Hin

18th jan 2025 soul sustenance telugu

January 18, 2025

బ్రహ్మా కుమారీల 7 రోజుల కోర్సు (పార్ట్ 6)

బ్రహ్మా కుమారీలకు  కొత్తగా వచ్చినవారు అడిగే ఒక సాధారణ ప్రశ్న ఏమిటంటే, మనం కేవలం ధ్యానం మాత్రమే ఎందుకని నేర్చుకోలేము? ఆధ్యాత్మిక జ్ఞానాన్ని వివరించే 7 రోజుల కోర్సు యొక్క వివిధ సెషన్లకు మనం ఎందుకు హాజరు కావాలి ? ఎందుకంటే ప్రధానంగా కొందరు ధ్యానం ద్వారా మనశ్శాంతిని, ఆనందాన్ని వెతుకుతున్నారు. ఒత్తిడి నుండి స్వేచ్ఛను అనుభూతి చేసుకోవాలనుకుంటున్నారు. అలాగే, ధ్యానం చేయడం ద్వారా జీవిత రోజువారీ సమస్యలను ఎదుర్కోవటానికి వారి అంతర్గత శక్తిని  పెంచుకోవాలని కోరుకుంటారు. ఈ ప్రశ్నకు సమాధానం చాలా సులభం. ఆత్మ, భగవంతుడు మరియు ప్రపంచ నాటకం యొక్క పూర్తి జ్ఞానాన్ని మనం స్పష్టంగా అర్థం చేసుకోకపోతే, మనం ధ్యానంలో భగవంతునితో సరిగ్గా కనెక్ట్ అవ్వలేము, ధ్యానం యొక్క ప్రాముఖ్యతను మనం లోతుగా గ్రహించలేము. మనలను శాంతి మరియు ఆనందంతో నింపడమే కాకుండా, అది మనలను కూడా శుద్ధి చేస్తుంది. రాగి యుగం నుండి అనేక జన్మలలో ఆత్మలో పేరుకుపోయిన మన ప్రతికూల సంస్కారాలన్నింటినీ శుభ్రపరుస్తుంది.  అలాగే, పూర్తి జ్ఞానాన్ని మనం స్పష్టంగా అర్థం చేసుకోకపోతే మంచి నాణ్యమైన అందమైన ధ్యానానికి అవసరమైన ఆత్మ పరమాత్మల ఆధ్యాత్మిక సంబంధాన్ని మనం సరిగ్గా, లోతుగా అనుభవించలేము.

 

7 రోజుల కోర్సుకు ఎటువంటి ఛార్జీలు లేవు మరియు మీరు ఖర్చు చేయాల్సింది మీ 7 గంటల సమయం మాత్రమే. ఈ 7 గంటలు మీ మొత్తం జీవితాన్ని మారుస్తాయి. మానసికంగా, భావోద్వేగపరంగా మరియు శారీరకంగా అన్ని విధాలుగా జీవితం యొక్క నాణ్యతను పెంచుతాయి. ఎందుకంటే మీరు ఆధ్యాత్మికత, ఆధ్యాత్మిక జ్ఞానం మరియు కర్మ సిద్ధాంతానికి సంబంధించిన మీ అన్ని ప్రశ్నలకు సమాధానాలు పొందుతారు. మీరు స్వచ్ఛమైన సానుకూల జీవనశైలిని ఎలా గడపాలో నేర్చుకుంటారు. మీరు కూడా భగవంతునికి  దగ్గరవుతూ వారిని  పూర్తిగా తెలుసుకుంటూ ధ్యానంలో వారిని గుర్తుంచుకోవడం ప్రారంభిస్తారు. ఈ కోర్సులో పాల్గొనడానికి ఆసక్తి ఉన్న ఎవరైనా, వారి సమీప బ్రహ్మా కుమారీల కేంద్రాన్ని సంప్రదించవచ్చు, ఇది భగవంతుని ఆధ్యాత్మిక గృహం లాంటిది, ఇక్కడ మీ ఆధ్యాత్మిక తల్లి తండ్రి అయిన భగవంతుడు మీకు ఆధ్యాత్మిక జ్ఞానం యొక్క కీ ఇస్తారు, ఇది మీ భాగ్యాన్ని ఎల్లప్పటికీ శాశ్వతంగా మారుస్తుంది.

రికార్డు

15th feb 2025 soul sustenance telugu

చక్కటి సంబంధాలను బలపరుచుకోవడానికి అహంకారాన్ని త్యాగం చేయడం (పార్ట్ 1)

సంబంధాలు జీవితానికి ప్రాధమిక నిధి, కానీ సంబంధంలో ఏ వ్యక్తిలోనైనా అహం పెరిగినప్పుడు అవి తప్పుడు మార్గంలో వెళ్తాయి. వ్యక్తులు ఎల్లప్పుడూ వినయపూర్వకమైన వారితో సంతృప్తి చెందుతారని మీరు కనుగొంటారు. అలాగే అహంకారం లేని

Read More »
14th feb 2025 soul sustenance telugu

విశ్వసించండి. ఇక మీరు విజయం సాధిస్తారు

మీరు మీ పెద్ద లేదా చిన్న లక్ష్యాల గురించి చాలా ఉత్సాహంగా ఉంటూ వాటిని చేరుకోవడానికి చాలా కష్టపడ్డారా… కానీ ఎక్కడో ఒక చోట విజయం సందేహాస్పదంగా అనిపించిందా? అది ఫలితాన్ని ఎలా ప్రభావితం

Read More »
13th feb 2025 soul sustenance telugu

స్వీయ నియంత్రణ కళలో ప్రావీణ్యం పొందటం

మనమందరం బాగా జీవించడానికి మన జీవితాలపై నియంత్రణ కలిగి ఉండాలని కోరుకుంటాము. మన మనస్సు, బుద్ధి మరియు స్వభావాన్ని నియంత్రించడం మన శక్తి. అది మన భౌతిక ఇంద్రియాలను కూడా ఆటోమేటిక్ గా నియంత్రిస్తుంది.

Read More »