Hin

22nd May 2025 Soul Sustenance Telugu

May 22, 2025

భోజనం చేసే ముందు భగవంతునికి ఆహారాన్ని అర్పించడం వల్ల కలిగే 7 ప్రయోజనాలు

మన ఆధ్యాత్మిక జీవితంలో మనం అలవర్చుకోవల్సిన ఒక అందమైన అలవాటు, భగవంతుని ధ్యానంలో ప్రతి భోజనాన్ని వండడం. అలాగే, ఒక రోజులో ప్రధానంగా వండిన కనీసం ఒక(లేదా అంతకంటే ఎక్కువ)  పదార్ధంతో పాటు తాజా పండ్లు, త్రాగునీరు మరియు మీ వంటగదిలో తాజాగా తయారు చేసిన దేనినైనా భగవంతునికి అర్పించవచ్చు. మన మునుపటి సందేశాలలో వివరించిన విధంగా 10-15 నిమిషాలు ధ్యానం చేయవచ్చు, కానీ భగవంతునితో కనెక్ట్ అవ్వడంతో పాటు, వారి స్వచ్ఛత మరియు ప్రేమ యొక్క ప్రకంపనలను మన ముందు ఉన్న ఆహారానికి ప్రసరింపజేయాలి, ఇది ప్రత్యేక బాక్సులలో ఉంచబడుతుంది మరియు ఆ బాక్సులను ప్రత్యేక ప్లేట్లో ఉంచుతారు, ఈ రెండింటినీ ప్రతిరోజూ దీనికే ఉపయోగించాలి మరియు ఈ అభ్యాసం తర్వాత ప్రతిరోజూ కడగాలి. బోక్సులతో ఉన్న మొత్తం ప్లేట్ను ఒక స్వచ్ఛమైన తెల్లటి వస్త్రంతో కప్పవచ్చు, ఈ వస్త్రాన్ని కూడా దీని కోసమే ఉపయోగించాలి. భగవంతుడిని గుర్తుచేసే మెడిటేషన్ మ్యూజిక్ లేదా ఆధ్యాత్మిక పాటను పెట్టుకోవచ్చు. ఈ స్వచ్ఛమైన, అందమైన రోజువారీ అభ్యాసం యొక్క 7 ప్రయోజనాలు ఈ క్రింది వివరించాము –

  1. పరమాత్మ స్మృతి యొక్క చార్ట్ను పెంచుతుంది.
  2. మనం తినే ఆహారాన్ని శుద్ధి చేస్తుంది, ఫలితంగా భగవంతుని వైబ్రేటీన్లతో నిండిన శుద్ధి చేసిన ఆహారాన్ని తినేటప్పుడు ఆత్మని, సూక్ష్మ శరీరాన్ని అలాగే భౌతిక శరీరాన్ని శుద్ధి చేస్తుంది.
  3. ఎవరి ధ్యానంలో మనం ఆహారాన్ని వండామో ఆ భగవంతునికి మరియు ఆహారం తయారు చేయబడిన భౌతిక అంశాలకు కృతజ్ఞతలు తెలియజేసే అలవాటును మనలో పెంపొందిస్తుంది.
  4. మనలో నెమ్మదిగా మరియు జాగ్రత్తగా తినే అలవాటును పెంపొందిస్తుంది, ఎందుకంటే మనం ఆహారం తినేటప్పుడు కూడా భగవంతుడిని గుర్తుంచుకుంటాము.
  5. మనం ఆధ్యాత్మికంగా మరింత ఉత్సాహంగా మరియు శాంతి, ప్రేమ, ఆనందంతో నిండినప్పుడు మన శారీరక, మానసిక, భావోద్వేగ, సామాజిక మరియు ఆధ్యాత్మిక ఆరోగ్యం మెరుగుపడుతుంది.
  6. భగవంతునితో మన సంబంధాన్ని మరింత బలోపేతం చేసి, ఆయన దగ్గరకు తీసుకువస్తుంది. ఆయన పట్ల మన ప్రేమను పెంచుతుంది.
  7. ఇతరులను కూడా భగవంతునికి దగ్గర చేస్తుంది. భగవంతుని వైబ్రేషన్లతో నిండిన ఆహారాన్ని వారికి వడ్డించేటప్పుడు ఆయన పవిత్రతను మరియు ప్రేమను అనుభూతి చేయడానికి వారికి సహాయపడుతుంది.

రికార్డు

15th June 2025 Soul Sustenance Telugu

వ్యక్తులు మీపై ఆధారపడేలా చేయవద్దు

ప్రతి రోజు మీ వాట్సప్ లో ఒక మంచి విషయాన్ని తెలుసుకునేందుకు కొంతమందికి లేదా కొన్ని పరిస్థితులకు మనమే ఎంతో ముఖ్యమని, మనం లేకుండా వారు జీవితాన్ని గడపలేరనే నమ్మకంతో మనం తరచుగా జీవిస్తుంటాము.

Read More »
14th June 2025 Soul Sustenance Telugu

భగవంతుడు – ఈ సృష్టి యొక్క ఆది బిందువు

ప్రతి రోజు మీ వాట్సప్ లో ఒక మంచి విషయాన్ని తెలుసుకునేందుకు భగవంతుడు సర్వ శక్తివంతుడు. వారు ఉంటేనే ఈ ప్రపంచం ఉంటుంది, ఎందుకంటే ఈ ప్రపంచంలో  మంచితనం మరియు దైవత్వం క్షీణించిన ప్రతిసారీ

Read More »
13th June 2025 Soul Sustenance Telugu

మిమ్మల్ని మీరు ఎలా ఆశీర్వదించుకోవాలి?

ప్రతి రోజు మీ వాట్సప్ లో ఒక మంచి విషయాన్ని తెలుసుకునేందుకు మన జీవితంలో సాధువులు, తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు, కుటుంబం మరియు స్నేహితుల ఆశీర్వాదాల శక్తిని మనమందరం పొందాము. ఆశీర్వాదం అంటే వారందరూ మన

Read More »