Hin

4th may 2024 soul sustenance telugu

May 4, 2024

చక్కని పెంపకంలో ఉన్న ఆనందాన్ని ఆస్వాదించండి (పార్ట్ 1)

మన సంతానంతో మన జీవితాన్ని అందమైన కుటుంబంగా  జీవించడానికి ఇష్టపడతాము.  పిల్లలు స్వచ్ఛమైన స్పృహతో సున్నితమైన వారు. తల్లిదండ్రులుగా, వారిని మంచి వారిగా పెంచడానికి సరైన మార్గాలను తెలుసుకోవాలని భావిస్తాము. చక్కని పెంపకంలో ఉన్న ఆనందాన్ని వెతుకుతున్నప్పుడు  మనం వివిధ రకాల సవాళ్లను ఎదుర్కొంటాము. ఆ క్షణాలలో, మీరు మీపై నమ్మకంతో ఉండడం,  మీ అంతరాత్మకు సన్నిహితంగా ఉండటం ముఖ్యం. తల్లిదండ్రులుగా ఉండటం సహజంగా వస్తుంది అనేది కొత్తగా తల్లిదండ్రులు అయినవారిలో ఉన్న అపోహ.  మనలో చాలా మందికి ప్రేమ మరియు సంరక్షణ వాటంతట అవే రావచ్చు, కానీ అవి మంచి తల్లిదండ్రులుగా ఉండడానికి నిర్వచనాలు కాదు. పిల్లలను పెంచడానికి ఇది ఒక భాగం మాత్రమే.

 

మొదటగా , పిల్లలపై మోహం మరియు ఆధిపత్యం యొక్క భావాన్ని దూరం చేసుకోవడం ముఖ్యం. వారి గత కర్మలతో మనం వారిని మరొక ఆత్మగా చూసే ముక్త బంధాన్ని అలవాటు చేసుకునే ప్రయత్నం చేయాలి.  పిల్లలను కలిగి ఉండటం ఒక ప్రత్యేకత అయినప్పటికీ చెడు ప్రభావం నుండి వారిని రక్షించడం మన పాత్ర అని కూడా మనం అర్థం చేసుకోవాలి. కానీ ఆ ప్రక్రియలో, వారిలో భయాన్ని కలిగించకూడదు ఎందుకంటే  ఇది భవిష్యత్తు లో ఇతరుల సహాయం కోరలేని పిరికి వారిని చేస్తుంది. హెచ్చరించడం మరియు అనవసరమైన భయాన్ని కలిగించడం మధ్య సన్నని రేఖను గీయడం ఒక కళ. తల్లిదండ్రులుగా, పిల్లలకు కలుపుగోలుతనం నేర్పడం కూడా చాలా ముఖ్యం. ప్రేమపూర్వకమైన మరియు ప్రోత్సాహాన్ని ఇచ్చే  వాతావరణనాన్ని  తయారు చేయడం ద్వారా వారు సంబంధాలలో ఇవ్వడం యొక్క ప్రాముఖ్యతను తెలుసుకుంటారు. ఇది జీవితాన్ని అనుభవం చేసుకోవటంలో సహాయపడుతుంది. పిల్లల ప్రయోజనం కోసం, వారిలో శక్తిని నింపేందుకు  భావన మరియు బాధ్యతగల తల్లిదండ్రులుగా వారు కూడా అంతే సంతోషంగా ఉండాలి.  ఇది పిల్లలను సానుకూలంగా పెంచడానికి అవసరమైన వాతావరణాన్ని తయారు చేసి జీవితంలో అనాయాసంగా ప్రయాణించేలా సహాయపడుతుంది.

(సశేషం …)

మీ సమీపంలో ఉన్న రాజయోగ మెడిటేషన్ సెంటర్ కొరకు

రికార్డు

17th sep 2024 soul sustenance telugu

ఇతరులను అనుమానించడం ఆపండి, వారిని నమ్మడం ప్రారంభించండి

మనలో కొంతమందికి మన సంబంధాలలో వ్యక్తులను అనుమానించే సూక్ష్మమైన అలవాటు ఉంటుంది. కొన్నిసార్లు ఒకరి గురించి మనకున్న సందేహాలు వారితో కంటే కూడా మన అలవాటులతో ఎక్కువ సంబంధించబడి ఉంటాయి. మన అనారోగ్యకరమైన సందేహాలు,

Read More »
16th sep 2024 soul sustenance telugu

ఆంతరికంగా ఉన్న స్వయాన్ని గుర్తించి అనుభవం చేసుకోవటం (పార్ట్ 3)

మనం మన జీవితంలో ఎక్కువ భాగం మన ప్రత్యేకతలు, వ్యక్తిత్వం లేదా పాత్రతో అనుబంధం కొనసాగిస్తే, కాలక్రమేణా మనం గుర్తించబడటానికి వేచి ఉన్న నిజమైన స్వభావాన్ని మరచిపోతాము. పైన పేర్కొన్నవాటిలో నేను ఒకడిని, అని

Read More »
15th sep 2024 soul sustenance telugu

ఆంతరికంగా ఉన్న స్వయాన్ని గుర్తించి అనుభవం చేసుకోవటం (పార్ట్ 2)

ఇతరుల దృష్టికోణాల కళ్ళజోళ్ళతో మనల్ని మనం చూసుకోవటానికి అలవాటు పడ్డాము. అవి భౌతిక వైఖరులపై ఆధారపడి ప్రాపంచిక దృష్టితో మసక బారాయి. ఈ రోజు, మనలోని మంచి అని భావించే దానంతటికీ మరియు ఇతరులు

Read More »