Hin

10th jan 2024 soul sustenance telugu

January 10, 2024

భగవంతుని స్మరణ సహజంగా మరియు సులభంగా చేయడం

ఆధునిక మానవుల సాధారణ ఫిర్యాదులలో ఒకటి, మనం మన భౌతిక కళ్ళతో భగవంతుణ్ణి  చూడలేము కనుక నిరంతరం వారిని స్మరించుకోవడం కష్టం. అలాగే, చాలా మంది మెడిటేషన్ గురించి, భగవంతునితో అనుసంధానం గురించి విన్నప్పుడు, వారు ఆ ఆలోచనతో ఏకీభవించరు మరియు వారు మెడిటేషన్ చేసే ప్రయత్నం చేయరు. మెడిటేషన్ చాలా సులభమని ఆధ్యాత్మికత బోధిస్తుంది,  దానిని అభ్యసించడం వల్ల మనల్ని భగవంతుడికి దగ్గర చేస్తుంది. అలాంటి ఆధ్యాత్మిక ప్రయాణంలో మనం అందమైన అనుభవాలను పొందవచ్చు. మెడిటేషన్ ని సహజంగా మరియు సులభంగా చేయడానికి 5 మార్గాలను చూద్దాం –

  1. భగవంతునిపై విశ్వాసం కలిగి ఉండండి మరియు వారిని తెలుసుకోండి – భగవంతునితో లోతైన మరియు అర్థవంతమైన సంబంధాన్ని ఏర్పరచుకోవడంలో మొదటి మరియు ప్రధానమైన దశ — భగవంతుణ్ణి లోతుగా తెలుసుకోవడం – వారి నామం , రూపం, గుణాలు, పాత్ర మరియు వారి నివాస స్థానం. తదుపరి దశ ఈ జ్ఞానంపై విశ్వాసం.
  2. భగవంతుని జ్ఞానాన్ని విని వారిని బాగా తెలుసుకోవడం – భగవంతునితో లోతైన సంబంధాన్ని ఏర్పరచుకోవడంలో తదుపరి దశ ఏమిటంటే, స్వయంగా ఇచ్చిన జ్ఞానం ద్వారా, ఆధ్యాత్మికత ద్వారా వారు నా పట్ల అనగా ఆత్మ పట్ల కలిగి ఉన్న ఆలోచనలు, వారు తన గురించి వ్యక్తం చేసే ఆలోచనలు మరియు భావాలను తెలుసుకోవడం.
  3. మెడిటేషన్ నేర్చుకోండి – మెడిటేషన్ అనేది భగవంతునితో అనుసంధానించడానికి ఒక అందమైన మరియు సృజనాత్మక పద్ధతి. కానీ దాని యొక్క ఖచ్చితమైన పద్ధతి మనకు తెలియకపోతే మనం దానిలో విజయాన్ని పొందలేము. భగవంతుడిని దగ్గరగా మరియు సరైన పద్ధతితో తెలుసుకున్న తర్వాత మనం మెడిటేషన్ చేస్తే, మన జీవితాలలో మార్పు వచ్చి మనం శక్తిని పొందుతాము.
  4. మీ జీవిత ప్రయాణంలో మెడిటేషన్ ని ఒక స్థిరమైన భాగంగా చేసుకోండి – మెడిటేషన్ స్థిరంగా ఉన్నప్పుడు అందంగా ఉంటుంది. ధ్యానంతో కూడిన ప్రతి చర్యను కర్మయోగం అంటారు. కర్మయోగం మనం ఇంతకు ముందెన్నడూ అనుభవించని శాంతి, ఆనందాలను ఇస్తుంది. మనల్ని మంచి, స్వచ్ఛమైన మరియు శక్తివంతమైన ఆత్మలుగా చేస్తుంది.
  5. మీ జీవితంలోని వివిధ రంగాలలో మెడిటేషన్ ని ఉపయోగించండి – మీరు శారీరకంగా లేదా మానసికంగా బాగా లేనప్పుడు లేదా మీ సంబంధాలలో శాంతి, ప్రేమ లేదా ఆనందం లేనప్పుడు లేదా పనిలో ఇబ్బంది ఉన్నప్పుడు, ఏదైనా సమస్యను పరిష్కరించడానికి మెడిటేషన్ ని ఉపయోగించండి. ఇలా చేయడంతో అది మీ జీవితంలో ఒక స్థిరమైన భాగంగా అవుతుంది.

మీ సమీపంలో ఉన్న రాజయోగ మెడిటేషన్ సెంటర్ కొరకు

రికార్డు

30th april 2025 soul sustenance telugu

విజయం యొక్క 5 అందమైన అంశాలు (పార్ట్ 3)

ప్రతి రోజు మీ వాట్సప్ లో ఒక మంచి విషయాన్ని తెలుసుకునేందుకు జీవితంలోని వివిధ లక్ష్యాలను సాధించేటప్పుడు మనం ఎంత వినయంగా మరియు నిజాయితీగా ఉన్నాము అనేదే మన విజయం. నమ్రత అన్నింటికంటే గొప్ప

Read More »
29th april 2025 soul sustenance telugu

విజయం యొక్క 5 అందమైన అంశాలు (పార్ట్ 2)

ప్రతి రోజు మీ వాట్సప్ లో ఒక మంచి విషయాన్ని తెలుసుకునేందుకు విజయం అంటే మన జీవతపు క్వాలిటి పెరగడం. మనం ఖరీదైన కారు,  ఖరీదైన బట్టలు కొనుగోలు చేసి  గర్వపడతాము. కొన్నిసార్లు ఈ

Read More »
28th april 2025 soul sustenance telugu

విజయం యొక్క 5 అందమైన అంశాలు (పార్ట్ 1)

ప్రతి రోజు మీ వాట్సప్ లో ఒక మంచి విషయాన్ని తెలుసుకునేందుకు మనమందరం మనకు మరియు ఇతరులకు సాధ్యమైనంత ఉత్తమమైన రీతిలో ప్రయోజనం చేకూర్చే పనులు చేసే ప్రత్యేకమైన వారము. ఉద్యోగంలో, మార్కెట్‌కు వెళ్లేటప్పుడు,

Read More »