Hin

1st-nov-2023-soul-sustenance-telugu

November 1, 2023

భగవంతుడు – ఈ సృష్టి యొక్క ఆది బిందువు

భగవంతుడు సర్వ శక్తివంతుడు. వారు ఉంటేనే ఈ ప్రపంచం ఉంటుంది, ఎందుకంటే ఈ ప్రపంచంలో  మంచితనం మరియు దైవత్వం క్షీణించిన ప్రతిసారీ వారి పవిత్రత మరియు శక్తియే వాటిని పునరుద్ధరిస్తాయి. మన ప్రార్థనలలో వారితో మాట్లాడాము, కీర్తనలలో వారిని  స్మరించుకున్నాము, అనేక  సంవత్సరాలు ప్రతి శ్వాసలో వారి కోసం వేచి ఉన్నాము. వారు మన ప్రేమ మరియు గౌరవ బరితమైన ఆలోచనలను విని ప్రపంచంలోని ప్రతి ఆత్మ మరియు కణానికి తన ఆధ్యాత్మిక  తేజస్సును ప్రసరింపజేసి శాంతి, ప్రేమ మరియు ఆనందాన్ని నింపుతారు. వారు  సృష్టించిన ప్రపంచాన్ని ధార్మిక గ్రంధాలలో జ్ఞాపకం చేసుకుంటూ ప్రతి ఒక్కరూ గౌరవిస్తారు. దీనిని ప్రపంచవ్యాప్తంగా వివిధ పేర్లతో పిలుస్తారు – స్వర్గము, బహిస్ట్, హెవెన్ , అల్లా యొక్క తోట, గార్డెన్ ఆఫ్ ఈడెన్.

వారు భగవంతుడు – విశ్వం యొక్క సర్వోన్నత శక్తి, పరమ ఆత్మ , దివ్య గుణాలకు ఆధారం – మన సుప్రీం తండ్రి, తల్లి, శిక్షకుడు, స్నేహితుడు మరియు గురువు. జనన మరణ చక్రంలో మన ప్రతి కలను నెరవేర్చేవారు. మనం వారిని ఎంతగా ప్రేమించి, గౌరవించినా అది వారి  అర్హత కంటే ఎల్లప్పుడూ తక్కువగా ఉంటుంది. కనుక మన జీవితంలో అడుగడుగునా వారికి కృతజ్ఞతలు తెలుపుతూ స్మరించుకుందాం. ఆ కృతజ్ఞతా భావం వారిని మన హృదయంలో కూర్చోబెట్టి మన హృదయాన్ని పూర్తిగా శుద్ధి చేస్తుంది. వారు మన నుండి కోరుకునేది మరియు వారు  మన కోసం చేసిన దానికి బదులుగా మనం వారికి ఇవ్వగల ఒకే ఒక్కటి మన స్వచ్చమైన హృదయం.

మీ సమీపంలో ఉన్న రాజయోగ మెడిటేషన్ సెంటర్ కొరకు

రికార్డు

8th feb 2025 soul sustenance telugu

ఇతరులకు నిరంతరం ఇస్తూ ఉండండి (పార్ట్ 1) 

ఎమోషనల్ ఓదార్పు మరియు శక్తిని ఇవ్వడం   మన జీవితమంతా మనకు తెలిసిన వ్యక్తులకు మరియు మనకు తెలియని వ్యక్తులకు కూడా సేవ చేస్తాము. ఎందుకంటే ఇవ్వడం, సేవ చేయడం మన సహజ లక్షణాలు.

Read More »
7th feb 2025 soul sustenance telugu

అంతర్గత శాంతి మరియు ఆనందం కోసం ఇంట్లో ఒక పవిత్ర స్థలాన్ని ఏర్పాటు చేసుకోవటం

ధ్యానం కోసం ఇంట్లో ప్రత్యేకమైన, ఉన్నతమైన తరంగాల గది లేదా చోటును ఏర్పర్చుకోవడం ప్రయోజనకరంగా ఉంటుంది. మనము అంతర్గత శాంతి, ఆనందం కోసం ఉన్నత ఆధ్యాత్మిక శక్తి గల ప్రదేశాలకు వెళ్తాము. మనం మానసికంగా

Read More »
6th feb 2025 soul sustenance telugu

మనం స్వీయ నియంత్రణను ఎందుకు కోల్పోతున్నాము?

మనం ఎందుకు, ఎలా స్వీయ నియంత్రణను కోల్పోతామో అన్వేషిద్దాం. గాలిలోని కాలుష్య కారకాల గురించి మనకు తెలుసు, కానీ మరొక సూక్ష్మమైన మరియు కీలకమైన భాగం ఉంది, దానిని మనం చూడలేము కాని మనం

Read More »