Hin

12th dec 2023 soul sustenance telugu

December 12, 2023

భగవంతుడు ఇచ్చినవాటికి సంరక్షకుడిగా ఎలా అవ్వాలి? (పార్ట్ 2)

నిన్నటి సందేసంలో ప్రస్తావించబడ్డ ఖజానాలు నా వద్ద ఉన్నాయి అని, వాటికి అత్యంత శక్తి ఉందని, వాటిని సద్వినియోగం చేసుకోవడం ద్వారా ఆత్మ ఉన్నతి జరుగుతుందని తెలుసుకోవడం ఎంత ముఖ్యమో, అంతే ముఖ్యమైనది వాటితో నిర్లిప్తంగా ఉండటం. ఎందుకంటే మనం నిరంతరం వాటితోటే జీవిస్తుంటాం, కనుక, వాటిపట్ల మమకారం ఏర్పడటం సహజమే. ఇటువంటి అనుబంధం ఉన్న చోట అహంకారం వస్తుంది, అప్పుడు ఖజానాలు దుర్వినియోగం అవుతాయి. ఈ సందర్భంలో చెప్పుకోవలసిన ముఖ్యమైన అంశం – సంరక్షకుడు, ట్రస్టీ. భగవంతుడు మనకు ఈ ఖజానాల జ్ఞానాన్నిస్తూ, వాటి వినియోగ విధిని నేర్పిస్తూ, వీటితో పాటు, మన లాభం కోసం, ఖజానాల అవగాహన వచ్చిన తర్వాత వీటిని పరమాత్మకు అంకితం చేయమన్నారు. ఇది కనులకు కనిపించని, అభౌతిక సమర్పణ. ఇది భౌతికమైనదో లేక కనిపించేదో కాదు.

ఒకసారి ఈ ఖజానాలను పరమాత్మకు అంకితం ఇచ్చిన తర్వాత, భౌతిక సమర్పణలవలె కాక, ఈ ఖజానాలు పరమాత్మ వద్ద ఉండిపోవు. ఎందుకంటే పరమాత్మ అపారమైన దాత, నిరాకారుడు, అశరీరి, కనుక, పరమాత్మ ఈ ఖజానాలను వారి వద్ద పెట్టుకోకుండా తిరిగి మనకే ఇచ్చేస్తారు. సమర్పణ అనేది చాలా లోతైన అంశం, ఇది మానసిక స్థాయిలో జరిగేదేగానీ భౌతికమైనది కాదు. అయితే, ఖజానాలను మనకు తిరిగి ఇచ్చే ప్రక్రియలో భగవంతుడు మనకు ఒక షరతు విధిస్తారు. వారు ఏమంటారంటే, ఈ ఖజానాలను నాకిచ్చేసారు కనుక, ఇకమీదట ఇవి మీవి కావు, నాది అనే భావన ఎక్కడైనా ఉంటే దానిని తొలగించండి, ట్రస్టీగా అయ్యి వాటిని సంరక్షించుకోండి, నేను చెప్పిన విధంగా సక్రమమైన ఉద్దేశం కోసమే వీటిని వినియోగించండి. స్వయాన్ని మరియు ఇతరులను సత్యతకు సమీపంగా తీసుకురావడమే ఉద్దేశము. ఇది నిన్నటి సందేశంలో చర్చించుకున్నాం. ట్రస్టీ అన్న పదం ట్రస్ట్ (నమ్మకం) అన్న పదం నుండి వచ్చింది. నా నమ్మకాన్ని(ట్రస్ట్) నిలబెట్టండి, ఈ ఖజానాలను వినియోగిస్తూ, వాటిని సంరక్షిస్తున్న క్రమంలో, ఎట్టి పరిస్థితిలోనూ నా నమ్మకాన్ని వమ్ము చేయకండి అని ఈ సందర్భంలో పరమాత్మ అంటారు. ఎందుకంటే ఆ ఖజానాలు మన వద్ద ఉన్నప్పటికీ అవి మనవి కావు అని మర్చిపోకండి. అవి భగవంతుడివి, వారిచ్చిన  ఖజానాలకు ట్రస్టీగా అయ్యి మనం వాటిని వినియోగిస్తున్నాం, సంరక్షిస్తున్నాం.

 

(సశేషం)

మీ సమీపంలో ఉన్న రాజయోగ మెడిటేషన్ సెంటర్ కొరకు

రికార్డు

17th june2024 soul sustenance telugu

పోటీ పడటం మానండి… ఈ క్షణాన్ని ఆస్వాదించండి (పార్ట్ 1)

ప్రతి ఆత్మ సంతోషాన్ని కోరుకుంటుంది. సంతోషంగా ఉండటం కోసం సంతోషాన్ని వెతుకుతుంటాము. ఆరోగ్యం, అందం, ధనము, పాత్ర వంటి ఇతర గమ్యాలు కూడా విలువైనవే ఎందుకంటే అవి మనకు సంతోషాన్నిస్తాయి అని మనం భావిస్తాము.

Read More »
16th june2024 soul sustenance telugu

 దేవీ దేవతల 36 దివ్య గుణాలు

నిన్నటి సందేశంలో, దేవీ దేవతలలో ఉన్న 36 దివ్య గుణాలను ప్రస్తావించాము. మనం పరిపూర్ణంగా, స్వచ్ఛంగా మరియు ప్రశంసనీయంగా తయారవ్వటానికి మనలో ప్రతి గుణం చెక్ చేసుకొని ధారణ చేద్దాము. ఈ గుణాలన్నింటినీ మనం

Read More »
15th june2024 soul sustenance telugu

దేవి దేవతల 5 అర్హతలు

కలియుగం (ఇనుప యుగం) చివరిలో మరియు సత్యయుగం (స్వర్ణయుగం) ప్రారంభానికి ముందు, మానవాళికి రాత్రి మరియు మానవాళికి పగలు మధ్య ఉన్న ప్రస్తుత సంగమయుగంలో భగవంతుడు మానవులను దేవీ దేవతలుగా మారుస్తున్నారు. దేవీ దేవతలకు

Read More »