Hin

30th may 2024 soul sustenance telugu

May 30, 2024

భూమిని అందంగా మరియు స్వచ్ఛంగా మార్చడం

మనం నివసిస్తూ అందంగా తయారు చేయటానికి ప్రకృతి మనకు ఇచ్చిన పవిత్ర స్థలం – భూమి. ఈ గ్రహానికి మనం మన ఆంతరిక స్పృహ నుండి శక్తిని ప్రతి క్షణం ప్రసరిస్తాము. మన ఆలోచనలు మరియు భావాల నాణ్యత ఎంత ఎక్కువగా ఉంటే, భూమికి సానుకూలతను, స్వచ్ఛతను దానం చేయడంలో మనం అంతగా దోహదపడతాము. ఇది సాధించడం కోసం మనం కొన్ని ధృవీకరణలను సృష్టించి, వాటిని ప్రతిరోజూ మళ్లీ మళ్లీ గుర్తుంచుకుందాం –

  1. నేను మంచి మనస్సు మరియు హృదయంతో ఉన్న స్వచ్ఛమైన ఆత్మను … నాకు, చుట్టూ ఉన్న ప్రతి వారికి మరియు నా చుట్టూ ఉన్న ప్రతిదానికీ నేను మంచిని మరియు సానుకూలంగా ఆలోచిస్తాను … నా వైబ్రేషన్లు ప్రకృతిలోని ప్రతి తత్వానికి, ప్రతి జీవికి, అన్ని మొక్కలు మరియు వృక్షాలకు ప్రసరిస్తాయి … అవి శాంతి, ప్రేమ మరియు ఆనందంతో నిండి ఉంటాయి …
  2. నేను అన్ని ఆధ్యాత్మిక శక్తులతో నిండిన శక్తివంతమైన ఆత్మను … నేను భూమిపై ఉన్న ప్రతిదానికీ శక్తిని ప్రసరింపజేస్తాను మరియు దాని అసలైన సంపదను పునరుజ్జీవింపజేస్తాను … ప్రతి పువ్వు వికసిస్తుంది, ప్రతి జంతువుకీ నిండుగా అనిపిస్తుంది, అన్ని పర్వతాలు మరియు సాగరాలు సమృద్ధిగా ప్రవహిస్తాయి, నేల యొక్క ప్రతి కణం సహజ సౌందర్యాన్ని సృష్టిస్తుంది…
  3. నేను ప్రపంచ వృక్షానికి ఆధ్యాత్మిక బీజమైన భగవంతునితో కనెక్ట్ అవుతాను … వారు తమ విశేషతలతో నన్ను నింపుతారు … నేను ఈ రోజు భూమిపై చూసే ప్రతిదానికీ ఈ విశేషతలన్నింటినీ నా కళ్ళ ద్వారా ప్రసరిస్తాను … నేను భూమికి చిరునవ్వుతో ధన్యవాదాలు చెప్తాను … భూమి నన్ను చూసి చిరునవ్వు నవ్వుతూ తిరిగి ధన్యవాదాలు చెప్తుంది …

4. నేను ఈ రోజు భూమిపై ప్రతి అడుగును శ్రద్ధ, జాగ్రత్తగల సానుకూల స్పృహతో వేస్తాను … నా ఆధ్యాత్మిక శక్తి నా పాదాల నుండి భూమికి ప్రవహిస్తుంది, ఆధ్యాత్మిక పాలన మరియు దీవెనలతో భూమిని పోషిస్తుంది … ప్రారంభంలో ఉన్నట్లుగా శుభ్రంగా, స్వచ్ఛంగా, అందంగా మారడానికి భూమి మళ్లీ పునరుజ్జీవిస్తుంది…

మీ సమీపంలో ఉన్న రాజయోగ మెడిటేషన్ సెంటర్ కొరకు

రికార్డు

16th feb 2025 soul sustenance telugu

చక్కటి సంబంధాలను బలపరుచుకోవడానికి అహంకారాన్ని త్యాగం చేయడం (పార్ట్ 2)

మీరు మరొక వ్యక్తిని కలిసినప్పుడల్లా, మీరు మీలాగే ఉండాలి అని నిర్ధారించుకుంటూ, అదే సమయంలో ఎదుటి వ్యక్తిని కూడా వారిని వారిలానే ఉండనివ్వడం ద్వారా మీరు వారికీ ఒక స్వేచ్చని కలిపిస్తారు. దాని అర్థం

Read More »
15th feb 2025 soul sustenance telugu

చక్కటి సంబంధాలను బలపరుచుకోవడానికి అహంకారాన్ని త్యాగం చేయడం (పార్ట్ 1)

సంబంధాలు జీవితానికి ప్రాధమిక నిధి, కానీ సంబంధంలో ఏ వ్యక్తిలోనైనా అహం పెరిగినప్పుడు అవి తప్పుడు మార్గంలో వెళ్తాయి. వ్యక్తులు ఎల్లప్పుడూ వినయపూర్వకమైన వారితో సంతృప్తి చెందుతారని మీరు కనుగొంటారు. అలాగే అహంకారం లేని

Read More »
14th feb 2025 soul sustenance telugu

విశ్వసించండి. ఇక మీరు విజయం సాధిస్తారు

మీరు మీ పెద్ద లేదా చిన్న లక్ష్యాల గురించి చాలా ఉత్సాహంగా ఉంటూ వాటిని చేరుకోవడానికి చాలా కష్టపడ్డారా… కానీ ఎక్కడో ఒక చోట విజయం సందేహాస్పదంగా అనిపించిందా? అది ఫలితాన్ని ఎలా ప్రభావితం

Read More »