Hin

29th dec 2023 soul sustenance telugu

December 29, 2023

భగవంతునితో కనెక్ట్ అవ్వడం ద్వారా నాణ్యమైన రీఛార్జ్ చేసుకోవడం (పార్ట్ 2)

  1. భగవంతుడితో సన్నిహితంగా ఉంటూ మీ రోజును ప్రారంభించండి – వేకువజామున, ప్రకృతి నిశ్చలంగా, స్వచ్ఛంగా ఉంటుంది. మానవులు నిశ్శబ్దంగా వారి భౌతిక ఉనికితో నిర్లిప్తంగా ఉంటారు. అప్పుడు, మిమ్మల్ని మీరు ఆత్మగా భావిస్తూ, పరంధామంలోకి వెళ్లి తేలియాడండి. భగవంతుని స్వచ్ఛమైన వైబ్రేషన్స్ ను తాకుతూ అనుభవం చేసుకోండి. ఈ వైబ్రేషన్స్ మిమ్మల్ని భగవంతుని 7 గుణాలతో నింపుతాయి.
  2. మీ హృదయంలో భగవంతుని జ్ఞానాన్ని నింపండి – తెల్లవారుజామున మెడిటేషన్ చేసి, తయారయిన తరువాత, తాజా మనస్సు మరియు శరీరంతో భగవంతుని జ్ఞానాన్ని చదవండి లేదా వినండి. ప్రతి పదాన్ని మీ హృదయంలో నింపండి. అపారమైన ప్రేమతో పరమ గురువు అయిన భగవంతుడు నాకు బోధిస్తున్నట్లు భావించండి. ఇది రోజులోని ప్రతి ఆలోచన, మాట మరియు చేతల్లో వారి గుణాలతో నింపడానికి మిమ్మల్ని ప్రేరేపిస్తుంది.
  3. ప్రతి చర్యకు ఆధ్యాత్మిక వైబ్రేషన్ ను జోడించండి – భగవంతుని గుణాలను అనుభవం చేసుకోవడానికి మరియు వాటిని మీ సంస్కారాలుగా మార్చుకోవడానికి చాలా చక్కటి మార్గం, ఏదైనా చర్యను ప్రారంభించే ముందు భగవంతుడిని స్మరిస్తూ ఆ చర్యకు స్వచ్ఛమైన మరియు దైవిక వైబ్రేషన్స్ ను జోడించడం. వారి ఉనికిని అనుభవం చేసుకుంటూ చర్యను చేస్తున్న సమయంలో వారి మార్గదర్శకత్వం తీసుకోవడం మరియు చర్య పూర్తయిన తర్వాత వారికి కృతజ్ఞతలు చెప్పడం.
  4. నాణ్యమైన చార్ట్‌ను రూపొందించి, రోజంతా దానిని అనుసరించండి – ప్రతి ఉదయం మీరు భగవంతుడిని కలిసినప్పుడు, ఆ రోజు కోసం నాణ్యమైన చార్ట్‌ను వారితో పంచుకోండి. ఆ నాణ్యమైన చార్ట్‌లో, ఆ రోజు మీ చర్యల టైమ్‌టేబుల్‌ ఆధారంగా మీరు కలుసుకోవాలన్న వ్యక్తులకు, ఎదుర్కోవాల్సిన పరిస్థితులకు ప్రతి చర్యలో భగవంతుని 7 గుణాలను ఎలా తీసుకువస్తారు అనేది మనసులో వ్రాసుకోండి లేదా విజువలైజ్ చేసుకోండి.
  5. భగవంతుని జ్ఞానం మరియు గుణాలను ఇతరులతో పంచుకోండి – ప్రతి చర్యలో భగవంతుని గుణాలను అనుభవం చేసుకోని నాణ్యమైన రీఛార్జ్ చేసుకోవడానికి, మీకు భగవంతుని గురించి తెలిసిన, వారి నుండి నేర్చుకున్న ప్రతిదాన్ని ఇతరులతో పంచుకోండి మరియు ఇతరులను భగవంతునికి దగ్గరగా చేయండి. అలాగే, మీ ముఖం ద్వారా, దివ్యత్వం తో కూడిన చిరునవ్వు ద్వారా, ప్రతి మంచి మాట మరియు చేతల ద్వారా భగవంతుని గుణాలను అనుభవం చేయించండి.

మీ సమీపంలో ఉన్న రాజయోగ మెడిటేషన్ సెంటర్ కొరకు

రికార్డు

26th march 2025 soul sustenance telugu

ఈజీగా ఉండండి , బిజీగా కాదు

ప్రతి రోజు మీ వాట్సప్ లో ఒక మంచి విషయాన్ని తెలుసుకునేందుకు నేను చాలా బిజీగా ఉన్నాను…నాకు సమయం లేదు అని తరచుగా అంటూ ఉంటాము. ఇలాంటి మనస్తత్వం మనల్ని సమయానికి ప్రాధాన్యత ఇవ్వనివ్వదు.

Read More »
25th march 2025 soul sustenance telugu

ఆధ్యాత్మిక అవగాహనతో తోబుట్టువుల మధ్య వైరాన్ని అధిగమించడం

ప్రతి రోజు మీ వాట్సప్ లో ఒక మంచి విషయాన్ని తెలుసుకునేందుకు తోబుట్టువులు అనగా మీ సోదర సోదరీల మధ్య విభేదాలు ఉండటం సాధారణం, కానీ యుక్త వయసులో కూడా తోబుట్టువుల పట్ల అభద్రత

Read More »
24th march 2025 soul sustenance telugu

మెడిటేషన్ అనే బ్రహ్మ ముడి (పార్ట్ 3)

ప్రతి రోజు మీ వాట్సప్ లో ఒక మంచి విషయాన్ని తెలుసుకునేందుకు ప్రాక్టికల్ మెడిటేషన్ అనేది కేవలం ఉదయం రోజును ప్రారంభించే ముందు లేదా రాత్రి నిద్రురించే ముందు చేసేటువంటిది మాత్రమే కాదు, మీరు 

Read More »