగితే జీవితం హ్యాపీ డ్యాన్స్‌గా ఉంటుంది, లేకపోతే గొడవలుగా మారగలదు.

మీ సమీపంలో ఉన్న రాజయోగ మెడిటేషన్ సెంటర్ కొరకు

రికార్డు

9th dec 2024 soul sustenance telugu

సదా సంతృప్తిగా ఎలా ఉండాలి?

సంతృప్తి అంటే విషయాలు భిన్నంగా ఉన్నాయని అనుకోవటం కంటే, మనం ఎవరమానేదాన్ని  మరియు మన వద్ద ఉన్నదాన్ని మెచ్చుకోవడం. లక్ష్యాలను సాధించి, సౌకర్యవంతమైన జీవితాలను గడుపుతూ, ప్రతిదానిలో విజయం సాధించినప్పటికీ సంతృప్తి చెందని వ్యక్తులను

Read More »
8th dec 2024 soul sustenance telugu

నిర్భయంగా ఉండటానికి 5 మార్గాలు

స్వీయ గౌరవం యొక్క శక్తివంతమైన స్మృతిలో ఉండండి – మన భయాలన్నింటినీ అధిగమించగల మొదటి, అతి ముఖ్యమైన మార్గం మన స్వంత ఆధ్యాత్మిక ప్రాముఖ్యతను లోతుగా గ్రహించడం. ఇంకా, జ్ఞానం, సుగుణాలు, నైపుణ్యాలు మరియు

Read More »
7th dec 2024 soul sustenance telugu

పాత్ర-ప్రేరేపిత ఒత్తిడిని నివారించండి – ఇది ఒక పాత్ర మాత్రమే

చాలా పాత్రలు పోషించవలసి ఉన్నందున, మనం ఒత్తిడిని సహజంగా అంగీకరించాము. పాత్ర అభిమానం మన పదవి, విజయాలు మరియు వయస్సు ఆధారంగా ప్రదర్శించేలా చేస్తుంది. మనం కొన్నిసార్లు మన పాత్రలు, సంబంధాలు మరియు పదవుల

Read More »