Hin

10th july 2024 soul sustenance telugu

July 10, 2024

భగవంతుడు ప్రపంచాన్ని ఎలా శుద్ధి చేస్తాడు? (పార్ట్ 2)

భగవంతుడు మార్పులకు అతీతుడు. వారు స్వచ్ఛత, గుణాలు మరియు శక్తులలో స్థిరమైన వారు. భగవంతుడు తన ఆధ్యాత్మిక జ్ఞానం ద్వారా వెల్లడించినట్లుగా, భూమిపై 5000 సంవత్సరాల ప్రపంచ నాటకం నాలుగు సమాన దశలగా నడుస్తుంది – స్వర్ణయుగం, వెండి యుగం, రాగి యుగం మరియు ఇనుప యుగం, ఒక్కొక్కటి 1250 సంవత్సరాలు. మొదటి రెండు దశలు మానవాత్మలందరు మరియు ఇతర జాతుల ఆత్మలు పూర్తిగా స్వచ్ఛంగా, సంతోషంగా ఉంటారు. ప్రపంచంలో 100% సామరస్యం ఉంటుంది. ప్రకృతి కూడా పూర్తిగా ప్రశాంతంగా, స్వచ్ఛంగా ఉంటుంది. మూడవ దశ లేదా రాగి యుగం ప్రారంభంలో, స్వర్ణయుగం నుండి కొన్ని జన్మల ప్రయాణం తర్వాత, మానవ ఆత్మల ఆధ్యాత్మిక శక్తి కొద్దిగా తగ్గుతుంది. ఆ కారణంగా, వారు శరీర స్పృహ మరియు ఐదు వికారాలు – కామం, క్రోధం, లోభం, మొహం మరియు అహంకారం యొక్క ప్రభావంలోకి రావడం ప్రారంభించి అపవిత్రంగా మారడం ప్రారంభిస్తారు. అలాగే, ఇతర జాతుల ఆత్మలు, తమ ఆధ్యాత్మిక శక్తి తగ్గడం వల్ల మరియు మానవ ఆత్మల యొక్క ప్రతికూల ప్రకంపనలచే ప్రభావితమైనందున, అవి  అపవిత్రంగా మారడం ప్రారంభించి పంచ వికారాల ప్రభావంలోకి రావడం ప్రారంభిస్తాయి. ఈ ప్రక్రియ ప్రకృతిలో ప్రతికూల వాతావరణాన్ని సృష్టిస్తుంది. ప్రకృతి యొక్క ఆధ్యాత్మిక ప్రకంపనలు కూడా ప్రతికూలంగా మరియు అపవిత్రంగా మారడం ప్రారంభిస్తాయి. మనం నాల్గవ దశ లేదా ఇనుప యుగం చివరికి వచ్చే సరికి, ఈ మూడింటిలోని అశుద్ధత గరిష్ట స్థాయికి చేరుకుంటుంది. భగవంతుడు ఈ మూడింటికి అతీతంగా మరియు సోపానక్రమంలో అగ్రస్థానంలో ఉన్నందున, ఈ సమయంలో మూడింటిని పవిత్రంగా మార్చే తన బాధ్యతను నెరవేరుస్తారు. ఇదే సంగమ యుగం అంటే ఇనుప యుగం మరియు స్వర్ణయుగం మధ్య ప్రపంచ పరివర్తన యుగం. సంగమ యుగం తర్వాత, స్వర్ణయుగం మళ్లీ ప్రారంభమవుతుంది, 5000 సంవత్సరాల ప్రపంచ నాటకం మళ్లీ పునరావృతమవుతుంది.

ప్రపంచ నాటకంలో సంగమ యుగం అయిన ప్రస్తుత సమయంలో భగవంతుడు మానవ ఆత్మలను, వివిధ జాతుల ఆత్మలను మరియు ప్రకృతిని ఎలా శుద్ధి చేస్తాడు? మొదటి అడుగు ఏమిటంటే, భగవంతుడు తన గురించి, ఆత్మలు మరియు వారి జన్మలు, 5000 సంవత్సరాల ప్రపంచ నాటకం, దాని పునరావృతం గురించి మానవ ఆత్మలతో ఆధ్యాత్మిక జ్ఞానాన్ని పంచుకుంటాడు. మెడిటేషన్ ప్రక్రియ ద్వారా ఆత్మ స్పృహతో ఎలా ఉండాలో మరియు వారితో ఎలా కనెక్ట్ అవ్వాలో, భౌతిక విశ్వానికి ఆవల ఉన్న ఆత్మల ప్రపంచంలో తనను ఎలా గుర్తుంచుకోవాలని వారికి బోధిస్తాడు. అలాగే, మానవ ఆత్మలకు పవిత్రత, వినయం, సహనం మరియు సంతృప్తి వంటి దైవిక లక్షణాలను ఎలా అలవర్చుకోవాలో,  ఇతర మానవ ఆత్మలకు మరియు ప్రపంచానికి వారు భగవంతుని నుండి పొందిన జ్ఞానం, గుణాలు మరియు శక్తులతో ఎలా సేవ చేయాలో బోధిస్తాడు. ఈ నాలుగు అంశాలూ అంటే జ్ఞానం, యోగం, దైవీ గుణాలను అలవర్చుకోవడం మరియు మానవ ఆత్మలను శుద్ధి చేసే ఆధ్యాత్మిక సేవ వారిని ఆత్మిక స్పృహలో ఉండటానికి, అలాగే ప్రపంచాన్ని శుద్ధి చేయడంలో కూడా సహాయపడతాయి.

(సశేషం …)

మీ సమీపంలో ఉన్న రాజయోగ మెడిటేషన్ సెంటర్ కొరకు

[drts-directory-search directory="bk_locations" size="lg" cache="1" style="padding:15px; background-color:rgba(0,0,0,0.15); border-radius:4px;"]

రికార్డు

10th july 2025 soul sustenance telugu

నా భాగ్యానికి ఎవరు బాధ్యులు?

ప్రతి రోజు మీ వాట్సప్ లో ఒక మంచి విషయాన్ని తెలుసుకునేందుకు మనలో చాలామంది భగవంతుడు మన భాగ్యాన్ని వ్రాస్తాడని నమ్ముతాము. ఈ నమ్మకం గురించి  మనం ఆలోచించి ఆత్మపరిశీలన చేసుకోవాలి. భగవంతుడు మన

Read More »
9th july 2025 soul sustenance telugu

ఆరోగ్యకరమైన వర్క్-లైఫ్ బ్యాలన్స్ ను సాధించడం

ప్రతి రోజు మీ వాట్సప్ లో ఒక మంచి విషయాన్ని తెలుసుకునేందుకు జీవితం ఒక ప్రవాహంవంటిది, కనుక, మనం మన బాధ్యతల ప్రాధాన్యతలను మారుస్తూ ఉండాలి, మనకు మద్దతు ఇచ్చే జీవితంలోని అన్ని అంశాల

Read More »
8th july 2025 soul sustenance telugu

ప్రేమను ఆపేక్షలతో సమానం చేయకండి

ప్రతి రోజు మీ వాట్సప్ లో ఒక మంచి విషయాన్ని తెలుసుకునేందుకు మన స్వభావాలు, విలువలు, లక్ష్యాలకు అనుగుణంగానే ఇతరులు ప్రవర్తించాలని మనం సాధారణంగా కోరుకుంటాం. ఎవరైనా మన అంచనాలకు తగ్గట్లుగా ఉంటే, వారు

Read More »