Hin

భగవంతునికి 5 బహుమతులు

October 20, 2024

భగవంతునికి 5 బహుమతులు

భగవంతుడిని మధురమైన తల్లిగా, తండ్రిగా చేసుకుని మనం దివ్య జన్మను తీసుకున్నప్పుడు మనం దివ్యమైన బాల్యంలోకి అడుగు పెడ్తాము. భగవంతుడు మనల్ని 5 సుందరమైన ప్రేమపూర్వకమైన కానుకలను అడుగుతారు, అవి మనల్ని దివ్యమైన ఎదిగిన దశకు చేరుస్తాయి. ఆ దశ  సంపూర్ణ వివేకము, సర్వ సుగుణాలు మరియు శక్తులతో నిండి ఉంటుంది. 

  1. ఆలోచనలు, మాటలు మరియు చర్యలలో పూర్తి స్వచ్ఛత.

నేను ఒక దివ్యమైన స్వరూపాన్ని, ఈ దివ్యమైన మందిరం (శరీరం)లోకి అవతరించాను… నేను దివ్యతా సాగరుడైన పరమాత్మ సంతానమును. నా ప్రతి దివ్యత తో కూడిన  ఆలోచన, మాట మరియు చర్యతో నేను ఈ ప్రపంచానికి స్వచ్ఛతను ప్రసరింపజేస్తాను అని నన్ను నేను గుర్తుచేసుకుంటాను.

  1. తెల్లవారుజామున మధురమైన అమృత వేళలో ధ్యానంలో కూర్చోవడం

భగవంతుడు మధురమైన ప్రేమ సాగరుడు, వారు ప్రతిరోజూ తెల్లవారుజామున స్వచ్ఛమైన సమయంలో నా కోసం వేచి ఉంటారు… వేల సంవత్సరాల తరువాత నేను వారిని  తెలుసుకున్నాను… నేను వారితో కనెక్ట్ అయి అన్ని ఆధ్యాత్మిక ప్రాప్తుల వెలుగుతో నన్ను నేను నింపుకుంటాను అని నేను నాతో ధృవీకరించుకుంటాను.

  1. ప్రతి ఉదయం భగవంతుని జ్ఞాన మురళి రాగానికి నృత్యం చేయడం

భగవంతుడు నా కొరకు ఈ భౌతిక ప్రపంచంలో అవతరించారు… నేను చాలా కాలంగా వెతుకుతున్న జ్ఞాన రత్నాలను వారు నాతో పంచుకుంటారు… నేను భగవంతుని జ్ఞానాన్ని విని, లోతైన ఆనందాన్ని పొందుతున్నప్పుడు నేను భూమిపై అత్యంత అదృష్టవంతుడైన ఆత్మను అని నేను నాతో మాట్లాడుకుంటాను.

  1. నా శరీరానికి స్వచ్ఛమైన ఆహారాన్ని అందించడం ద్వారా ఆత్మకు స్వచ్ఛమైన ఆలయాన్ని సృష్టిస్తున్నాను

నేను దేవత ధర్మం యొక్క దైవీ  ఆత్మను… నేను తినే మరియు త్రాగే ప్రతి ఆహారం సాత్వికంగా, దేవదూతల మంచితనంతో కూడి ఉంటుంది. నేను ఏదైనా తినడానికి మరియు త్రాగడానికి ముందు మంచితనం యొక్క సాగరుడైన భగవంతుడిని ధ్యానం చేస్తాను అని నేను నాకు గుర్తు చేసుకుంటాను

  1. ప్రతి చర్యను భగవంతుని అందమైన జ్ఞాపకాలతో నింపుకోవడం

నేను చాలా ప్రత్యేకమైన ఆత్మను, భగవంతుడు ఎన్నుకున్న ఆత్మను… ప్రతి రంగంలో మరియు జీవితంలోని ప్రతి పాత్రలో భగవంతుడిని స్మరించుకోవడం ద్వారా నేను ప్రతి చర్యను విలువైనదిగా చేసుకుంటాను… వారి ప్రేమ మరియు ఆనందం నన్ను పరిపూర్ణంగా చేస్తాయి మరియు నేను దానిని అందరితో పంచుకుంటాను అని నాకు నేను చెప్పుకుంటాను.

మీ సమీపంలో ఉన్న రాజయోగ మెడిటేషన్ సెంటర్ కొరకు

రికార్డు

28th march 2025 soul sustenance telugu

సోషల్ మీడియా లైక్‌లు ముఖ్యమా?

ప్రతి రోజు మీ వాట్సప్ లో ఒక మంచి విషయాన్ని తెలుసుకునేందుకు సోషల్ మీడియా ఆధారిత సమాజంలో, మనం పోస్ట్ చేసే దానిపై ప్రజల ఆమోదం పొందడం మన స్వీయ-విలువ మరియు కీర్తికి కొలమానంగా

Read More »
27th march 2025 soul sustenance telugu

6 రకాల సంతృప్తులను మీ జీవితంలో భాగం చేసుకోండి

ప్రతి రోజు మీ వాట్సప్ లో ఒక మంచి విషయాన్ని తెలుసుకునేందుకు నేను నాతో సంతృప్తిగా ఉన్నానా – నాతో, నా సంస్కారాలతో, నా ఆలోచనలతో, మాటలు మరియు చర్యలతో సంతృప్తి చెందడం మరియు

Read More »
26th march 2025 soul sustenance telugu

ఈజీగా ఉండండి , బిజీగా కాదు

ప్రతి రోజు మీ వాట్సప్ లో ఒక మంచి విషయాన్ని తెలుసుకునేందుకు నేను చాలా బిజీగా ఉన్నాను…నాకు సమయం లేదు అని తరచుగా అంటూ ఉంటాము. ఇలాంటి మనస్తత్వం మనల్ని సమయానికి ప్రాధాన్యత ఇవ్వనివ్వదు.

Read More »