Hin

28th dec 2023 soul sustenance telugu

December 28, 2023

భగవంతునితో కనెక్ట్ అవ్వడం ద్వారా నాణ్యమైన రీఛార్జ్ చేసుకోవడం (పార్ట్ 1)

భగవంతుడు అత్యంత సుందరమైన వారు మరియు ఉన్నతోన్నతులు. వారు నిరంతరం వారి సుగుణాలను ప్రపంచానికి ప్రసరింపజేస్తూ, ఆధ్యాత్మిక శక్తితో కూడిన సూర్యుడిలా ఉంటారు. మనం వారిని ప్రేమించడంతో పాటు మనల్ని మనం వారి  సుగుణాలతో నింపుకోవాలని, పరిపూర్ణంగా మరియు సుందరంగా మార్చుకోవాలని కోరుకొని వారిని తలుచుకుంటాము. మన ఆలోచనలలో, భావాలలో మనం భగవంతునితో ఎంత ఎక్కువగా ఉంటామో అంతగా అడుగడుగునా వారి  ప్రేమను అనుభవం చేసుకుంటాము. అంతగానే వారి సుగుణాలను మనలో నింపుకొని స్వచ్ఛంగా, దివ్యంగా మారుతాము. ఇదే ప్రతి మానవాత్మ యొక్క ఉన్నతమైన లక్ష్యం. భగవంతుడు రోజంతా వైబ్రేషన్స్ మరియు జ్ఞానం ద్వారా వారి ఆలోచనలు మరియు భావాలను తెలియచేస్తారు. మనం వాటిని అర్థం చేసుకున్నప్పుడు మనం భగవంతునితో సుందరమైన సంబంధాన్ని ఏర్పరచుకుంటాము. మెడిటేషన్ లో భగవంతుడు మనకు అనుభవం చేయించే  ఆకర్షణ వారి సుగుణాల స్వరూపులుగా చేస్తుంది.  జీవితంలోని ప్రతి చర్యలో మనల్ని తేలికగా మరియు సంతోషంగా చేస్తుంది.

 

భగవంతుడు శాంతి, సంతోషం, ప్రేమ, ఆనందం, స్వచ్ఛత, శక్తి మరియు జ్ఞానం అనే 7 గుణాల సాగరుడు. మనల్ని కూడా ఈ 7 సుగుణాలతో నిండుగా ఉంచాలని కోరుకుంటారు. మనం వారిలా ఈ సుగుణాల సాగరులము కాలేనప్పటికీ, వారు మనల్ని ఈ సుగుణాలలో మాస్టర్ సాగరులుగా లేదా ఇలాంటి సుగుణాలతో కూడిన తన సంతానంగా చేస్తారు. ఈ ప్రపంచంలోకి రాకముందు, ఆత్మలమైన మనం పరంధామంలో ఈ 7 సుగుణాలతో నిండి ఉండేవారము. మనం భూమి మీదకు వచ్చి అనేక జన్మలు తీసుకోవడం ప్రారంభించాక, కొంత కాలానికి ఈ సుగుణాలను కోల్పోయాము. ఈనాడు ఈ సుగుణాలు మనలో ఉన్నాయి కానీ గతంలో ఉన్న వాటి కంటే చాలా తక్కువగా ఉన్నాయి. సమయం పురోగమిస్తున్న కొద్దీ, సృష్టి నాటకం చివరి దశలోకి ప్రవేశిస్తోంది, ఇందులో మనం వివిధ రకాలుగా భగవంతుతో కనెక్ట్ అయ్యి నాణ్యమైన రీఛార్జ్ ను చేసుకోవాలి.

ఈ సందేశం యొక్క తదుపరి భాగంలో ఈ నాణ్యమైన రీఛార్జ్ చేస్కుకోవడానికి 5 విభిన్న మార్గాలను మనం పరిశీలించుకుందాం.

మీ సమీపంలో ఉన్న రాజయోగ మెడిటేషన్ సెంటర్ కొరకు

రికార్డు

12th october 2024 soul sustenance telugu

ఆంతరిక రావణుడిని కాల్చి స్వేచ్ఛను అనుభవం చేసుకోవటం  (పార్ట్ 2)

దసరా నాడు ఆధ్యాత్మిక సందేశం-అక్టోబర్ 12 శ్రీ సీతారాములు మరియు శ్రీ లక్ష్మణుడు 14 సంవత్సరాల వనవాసంలో ఉండగా,  ఒక రోజు శ్రీ సీత తన ఆశ్రమానికి సమీపంలో వెండి చుక్కలతో ఉన్న అందమైన

Read More »
11th october 2024 soul sustenance telugu

ఆంతరిక రావణుడిని కాల్చి స్వేచ్ఛను అనుభవం చేసుకోవటం  (పార్ట్ 1)

దసరా నాడు ఆధ్యాత్మిక సందేశం-అక్టోబర్ 12 దసరా అంటే చెడుపై మంచి సాధించిన విజయాన్ని జరుపుకునే పండుగ. ఇది శ్రీరాముడు మరియు రావణుడి మధ్య యుద్ధం రూపంలో చూపబడుతుంది. ఇందులో శ్రీరాముడు రావణుడిని ఓడించి

Read More »
10th october 2024 soul sustenance telugu

ఆలోచనలపై ప్రతికూల ప్రభావాలను అధిగమించడం (పార్ట్ 3)

నిన్న మనం బాహ్య ప్రభావాల గురించి చర్చించుకున్నాము. మన ఆలోచనలపై కొన్ని ఆంతరిక ప్రభావాలు ఈ క్రింది విధంగా ఉంటాయి: – ప్రశంసలు, కీర్తి, ప్రతీకారం, దురాశ, పరిస్థితి లేదా వ్యక్తి యొక్క నియంత్రణలో

Read More »