Hin

22nd may 2024 soul sustenance telugu

May 22, 2024

భిన్నంగా ఉన్న వారి పట్ల దయకలిగి ఉండటం

మీరు ప్రపంచాన్ని ఇతరులకు భిన్నంగా ఎలా చూస్తున్నారో గుర్తించడం ద్వారా మాత్రమే మీకు భిన్నంగా ఉన్న వారి పట్ల దయ కలిగి ఉండాలనే అవగాహనను పెంపొందించుకోవచ్చు. భిన్నంగా ఉన్న వారు అంటే మీరు కలిసే ప్రతి ఒక్కరూ.

ఇతరుల ప్రవర్తనల గురించి తీర్పు చెప్పడం లేదా విమర్శించడం మనలో చాలా మందికి సహజంగా వస్తుంది. వారి గురించి మనం ఏమనుకుంటున్నామో అది సరైనదని మనం ఎల్లప్పుడూ భావిస్తాము. మనం వ్యక్తులను ఒప్పు లేదా తప్పు అని చాలా తేలికగా పేరు పెడతాము. అయితే ఎవరి ప్రకారం ఒప్పు లేదా తప్పు? మన దృక్కోణం ప్రకారం. ఒకే పరిస్థితిని వేర్వేరు వ్యక్తులు వేర్వేరుగా గ్రహిస్తారు. మనం వాటిని అర్థం చేసుకోలేము ఎందుకంటే మనం మన దృష్టికోణం ద్వారా మాత్రమే విషయాలను చూడగలం. మన సంస్కారాలు మరియు గత అనుభవాల ఆధారంగా మన దృష్టికోణం రూపొందించబడింది. ఈ సంస్కారాలు లెన్స్‌గా మారతాయి, దీని ద్వారా మనం పరిస్థితిని చూస్తాము. వేర్వేరు వ్యక్తులు దానిని విభిన్నంగా గ్రహిస్తారు మరియు మనం తరచుగా చెప్పుకుంటూ ఉంటాము – మేము వారిని అసలు అర్థం చేసుకోలేము! అని. ఎదీ తప్పు లేదా ఒప్పు కాదని, కేవలం మనం భిన్నంగా ఉన్నామని అర్థం చేసుకుందాం. తల్లిదండ్రులు సరైనవారు, పిల్లలు తప్పు; భర్త ఒప్పు, భార్య తప్పు; బాస్ ఒప్పు, సబార్డినేట్ తప్పు – ఈ తప్పు-ఒప్పులు సంబంధాలలో  నమ్మకం మరియు గౌరవం లేకుండా చేస్తాయి. మనం కేవలం భిన్నంగా ఉన్నాము, మనలో ప్రతి ఒక్కరం వేర్వేరు సంస్కారాలను కలిగి ఉన్నాము. మన స్వంత సంస్కారాల లెన్స్ ద్వారా మాత్రమే పరిస్థితిని చూడగలుగుతాము. కాబట్టి మనలో ప్రతి ఒక్కరూ ఎల్లప్పుడూ మన దృక్కోణం ప్రకారం సరిగ్గానే చూస్తాము.

ఈ అవగాహనతో మనం ప్రతి ఒక్కరినీ చూడటం ప్రారంభించినప్పుడు మనం విమర్శించడం మాని దయ చూపిస్తాము. వారి పట్ల మన ప్రేమ మరియు గౌరవం స్థిరంగా ఉంటుంది. మనకి వారు ఎంత అసమంజసంగా కనిపించినప్పటికీ, వారికి తమ సంస్కారాల ప్రకారం వారికి అలా అనిపిస్తుందని, వారు అలా ప్రవర్తిస్తున్నారని మరియు వారు ఖచ్చితంగా సరైనవారని గుర్తుంచుకోండి.

మీ సమీపంలో ఉన్న రాజయోగ మెడిటేషన్ సెంటర్ కొరకు

రికార్డు

15th dec 2024 soul sustenance telugu

వ్యక్తులను నిజాయితీగా, ఉదారంగా మెచ్చుకోవడం

మన చుట్టూ ఉన్న వ్యక్తులు వారు ఎవరో, వారు ఏమి చేస్తున్నారో అనే దానికి ఇప్పటికే పొందిన దానికంటే కొంచెం ఎక్కువ ప్రశంసలు కోరుకుంటారు. గుర్తింపు అనేది వ్యక్తి యొక్క స్ఫూర్తిని మరియు సమర్థతను

Read More »
14th dec 2024 soul sustenance telugu

ప్రపంచ పరివర్తనలో మహిళల పాత్ర

ప్రపంచంలో ప్రత్యేకమైనవారిగా చేసే అనేక మంచి సుగుణాలు మరియు శక్తులతో మహిళలు ఆశీర్వదించబడ్డారు. భగవంతుడు వారి ప్రత్యేకతలను చాలా ప్రేమిస్తారు. స్వచ్ఛత, శాంతి, ప్రేమ మరియు ఆనందాల కొత్త ప్రపంచాన్ని సృష్టించడంలో వారిని ముందుంచుతారు.

Read More »
13th dec 2024 soul sustenance telugu

గెలుపు, ఓటములపై మీ ఆత్మగౌరవం ఆధారపడుతుందా (పార్ట్ 2)

మిమ్మల్ని మీరు ఆత్మిక దృష్టితో చూడటం ప్రారంభించండి, అప్పుడు మీరు సదా విజయవంతమయ్యారని మీకు అనిపిస్తుంది – ఆధ్యాత్మిక జ్ఞానం మనల్ని మనం ఆత్మిక దృష్టితో లేదా జ్ఞాన నేత్రాలతో చూసుకోవాలని బోధిస్తుంది. మన

Read More »