Hin

12th April 2025 Soul Sustenance Telugu

April 12, 2025

భగవంతునితో నమ్మకమైన సంబంధానికి 5 సులువైన అడుగులు

  1. భగవంతుడు మన సుప్రీం తల్లి-తండ్రి, సంరక్షకుడని గ్రహించండి – మన జీవితంలో జరిగే ప్రతి పాజిటివ్ లేదా నెగెటివ్ భగవంతుడు నిర్ణయించినందున జరుగలేదని మనం చాలా లోతుగా గ్రహించాలి. గత జన్మల మరియు ఈ జన్మలో మన ప్రతి ఆలోచన, మాట మరియు చర్యల ఫలితంగా ఇది జరుగుతోంది. నా జీవితంలో జరిగే ప్రతిదానికీ భగవంతుడు బాధ్యుడు కాదు, కానీ నా జీవితంలో జరిగే ప్రతిదానిలో నాకు సహాయం చేయడానికి వారు బాధ్యుడు.
  2. దృఢ నిశ్చయంతో ఒక అడుగు వేస్తే భగవంతుడు వెయ్యి అడుగుల సహాయాన్ని అందిస్తారు  – మీరు మీ జీవితంలో అత్యంత కఠిన దశలో ఉన్నా, అదే సమయంలో అనేక నెగెటివ్ సంఘటనలు జరుగుతున్నా, మీరు ఆశ కోల్పోకుండా దృఢ నిశ్చయంతో ఉండాలనే భగవంతుని సూచనను గుర్తుంచుకోండి. అప్పుడు భగవంతుడు మీరు ఆశించిన దానికంటే ఎన్నో రెట్లు సహాయం చేస్తారని,  మీ ప్రతి సమస్యను సరైన సమయానికి సరైన విధంగా పరిష్కరిస్తారని చేసిన వాగ్దానాన్ని గుర్తుంచుకుంటారు. 
  3. భగవంతునిపై నమ్మకాన్ని పెంచుకోవడానికి ప్రతిరోజూ వారిని స్మరించుకోండి – ప్రతిరోజు ఉదయం లేచిన వెంటనే, కొన్ని నిమిషాలు భగవంతుడిని స్మరిస్తూ వారి నుండి ప్రేమ, ఆశీర్వాదాలు మరియు శక్తిని పొందండి. ఆ రోజంతటి గురించి, మీరు ఎదుర్కొనే సవాళ్ల గురించి చెప్పి శక్తివంతంగా ప్రారంభించండి. రోజులో, ప్రతి ముఖ్యమైన చర్యలో భగవంతుడిని మీతో ఉంచుకొని నిరంతరం వారితో మాట్లాడండి. రాత్రి, నిద్రపోయే ముందు, రోజంతా సహాయం చేసినందుకు భగవంతునికి కృతజ్ఞతలు చెప్తూ కొంత సమయం వారిని గుర్తుచేసుకోండి. పూర్తి విశ్వాసంతో వారి ఒడిలో నిద్రపోయి ఆ విశ్వాసాన్ని మరుసటి రోజుకి తీసుకువెళ్లండి.
  4. సుఖ-దుఃఖాలలో భగవంతుడిని తోడుగా చేసుకోండి – దుఃఖ సమయాల్లో మనం చాలాసార్లు భగవంతుడిని స్మరిస్తాం కానీ సంతోష సమయాల్లో, మనం వారిని మరచిపోతాము. మళ్ళి భగవంతుని పై చాలా ప్రేమ ఉందని చెబుతాము. కానీ మనం నిజంగా భగవంతుడిని ప్రేమిస్తే, సుఖ-దుఃఖాలు రెండింటిలోనూ వారిని మనతో ఉంచుకోవాలి. మనం ఎంత ఎక్కువ వారిని ప్రేమిస్తే, అంత మనల్ని వారు తిరిగి ప్రేమిస్తారు. వారు ఎల్లప్పుడూ మనతో ఉన్నారని మనం ఎంతగా భావిస్తామో అంత వారిని  ఎక్కువగా విశ్వసిస్తాము.

5. సత్కర్మలు చేస్తూ భగవంతుని  సహాయాన్ని పొందండి – మీ ప్రతి ఆలోచన, మాట మరియు చర్యను చెక్ చేసుకొని భగవంతుడు మరియు మీ జీవితంలో ప్రతి ఒక్కరూ ఇష్టపడే అన్ని సద్గుణాలతో వాటిని నింపండి. ఇది మిమ్మల్ని భగవంతునికి సమీపంగా చేరుస్తుంది,  జీవితంలోని అన్ని రంగాలలో వారు మిమ్మల్ని నిరంతరం రక్షిస్తారు. అప్పుడు భగవంతుడు మీ కోసం లేరని మీరు ఎప్పటికీ భావించరు. జీవితం ఆనందంగా మారి మీరు వారిపై అపారమైన నమ్మకాన్ని కలిగి ఉంటారు.

రికార్డు

22nd May 2025 Soul Sustenance Telugu

భోజనం చేసే ముందు భగవంతునికి ఆహారాన్ని అర్పించడం వల్ల కలిగే 7 ప్రయోజనాలు

ప్రతి రోజు మీ వాట్సప్ లో ఒక మంచి విషయాన్ని తెలుసుకునేందుకు మన ఆధ్యాత్మిక జీవితంలో మనం అలవర్చుకోవల్సిన ఒక అందమైన అలవాటు, భగవంతుని ధ్యానంలో ప్రతి భోజనాన్ని వండడం. అలాగే, ఒక రోజులో

Read More »
21st May 2025 Soul Sustenance Telugu

మీ వాస్తవిక సత్య గుణానికి తిరిగి వెళ్లడం

ప్రతి రోజు మీ వాట్సప్ లో ఒక మంచి విషయాన్ని తెలుసుకునేందుకు సత్యం మన వాస్తవిక గుణం, కానీ ఎప్పటికప్పుడు మన సౌలభ్యం కోసం లేదా స్వల్పకాలిక లాభాల కోసం అబద్ధాలు చెబుతాము. ఆసక్తికరమైన

Read More »
20th May 2025 Soul Sustenance Telugu

మీ పిల్లలతో తగినంత సమయం గడపకపోవడంపై అపరాధ భావాన్ని అధిగమించండి

ప్రతి రోజు మీ వాట్సప్ లో ఒక మంచి విషయాన్ని తెలుసుకునేందుకు వివిధ రకాల వ్యక్తిగత మరియు వృత్తిపరమైన నిబద్ధతలను గౌరవించేటప్పుడు, చాలా మంది తల్లిదండ్రులు తమ పిల్లలకు తగినంత నాణ్యమైన సమయాన్ని ఇవ్వకపోవడం

Read More »