Hin

30th june2024 soul sustenance telugu

June 30, 2024

భగవంతుడు బోధించిన రాజయోగంతో మీ జీవితాన్ని మార్చుకోండి

మనమందరం రెండు వాస్తవాలతో కూడిన ప్రపంచంలో ఉన్నాము – అంతర్గత వాస్తవికత మరియు బాహ్య వాస్తవికత. అంతర్గత వాస్తవికత మన ఆలోచనలు, భావాలతో పాటు మన అంతర్గత వ్యక్తిత్వం లేదా సంస్కారాలు.  బాహ్య వాస్తవికత మన భౌతిక శరీరం, ఇంట్లో, మన కార్యాలయంలో, సమాజంలో మనం పోషించే పాత్రలు మరియు చాలా ముఖ్యంగా మన సంబంధాలు.  మన అందమైన బాహ్య వాస్తవికతను సృష్టించడానికి మరియు నిలబెట్టుకోడానికి మనం రోజంతా చాలా కష్టపడి పనిచేస్తాము, కాని శాంతి, ప్రేమ, ఆనందం మరియు జ్ఞానంతో నిండిన అందమైన అంతర్గత వాస్తవికత లేకుండా, శాశ్వతంగా విజయవంతమైన మరియు ఆనందాన్ని ఇచ్చే బాహ్య వాస్తవికతను సృష్టించలేమని గ్రహించడం చాలా ముఖ్యం. మన అంతర్గత వాస్తవికతను మార్చడానికి మనం తీసుకోవలసిన చర్యలు ఏమిటి అనేది ప్రపంచవ్యాప్తంగా ఆధ్యాత్మిక ఆత్మపరిశీలనకు చాలా ముఖ్యమైన అంశం. దానికి ఒక కారణం ఏమిటంటే, మానవులందరూ సంతృప్తితో నిండిన జీవితాన్ని గడపడానికి ఇష్టపడతారు. మరొక చాలా ముఖ్యమైన కారణం ఏమిటంటే, జీవితం చాలా హెచ్చు తగ్గులతో నిండి ఉంది, ఇది అస్థిరతను కలిగిస్తుంది, కొంత కాలానికి ఆత్మను బలహీనపరుస్తుంది, ఎందుకంటే మనం ఈ హెచ్చు తగ్గులను సులభంగా ఎదుర్కోవటానికి సిద్ధంగా లేము. కాబట్టి సమయం గడిచేకొద్దీ జీవితం మరింత అనూహ్యంగా మారుతున్న ఈ పాత, అలసిపోయే ప్రపంచంలో మనం మనుగడ సాగించాలంటే అంతర్గత బలం మరియు లోతైన అంతర్గత మంచితనం అనే రెండు ముఖ్యమైన సంపదలతో మనం నిండి ఉండాలి.

బ్రహ్మా కుమారీల వద్ద, మేము అందరం భగవంతుని జ్ఞానం మరియు ప్రేరణల ద్వారా దీనిని గ్రహించాము – మన మనస్సులలో నిరంతర సంతృప్తిని, మన జీవితంలో నిరంతర విజయాన్ని అనుభవించడానికి అంతర్గత స్వీయ సాధికారతను తీసుకురావడానికి సరైన పద్ధతులు, సాధనాలతో మనల్ని మనం సన్నద్ధం చేసుకోవడం చాలా ముఖ్యం. ఆధ్యాత్మిక జ్ఞానం, ధ్యానం, దైవిక గుణాలు ధారణ చేయడం, ఇతరులకు ఆధ్యాత్మిక సేవ చేయడం అనే నాలుగు విషయాలతో కూడిన రాజయోగాన్ని ప్రస్తుత సమయంలో భగవంతుడు బోధిస్తున్నారు. మేము దానిని నేర్చుకుంటున్నాము, దాని అధ్యయనంలో ప్రతిరోజూ పురోగమిస్తున్నాము, దానిని జీవితంలో ఒక మంచి భాగంగా కూడా చేస్తున్నాము. ఇది అంతర్గత వాస్తవికత మరియు బాహ్య వాస్తవికత రెండింటినీ అందంగా మారుస్తోంది. అన్ని బ్రహ్యా కుమారీల కేంద్రాలలో రాజయోగం బోధించబడుతుంది. ఏ నేపథ్యం, వృత్తి లేదా మతం నుండి, ఏ లింగం మరియు వయస్సు వారైనా సరె మా కేంద్రాలలో దేనినైనా సందర్శించడం ద్వారా నేర్చుకోవచ్చు.

మీ సమీపంలో ఉన్న రాజయోగ మెడిటేషన్ సెంటర్ కొరకు

రికార్డు

20th march 2025 soul sustenance telugu

సంబంధాల్లో కలిగే బాధ నుండి విముక్తిని పొందడం (పార్ట్ 1)

ప్రతి రోజు మీ వాట్సప్ లో ఒక మంచి విషయాన్ని తెలుసుకునేందుకు జీవితంలోని వివిధ రంగాలలో వేర్వేరు సంబంధాలలోకి వచ్చినప్పుడు, కొన్నిసార్లు మన అంతర్గత ప్రపంచంలోకి మరొక ఆత్మను అనుమతించినప్పుడు, మనల్ని వారు అర్థం

Read More »
19th march 2025 soul sustenance telugu

జీవితంలోని వివిధ దృశ్యాలలో సాకులు చెప్పడం మానుకోండి

ప్రతి రోజు మీ వాట్సప్ లో ఒక మంచి విషయాన్ని తెలుసుకునేందుకు మనలో చాలా మంది మన విశ్వసనీయతను కాపాడుకోవడానికి, ఇతరులపై లేదా పరిస్థితులపై నిందలు వేయడానికి సాకులు చెబుతారు. కొన్నిసార్లు మనకు, మన

Read More »
18th march 2025 soul sustenance telugu

నెగటివ్ ఆలోచనలను ఆధ్యాత్మిక శక్తితో మార్చడం (పార్ట్ 3)

ప్రతి రోజు మీ వాట్సప్ లో ఒక మంచి విషయాన్ని తెలుసుకునేందుకు అంతర్గత బలం యొక్క సానుకూల సంస్కారాలను సృష్టించడానికి, మనం ముందుగా పట్టుదల యొక్క మొదటి అడుగు వేయాలి. పట్టుదల అంటే నేను

Read More »