Hin

11th dec 2023 soul sustenance telugu

December 11, 2023

భగవంతుడు ఇచ్చినవాటికి సంరక్షకుడిగా ఎలా అవ్వాలి? (పార్ట్ 1)

ఆధ్యాత్మికత మనకు సంరక్షణ అనే చక్కని అంశాన్ని పరిచయం చేస్తుంది. ముందుగా, ఆత్మ స్వరూపమునైన నేను, నాలో సంకల్పాలు, మాటలు, కర్మలు, గుణాలు, శక్తులు, సమయం, భౌతిక సంపద మొదలైన ఖజానాలు కలిగి ఉన్నానని తెలుసుకోవాలి. మునుపు, నేను ఈ ఖజానాలను అనేకసార్లు దుర్వినియోగం చేసి ఉండవచ్చు, కానీ ఇప్పుడు పరమాత్మ ద్వారా వాటిని సద్వినియోగం చేసుకునే విధిని తెలుసుకున్నాను, ఈ అవగాహన నా ఆత్మ ఉన్నతికి దోహదపడుతుంది మరియు దీర్ఘకాల లాభాన్ని తెచ్చిపెడుతుంది. భగవంతుని సూచనల ప్రకారం, నేను ఈ ఖజానాలను సక్రమమైన ఉద్దేశానికి వినియోగిస్తాను, ఈ వినియోగం కేవలం నా కోసమే కాక ఇతరులకు కూడా ఉపయోగపడుతుంది. ఈ స్థితి సత్యతకు సమీపంగా ఉంటుంది. ఈ స్థితిలో ఆత్మ తన నిజ గుణాలైన శాంతి, ఆనందం, ప్రేమ, పరమానందం, పవిత్రత, శక్తి మరియు జ్ఞానాన్ని అనుభూతి చేస్తుంది. ఇలా చేయడం వలన, ఫలితంగా, నాకు ఆధ్యాత్మిక స్వ ఉన్నతి అనుభూతి అవుతుంది.

అయితే, ఈ ఉద్దేశం నుండి ప్రక్కదారి పట్టిన ప్రతిసారీ నేను ఆధ్యాత్మికంగా క్రిందకు వస్తాను లేదా ఆధ్యాత్మిక ఎదుగుదల నాకు ఉండదు. మునుపు, వీటిని ఖజానాలు అని అంటారనే అవగాహన కూడా లేనప్పటికన్నా ఈ స్థితి కొంచెం భిన్నమైనది.  అతి అమూల్యమైన దానిని ఖజానా అని అంటాం. కనుక, పైన ప్రస్తావించిన,  నేను పొంది ఉన్న ఈ ఆధ్యాత్మిక మరియు భౌతిక శక్తులు లేక వనరులను సక్రమమైన విధంగా వినియోగించినప్పుడు, నా కోసం మరియు ఇతరుల కోసం, అవి ఖజానాలుగా మారుతాయి, తద్వారా నా ఆత్మిక విలువను నేను పెంచుకోగలను. ఇలా పెరిగినప్పుడు, నా జీవితంలో అన్ని భౌతిక అంశాలు మరియు వాటిలో ఇమిడి ఉన్న విజయాలు కూడా తత్ఫలితంగా పెరుగుతాయి.

(సశేషం)

మీ సమీపంలో ఉన్న రాజయోగ మెడిటేషన్ సెంటర్ కొరకు

రికార్డు

13th jan 2025 soul sustenance telugu 3

బ్రహ్మా కుమారీల 7 రోజుల కోర్సు (పార్ట్ 1)

మనమందరం భగవంతుడి నుండి ఆధ్యాత్మిక జ్ఞానాన్ని నేర్చుకుంటూ ప్రతిరోజూ ధ్యానాన్ని అభ్యసించే ఆధ్యాత్మిక విద్యార్థులం. ధ్యానం అంటే భగవంతునితో ఆధ్యాత్మిక అనుసంధానం. ఆధ్యాత్మిక జీవితంలోని ఈ రెండు అంశాలతో  అనగా ఆధ్యాత్మిక జ్ఞానం మరియు

Read More »
12th jan 2025 soul sustenance telugu

మనం మంచితనపు వైబ్రేషన్లను కలిగి ఉన్నామని తెలిపే 5 గుర్తులు

  మనమందరం ప్రపంచంలో మంచి ఆత్మలం. ఈ ప్రపంచ నాటకంలో ప్రతి ఒక్కరికీ మంచితనాన్ని ప్రసరింపజేసే పాత్ర మనది. మంచితనపు వైబ్రేషన్ అంటే  మనం ఎక్కడికి వెళ్లినా, ఎవరితో సంభాషించినా ప్రతి ఒక్కరూ మన

Read More »
11th jan 2025 soul sustenance telugu

మరింత వినడం ప్రారంభించండి … తక్కువగా తీర్పు చెప్పండి

మనమందరం గొప్ప వక్తలం కావచ్చు, కానీ మనం మంచి శ్రోతలమా? పరిపూర్ణ సంభాషణ అంటే కేవలం మనం బాగా మాట్లాడగలగడం మరియు మన మాటలను ఎవరైనా అర్థం చేసుకునేలా చేయడం మాత్రమే కాదు. ఇతరులు

Read More »