Hin

16th Jan 2025 Soul Sustenance Telugu

January 16, 2025

బ్రహ్మా కుమారీల 7 రోజుల కోర్సు (పార్ట్ 4)

ప్రపంచ నాటకం యొక్క తదుపరి 2 యుగాలు అనగా తదుపరి 2500 సంవత్సరాలలో స్వర్గంలో దైవిక మానవుల చేతనంలో ఉన్న దేవతలు,  ఆత్మిక స్మృతి  నుండి శారీరిక స్మృతికి  మారినప్పుడు, వారు స్వయాన్ని దేవి దేవతలుగా  కాకుండా మానవులుగా పిలవడం ప్రారంభించకున్నారు. అప్పటినుండి ఒకే నిరాకారుడిని , స్వర్గంలో ఉన్న స్వచ్ఛమైన దేవాత్మల విగ్రహాలను, రాగి యుగం లేదా ద్వాపర్యుగంలో, ఇనుప యుగం లేదా కలియుగంలో భూమిపైకి దిగడం ప్రారంభించిన ఇతర దివ్య ఆత్మలను, సాధువులను కూడా వారు ఆరాధించడం ప్రారంభించారు. ఈ ప్రపంచాన్ని నరకం లేదా హెల్ అని పిలుస్తారు. ఈ ప్రపంచంలో అపవిత్రత, దుఃఖం, అశాంతి ఉంటూ స్వర్గం యొక్క అన్ని ప్రాప్తులు  నెమ్మదిగా తగ్గుతాయి. అలాగే 5000 సంవత్సరాల చివరిలో లేదా ప్రస్తుత సమయం అయిన ఇనుప యుగం ముగింపులో కనిష్ట స్థాయికి చేరుకుంటాయి. స్వర్గంలో, ఒకే రాజ్యం, ఒకే మతం, ఒకే భాష ఉంటుంది మరియు దేవతల మధ్య పూర్తి ఐక్యత ఉంటుంది. నరకంలో, అనేక విభిన్న ప్రభుత్వాలు, మతాలు, భాషలు ఉన్నాయి మరియు ప్రజలలో ఐక్యత, సమైక్యత లోపించింది.

ఈ ప్రపంచ నాటకం గురించి స్పష్టంగా తెలిసిన వారు ఒకే ఒక్క భగవంతుడు మాత్రమే. కాని ఇప్పుడు  ప్రపంచ నాటకం గురించి, దాని వ్యవధి మరియు దాని విభిన్న యుగాల గురించి మనం నేర్చుకునే లేదా వినే ప్రతిదీ భగవంతునితో మానవుల వ్యక్తిగత సంబంధం లేదా అనుభవం ఆధారంగా, వారి వ్యక్తిగత వ్యాఖ్యానం ఆధారంగా ఉంటుంది. 

రాగి యుగం మరియు ఇనుప యుగంలో పరంధామం నుండి వచ్చిన దివ్యమైన ఆత్మలు, స్వచ్ఛమైన ఆధ్యాత్మిక ఆత్మలు ఒకే విధమైన జ్ఞానాన్ని ఇవ్వకపోవడానికి ఇదే కారణం. వాస్తవానికి, రాగి యుగం మరియు ఇనుప యుగంలో వ్రాయబడిన అన్ని ఆధ్యాత్మిక గ్రంథాలు, దివ్యమైన ఆత్మలు అందరు ఆత్మ, భగవంతుడు మరియు ప్రపంచ నాటకం యొక్క జ్ఞానం గురించి భిన్నంగా మాట్లాడతాయి. ప్రస్తుత సమయంలో, మనం ఇనుప యుగం చివరిలో ఉన్నప్పుడు భగవంతుడు తన జ్ఞానాన్ని ఇస్తారు, ఇది రాగి యుగం మరియు ఇనుప యుగంలో చెప్పబడిన అన్ని బోధనల యొక్క సారాంశం మరియు సత్యం. ఈ సమయంలో, అశాంతి, దుఃఖం, దుర్గుణాలు, పాపాలు గరిష్ట స్థాయికి చేరుకున్నాయి. ప్రపంచంలో చాలా జనాభా ఉంది. ఆహారం, నీరు, స్వచ్ఛమైన గాలి మరియు వివిధ భౌతిక శక్తుల వంటి వనరుల కొరత కారణంగా మనుగడ కష్టంగా ఉంది. అలాగే, గ్లోబల్ వార్మింగ్, వాతావరణ మార్పుల కారణంగా ప్రపంచం ప్రమాదాలను ఎదుర్కొంటోంది. ఇతర ప్రకృతి వైపరీత్యాలు, యుద్ధాల ప్రమాదాలు కూడా ఉన్నాయి. 

(సశేషం…)

రికార్డు

21st May 2025 Soul Sustenance Telugu

మీ వాస్తవిక సత్య గుణానికి తిరిగి వెళ్లడం

ప్రతి రోజు మీ వాట్సప్ లో ఒక మంచి విషయాన్ని తెలుసుకునేందుకు సత్యం మన వాస్తవిక గుణం, కానీ ఎప్పటికప్పుడు మన సౌలభ్యం కోసం లేదా స్వల్పకాలిక లాభాల కోసం అబద్ధాలు చెబుతాము. ఆసక్తికరమైన

Read More »
20th May 2025 Soul Sustenance Telugu

మీ పిల్లలతో తగినంత సమయం గడపకపోవడంపై అపరాధ భావాన్ని అధిగమించండి

ప్రతి రోజు మీ వాట్సప్ లో ఒక మంచి విషయాన్ని తెలుసుకునేందుకు వివిధ రకాల వ్యక్తిగత మరియు వృత్తిపరమైన నిబద్ధతలను గౌరవించేటప్పుడు, చాలా మంది తల్లిదండ్రులు తమ పిల్లలకు తగినంత నాణ్యమైన సమయాన్ని ఇవ్వకపోవడం

Read More »
19th May 2025 Soul Sustenance Telugu

మార్పులో స్థిరంగా ఉండటానికి 5 మార్గాలు

ప్రతి రోజు మీ వాట్సప్ లో ఒక మంచి విషయాన్ని తెలుసుకునేందుకు స్వయంతో మాట్లాడుతూ ఆత్మపరిశీలన చేసుకోండి – మన జీవితంలో ఏ రకమైన మార్పును చూసినా, మార్పు యొక్క విభిన్న దృశ్యాలకు ప్రభావితం

Read More »