Hin

23rd jan 2024 soul sustenance telugu

January 23, 2024

క్యాన్సర్ నుండి ప్రపంచాన్ని రక్షించడానికి ఆధ్యాత్మిక చర్యలు

ప్రతి సంవత్సరం లక్షల కొద్దీ కొత్త కేసులు మరియు అధిక మరణాలతో క్యాన్సర్ నేడు ప్రపంచంలో ఒక పెద్ద సవాలుగా ఉంది. అనేక  క్యాన్సర్ రోగులు అనుభవించే నొప్పి, బాధలు రోజురోజుకు వ్యాధిని మరింత ప్రమాదకరంగా మారుస్తుంది. అత్యుత్తమ ఆరోగ్య సంరక్షణ ఉన్నప్పటికీ, అధునాతన చికిత్స అందుబాటులో ఉన్నప్పటికీ, మానవ శరీరాల్లో ఈ వ్యాధి రాకుండా నిరోధించలేకపోతున్నాము. క్యాన్సర్‌తో వ్యవహరించడంలో మనం ప్రపంచానికి ఎలా సహాయం చేయవచ్చు? కొన్ని ఆధ్యాత్మిక చర్యలను చూద్దాం:

 

  1. ప్రతిరోజూ మీ స్పృహలో సానుకూల ఆలోచనను ఉంచండి – నేను ఈ ప్రపంచానికి ఏంజెల్ ను. ఈ ప్రపంచంలో క్యాన్సర్‌ను అనుభవించిన ప్రతి ఆత్మకు ప్రేమ, సంరక్షణ మరియు శక్తిని ప్రసరింపజేస్తాను. వారంతా నా సోదరీ సోదరులు, వారందిరికీ సహాయాన్ని అందించడానికి నేను ఒక సాధనం.

 

  1. చికిత్స కంటే నివారణే మేలు అని అందరికి తెలియపరచండి – ఈ రోజు నేను ప్రపంచవ్యాప్తంగా ఒత్తిడి లేని జీవితాన్ని గడపడం యొక్క ప్రాముఖ్యతను సృష్టించాలి. క్యాన్సర్‌కు ముఖ్యమైన కారణాలలో ఒకటైన ఒత్తిడి నుండి విముక్తికి కీలకమైనది మెడిటేషన్. నేను కలిసే ప్రతి ఒక్కరితో అది ఎలా చేయాలనే దాని గురించి పంచుకోవాలి.

 

  1. నా భౌతిక శరీరాన్ని జాగ్రత్తగా చూసుకుంటూ, మనస్సు మరియు శరీరానికి మేలు చేసే భగవంతుని స్మరణలో వండిన శాఖాహార భోజనం తీసుకుంటూ, తగినంత నిద్ర, వ్యాయామం మరియు ప్రశాంతమైన విశ్రాంతిని తీసుకుంటూ నేను కూడా ఇతరులకు ఆదర్శంగా మారాలి. నాకు తెలిసిన వారు, ప్రతిరోజూ నాతో సంభాషించే ఇతరులు కూడా అదే విధంగా చేసి, క్యాన్సర్ రాకుండా నిరోధించడానికి ప్రేరేపించబడతారు.

 

  1. క్యాన్సర్‌తో సహా జీవితంలోని అన్ని సవాళ్లతో పోరాడటానికి ఆత్మ, భగవంతుడు మరియు వారి సుగుణాల జ్ఞానం నేడు చాలా అవసరం. అలాగే, ఈ రోజు ప్రపంచంలోని అతిపెద్ద అడ్డంకులలో ఒకటైన క్యాన్సర్‌ను స్థిరంగా ఎదుర్కోవడంలో కర్మ సిద్ధాంతం గురించి లోతుగా తెలుసుకోవడం చాలా ముఖ్యం. బ్రహ్మా కుమారీలు తమ కోర్సులలో ఈ జ్ఞానాన్ని అందిస్తారు. ఇందులో రాజయోగ మెడిటేషన్ యొక్క అందమైన టెక్నిక్ కూడా ఉంటుంది. దీనిని ప్రపంచవ్యాప్తంగా ఉన్న వారి కేంద్రాలలో లక్షల మంది నేర్చుకుంటున్నారు మరియు వారి వ్యక్తిగత, వృత్తిపరమైన జీవితాలలో ప్రతిరోజూ సాధన చేస్తున్నారు.

మీ సమీపంలో ఉన్న రాజయోగ మెడిటేషన్ సెంటర్ కొరకు

రికార్డు

17th june2024 soul sustenance telugu

పోటీ పడటం మానండి… ఈ క్షణాన్ని ఆస్వాదించండి (పార్ట్ 1)

ప్రతి ఆత్మ సంతోషాన్ని కోరుకుంటుంది. సంతోషంగా ఉండటం కోసం సంతోషాన్ని వెతుకుతుంటాము. ఆరోగ్యం, అందం, ధనము, పాత్ర వంటి ఇతర గమ్యాలు కూడా విలువైనవే ఎందుకంటే అవి మనకు సంతోషాన్నిస్తాయి అని మనం భావిస్తాము.

Read More »
16th june2024 soul sustenance telugu

 దేవీ దేవతల 36 దివ్య గుణాలు

నిన్నటి సందేశంలో, దేవీ దేవతలలో ఉన్న 36 దివ్య గుణాలను ప్రస్తావించాము. మనం పరిపూర్ణంగా, స్వచ్ఛంగా మరియు ప్రశంసనీయంగా తయారవ్వటానికి మనలో ప్రతి గుణం చెక్ చేసుకొని ధారణ చేద్దాము. ఈ గుణాలన్నింటినీ మనం

Read More »
15th june2024 soul sustenance telugu

దేవి దేవతల 5 అర్హతలు

కలియుగం (ఇనుప యుగం) చివరిలో మరియు సత్యయుగం (స్వర్ణయుగం) ప్రారంభానికి ముందు, మానవాళికి రాత్రి మరియు మానవాళికి పగలు మధ్య ఉన్న ప్రస్తుత సంగమయుగంలో భగవంతుడు మానవులను దేవీ దేవతలుగా మారుస్తున్నారు. దేవీ దేవతలకు

Read More »