Hin

9th july 2024 soul sustenance telugu

July 9, 2024

భగవంతుడు ప్రపంచాన్ని ఎలా శుద్ధి చేస్తాడు? (పార్ట్ 1)

800 కోట్లమంది, ఎన్నో రకాల జీవ జంతువులు ఉన్న ప్రపంచంలో మనం నివసిస్తున్నాము. అలాగే, ఈ ప్రపంచం పంచ తత్వాలతో రూపొందించబడింది – భూమి, నీరు, అగ్ని, గాలి మరియు ఆకాశం. భగవంతుడు చెప్పినట్లుగా,  భగవంతుడు, మానవులతో సహా ప్రపంచంలోని అన్ని యోనుల ఆత్మలు,  మరియు పంచ తత్వాలు శాశ్వతమైనవి. ఈ మూడింటితో కూడిన ఈ 5000 సంవత్సరాల ప్రపంచ నాటకం భూమిపై మళ్లీ మళ్లీ పునరావృతమవుతుంది అనేది ప్రపంచ నాటకం యొక్క నియమం. ప్రపంచ నాటకంలో ఆత్మలందరు అనేక జన్మల స్థిరమైన పాత్రలను కలిగి ఉంటారు. వరల్డ్ డ్రామా రిపీట్ అయినప్పుడు వారు ఈ పాత్రలను మళ్లీ మళ్లీ పోషిస్తారు. ప్రపంచ నాటకం ప్రారంభంలో, ఆత్మలందరూ స్వచ్చంగా ఉంటారు. వారు జనన మరణ చక్రంలో పవిత్రం నుండి అపవిత్రంగా మరియు ప్రపంచ నాటకం ముగింపులో భగవంతుని సహాయంతో మళ్లీ పవిత్రంగా మారతారు.

భగవంతుని సర్వోన్నత శక్తి ఈ ప్రపంచ నాటకంలో ఉన్న అత్యంత ప్రభావవంతమైన మరియు శక్తివంతమైన శక్తి. మానవ ఆత్మల ఆధ్యాత్మిక శక్తి రెండవ అత్యంత ప్రభావవంతమైన మరియు శక్తివంతమైనది. ఆ తరువాత వివిధ జాతుల ఇతర జీవాత్మల శక్తి. ఇది ఒక సోపానక్రమం లాంటిది – భగవంతుడు సోపానక్రమంలో అగ్రస్థానంలో ఉన్నారు, భగవంతుని క్రింద మానవ ఆత్మలు ఉన్నారు, మానవ ఆత్మల క్రింద లక్షల విభిన్న జీవుల యొక్క ఆత్మలు, ఆ తరువాత ఐదు భౌతిక తత్త్వాలు ఉన్నాయి.

 (సశేషం…. )

మీ సమీపంలో ఉన్న రాజయోగ మెడిటేషన్ సెంటర్ కొరకు

రికార్డు

20th jan 2025 soul sustenance telugu

మీ సంకల్పశక్తి మీకు అతిపెద్ద బలం

మనం ఒక లక్ష్యాన్ని సాధించాలనుకున్నా, సరైన ఆహారానికి కట్టుబడి ఉండాలనుకున్నా, వ్యసనాన్ని వదులుకోవాలనుకున్నా లేదా ఆరోగ్యకరమైన అలవాటును కొనసాగించాలనుకున్నా, విజయం లేదా వైఫల్యాన్ని మన సంకల్ప శక్తికి ఆపాదించుకుంటాము. కొన్నిసార్లు మనం అత్యధిక సంకల్ప

Read More »
19th jan 2025 soul sustenance telugu

మిమ్మల్ని విమర్శించే వ్యక్తులపై దృష్టి పెట్టవద్దు

మనం లేదా మనం చేసే పనికి మనల్ని ఇష్టపడని వ్యక్తులు ఎల్లప్పుడూ ఉంటారు. వారి గురించి మనకు తెలిసినప్పటికీ, వారిపై దృష్టి పెట్టవలసిన అవసరం లేదు. మనకు మద్దతు ఇచ్చి, సానుకూల శక్తిని పంపే

Read More »
18th jan 2025 soul sustenance telugu

బ్రహ్మా కుమారీల 7 రోజుల కోర్సు (పార్ట్ 6)

బ్రహ్మా కుమారీలకు  కొత్తగా వచ్చినవారు అడిగే ఒక సాధారణ ప్రశ్న ఏమిటంటే, మనం కేవలం ధ్యానం మాత్రమే ఎందుకని నేర్చుకోలేము? ఆధ్యాత్మిక జ్ఞానాన్ని వివరించే 7 రోజుల కోర్సు యొక్క వివిధ సెషన్లకు మనం

Read More »