Hin

13th dec 2023 soul sustenance telugu

December 13, 2023

భగవంతుడు ఇచ్చినవాటికి సంరక్షకుడిగా ఎలా అవ్వాలి? (పార్ట్ 3)

ఈ భౌతిక ప్రపంచంలో, ట్రస్టీకి సంబంధించి ఒక సాధారణ ఉదాహరణ – ఒక ధనవంతుడికి వారసులు ఎవ్వరూ లేరనుకోండి, అతడు తన ఆస్తిని ట్రస్టీకిగానీ లేక ట్రస్టీల బృందానికిగానీ అప్పచెప్తాడు, తద్వారా అతని కోరిక మేరకు సంపద సద్వినియోగం అవుతుంది. మరొక సాధారణ ఉదాహరణ – దేవాలయాలు మరియు సంక్షేమ సంస్థలతో సంబంధం ఉన్న ధర్మకర్తలు. భక్తులు భక్తివిశ్వాసాలు మరియు ప్రేమతో దేవుడికి సమర్పించుకునే ఆభరణాలు మరియు సంపదను లేదా ప్రజలు సంక్షేమ సంస్థలకు దానం చేసే ధనాన్ని ట్రస్టీల బృందం సంరక్షిస్తుంది. ఈ అన్ని సందర్భాలలో, సంపదను భద్రపరిచే క్రమంలో, నిజాయితీగల ట్రస్టీలు ఆ సంపదను ఎప్పుడూ తమదిగా భావించరు, వారికి నిర్దేశించబడిన విధంగానే ఎప్పుడూ సక్రమంగా ఉపయోగిస్తారు. దీనినే యజమాని నమ్మకాన్ని (ట్రస్ట్)ని నిలబెట్టుకోవడం అంటారు, అందుకే ట్రస్టీ అన్న పదం వచ్చింది.

ఈ విధంగా, ఇప్పుడు మనం భగవంతుడు ఇచ్చినవాటికి ట్రస్టీలుగా అయ్యి, నా సంకల్పాలు, మాటలు, కర్మలు, గుణాలు, శక్తులు, సమయం, భౌతిక సంపద మొదలైన వాటిని పరమాత్మ సంపదగా భావిస్తూ, భగవంతుడు నన్ను వాటికి ట్రస్టీగా నియమించారని రోజంతా గుర్తుంచుకోవాలి. ఈ విధంగా, నేను ఈ ఖజానాలను సక్రమంగా వినియోగిస్తాను, సానుకూల ఉద్దేశం కోసం వినియోగిస్తాను, ఇది నన్ను మరియు ఇతరులను సత్యతకు సమీపంగా తీసుకువస్తుంది. భగవంతుడు ఆశించిన విధంగా, వారు సూచించిన విధంగా నేను ఉండాలి. ఇలా చేయడం వలన ఖజానాల పట్ల నిర్లిప్తత వచ్చి అది నాకు, ఇతరులకు ప్రతి అడుగులో లాభాన్ని చేకూరుస్తుంది.

మీ సమీపంలో ఉన్న రాజయోగ మెడిటేషన్ సెంటర్ కొరకు

రికార్డు

3rd october 2024 soul sustenance telugu

ఈ నవరాత్రులలో మీ ఆంతరిక శక్తులను అనుభవం చేసుకోండి

నవరాత్రి (అక్టోబర్ 3 నుండి అక్టోబర్ 11 వరకు) ఆచారాలు మన దివ్యత్వాన్ని ఎలా నిలుపుకుంటామనే దానిపై చాలా చెబుతాయి. నవరాత్రి యొక్క ఆధ్యాత్మిక అర్ధాన్ని తెలుసుకొని మన ఆంతరిక శక్తులను అనుభవం చేసుకుందాము.

Read More »
2nd october 2024 soul sustenance telugu

సంతోషం కొరకు ప్రయాణమా లేక సంతోషకరమైన ప్రయాణమా (పార్ట్ 3)

జీవితం అందమైన సంబంధాల సంపదతో నిండినప్పుడు అన్ని స్థాయిలలో సంతోషాన్ని పొందవచ్చు. మీకు అత్యంత సన్నిహిత వ్యక్తి మీరే. మీ సంతోషానికి మూలం స్వయం యొక్క ఆధ్యాత్మిక గుర్తింపు యొక్క  స్పష్టమైన అవగాహన, మీ

Read More »
సంతోషం కొరకు ప్రయాణమా లేక సంతోషకరమైన ప్రయాణమా (పార్ట్ 2)

సంతోషం కొరకు ప్రయాణమా లేక సంతోషకరమైన ప్రయాణమా (పార్ట్ 2)

జీవిత ప్రయాణంలో అడ్డంకులు మన విజయాలకు తాత్కాలిక అడ్డంకులు కావచ్చు, కానీ మన సంతోషానికి అడ్డంకులు కావు అనే ఆలోచన విలువైనది. అప్పుడే జీవిత ప్రయాణం సంతోషం కోసం కాకుండా సంతోషకరమైన ప్రయాణం అవుతుంది.

Read More »