
భగవంతుడు మనతో ఉన్న అనుభూతిని పొందడం వల్ల కలిగే 5 లాభాలు (పార్ట్ 2)
ప్రతి రోజు మీ వాట్సప్ లో ఒక మంచి విషయాన్ని తెలుసుకునేందుకు భగవంతుడు మనతో ఉన్నప్పుడు, మన విధి అందంగా ఉంటుంది నేడు, మనం ప్రతిరోజూ ఒక సాధారణ లక్ష్యంతో జీవిస్తున్నాము – మన
January 14, 2025
మనలాగే, భగవంతుని ఆధ్యాత్మిక రూపం కూడా భౌతిక కళ్ళకు కనిపించని ఉన్నతోన్నతమైన జ్యోతిర్బిందువని తెలుసుకున్న తరువాత, ఎలా మనం భగవంతుడిని అర్థం చేసుకొని వారితో ఎలా అనుసంధానించగలము అనేదానికి బ్రహ్మా కుమారీల 7 రోజుల పరిచయ కోర్సు మార్గనిర్దేశం చేస్తుంది. భగవంతుడు ఉన్నతోన్నతమైన ఆత్మ మరియు ఆధ్యాత్మిక తండ్రి అలాగే మానవ ఆత్మలందరికీ సర్వోన్నతమైన తండ్రి. వారు దేవతలైన శ్రీ రాధాకృష్ణ, శ్రీ లక్ష్మీ నారాయణ, శ్రీ రామ సీత వంటి దివ్యమైన ఆత్మలందరికీ మరియు అబ్రహం, బుద్ధుడు, క్రీస్తు, మహమ్మద్, మహావీరుడు, శంకరాచార్యులు, గురునానక్ మరియు అనేక ఇతర ధర్మ స్థాపకులు మరియు సాధువులకు కూడా తండ్రి. వారిని వివిధ ప్రాంతాలలో , వివిధ ధర్మాలలో హెవెన్లీ గాడ్ ఫాదర్, భగవాన్, ఈశ్వర్, శివ, అల్లా, ఖుదా మరియు యెహోవా వంటి వివిధ పేర్లతో పిలుస్తారు. వారు ఏ మానవ శరీరంలో జన్మించని ఏకైక ఆత్మ. వారు నిత్య శరీరరహితుడు, ఆత్మాభిమాని మరియు స్వచ్ఛమైనవారు. ప్రపంచంలోని ఇతర ఆత్మలందరూ, దివ్యాత్మలు మరియు దేవతలు కూడా భౌతిక రూపాన్ని కలిగి ఉంటూ మానవ శరీరాలలో జన్మిస్తారు.
ఈ కోర్సులో, భగవంతుడు శాంతి, సంతోషం, ప్రేమ, ఆనందం, స్వచ్ఛత, శక్తి మరియు జ్ఞానం అనే 7 సుగుణాల సాగరుడని కూడా మనం నేర్చుకుంటాము. వారు ఈ సుగుణాలతో నిత్యం స్థిరంగా ఉంటారు మరియు అనేక జన్మలను తీసుకొని ఎప్పటికీ వాటిని కోల్పోరు. అలాగే, భగవంతుడి ఆధ్యాత్మిక ధామం ఎక్కడ ఉందో మనం అర్థం చేసుకొని ఆ ధామంలో వారిని ఎలా విజువలైజ్ చేస్తూ గుర్తుంచుకోవాలో నేర్చుకుంటాము. భగవంతుని ఆధ్యాత్మిక పిల్లలు అయిన మానవ ఆత్మల ఆధ్యాత్మిక గృహమైన పరంధామం లేదా నిరాకారీ ప్రపంచం కూడా అదే. చివరగా మరియు చాలా ముఖ్యంగా, ప్రపంచ నాటకంలో భగవంతుని అత్యంత ముఖ్యమైన కార్యం ఏమిటి అని తెలుసుకుంటాము. వారు ఇనుప యుగం లేదా కలియుగాన్ని స్వర్ణ యుగం లేదా సత్యుగంగా ఎలా మారుస్తారో మనకు తెలుస్తుంది. అలాగే, కామం, కోపం, దురాశ, మోహం, అహం, అసూయ మరియు ద్వేషం వంటి దుర్గుణాలతో నిండిన మానవులను దైవిక సుగుణాలు మరియు అందమైన విశేషతలతో నిండిన దేవతలగా వారు ఎలా మారుస్తారు అని తెలుసుకుంటాము. దేవతల జీవితాలు స్వచ్ఛత, శాంతి, ప్రేమ మరియు ఆనందంతో నిండి ఉంటాయి.
(సశేషం…)
ప్రతి రోజు మీ వాట్సప్ లో ఒక మంచి విషయాన్ని తెలుసుకునేందుకు భగవంతుడు మనతో ఉన్నప్పుడు, మన విధి అందంగా ఉంటుంది నేడు, మనం ప్రతిరోజూ ఒక సాధారణ లక్ష్యంతో జీవిస్తున్నాము – మన
ప్రతి రోజు మీ వాట్సప్ లో ఒక మంచి విషయాన్ని తెలుసుకునేందుకు ప్రతి ఉదయం మనం రోజును ప్రారంభించినప్పుడు, వివిధ చర్యలను చేయాల్సి ఉంటుంది. మనం ఇంట్లో ఉన్నా లేదా మన ఆఫీసులో ఉన్నా
ప్రతి రోజు మీ వాట్సప్ లో ఒక మంచి విషయాన్ని తెలుసుకునేందుకు మనలో చాలా మంది మనది వినాలని లేదా మనమంటే ఆసక్తికరంగా అనిపించాలని అందరితో మాట్లాడుతూ ఉండాలి అని భావిస్తాము. ఈ ఆత్రుత
Start your day with a breeze of positivity and stay motivated with these daily affirmations
After Clicking on Join, You will be redirected to Whatsapp Community to receive daily message. Your identitiy will be secured and no group member will know about another group member who have joined.