Hin

15th jan 2025 soul sustenance telugu

January 15, 2025

బ్రహ్మా కుమారీల 7 రోజుల కోర్సు (పార్ట్ 3)

ఆత్మ మరియు భగవంతుని జ్ఞానాన్ని పంచుకున్న తరువాత, బ్రహ్మా కుమారీల 7 రోజుల పరిచయ కోర్సు ప్రపంచ నాటకం అంటే ఏమిటి మరియు అది 4 యుగాలతో ఎలా రూపొందించబడిందో మనకు బోధిస్తుంది – సత్యుగం, త్రేతాయుగం, ద్వాపరయుగం మరియు కలియుగం. అందులో మనందరికీ విభిన్న జన్మలు ఉంటాయి. ప్రపంచ నాటకం యొక్క వ్యవధి 5000 సంవత్సరాలు మరియు 4 యుగాలలో ప్రతి ఒక్కటి 1250 సంవత్సరాలు అని భగవంతుడు చెప్తారు. 5000 సంవత్సరాల నాటి ఈ ప్రపంచ నాటకం భూమిపై ఈ భౌతిక ప్రపంచంలో అనాదిగా మళ్లీ మళ్లీ రిపీట్ అవుతుంది. 5000 సంవత్సరాలలో, మానవ ఆత్మలు పరంధామం నుండి భౌతిక ప్రపంచానికి వేర్వేరు సమయాల్లో, వారి స్వచ్ఛతను బట్టి, భౌతిక ప్రపంచంలో వారి విభిన్న పాత్రలను (జన్మలు) పోషించడానికి వస్తారు. స్వచ్ఛమైన ఆత్మలు భూమిపైకి ముందు వస్తారు. 5000 సంవత్సరాల ప్రపంచ నాటకం ముగింపులో, ప్రతి సారి, భగవంతుడు ఆత్మలందరినీ పావనంగా చేస్తారు, వారు పావనమైన తర్వాత పరంధామానికి తిరిగి వెళ్తారు. పరంధామంలో కొంత కాలం విశ్రాంతి మరియు సైలెన్స్ తరువాత, ప్రపంచ నాటకం దానంతట అదే రిపీట్ అయినప్పుడు భౌతిక ప్రపంచంలో వారి నిర్ణీత సమయానికి తిరిగి వస్తారు. 

మొదటి 2500 సంవత్సరాల ప్రపంచ నాటకం యొక్క మొదటి 2 యుగాలు సానుకూలత మరియు స్వచ్ఛతతో నిండి ఉంటాయి. ఈ సమయంలో దుఃఖం మరియు అశాంతి ఉండవు. అకాల మరణం లేకుండా పూర్తి మంచి ఆరోగ్యం మరియు దీర్ఘాయువు, చాలా స్వచ్ఛమైన మరియు దైవిక భౌతిక సౌందర్యం, సమృద్ధిగా ఉన్న సంపద, అందమైన మరియు ఆనందకరమైన సంబంధాలు. ఆత్మలందరూ దైవిక సుగుణాలతో, దైవిక మంచితనంతో నిండి ఉంటారు. ఈ రోజు ఉన్నట్లుగా స్త్రీ పురుషుల శారీరక ఐక్యత ద్వారా కాకుండా వారి మధ్య ఆధ్యాత్మిక ఐక్యత మరియు స్వచ్ఛమైన ఆలోచనా శక్తి ద్వారా పిల్లలు జన్మిస్తారు. పిల్లలకు జన్మనిచ్చే ఈ రకమైన ఆధ్యాత్మిక స్వచ్ఛమైన పద్ధతి మన మత గ్రంథాలలో మరియు పురాతన గ్రంథాలలో ప్రస్తావించబడింది. ఇవి రాగి యుగంలో మొదటి 2500 సంవత్సరాల తరువాత వ్రాయబడ్డాయి. ఈ మొదటి 2500 సంవత్సరాలను స్వర్గం అని అంటారు. స్వర్గంలో నివసించే వారిని దేవీ దేవతలు అని పిలుస్తారు, వీరిని నేటికీ ప్రపంచంలో చాలా ఆరాధిస్తారు.

(సశేషం…)

రికార్డు

25th june 2025 soul sustenance telugu

జీవితంలో విజయం సాధించడానికి మిమ్మల్ని మీరు ప్రేరేపించుకోవడం (పార్ట్ 2)

ప్రతి రోజు మీ వాట్సప్ లో ఒక మంచి విషయాన్ని తెలుసుకునేందుకు ప్రతి రోజు భగవంతుని జ్ఞానంలోని ప్రేరణాత్మక వాక్యాలను చదవండి మనం రోజంతా వేర్వేరు సమయాల్లో అనేక రకాల జ్ఞానాన్ని చదువుతాము మరియు

Read More »
24th june 2025 soul sustenance telugu

జీవితంలో విజయం సాధించడానికి మిమ్మల్ని మీరు ప్రేరేపించుకోవడం (పార్ట్ 1)

ప్రతి రోజు మీ వాట్సప్ లో ఒక మంచి విషయాన్ని తెలుసుకునేందుకు మనమందరం మనం చేసే ప్రతి పనిలో బాగా చేయాలనే సానుకూల ఉద్దేశ్యంతో మన జీవితాలను గడుపుతున్నాము, అందుకు మన రోజంతా జీవితంలోని

Read More »
23rd june 2025 soul sustenance telugu

ప్రతిరోజును ఫిర్యాదు లేని రోజుగా చేసుకోండి

ప్రతి రోజు మీ వాట్సప్ లో ఒక మంచి విషయాన్ని తెలుసుకునేందుకు ఒక వ్యక్తి లేదా పరిస్థితి గురించి మనం చివరిసారిగా ఎప్పుడు ఫిర్యాదు చేసాము? చాలా కాలమయ్యి ఉండకపోవచ్చు… నిన్ననే కావచ్చు. మన

Read More »