Hin

15th feb 2025 soul sustenance telugu

February 15, 2025

చక్కటి సంబంధాలను బలపరుచుకోవడానికి అహంకారాన్ని త్యాగం చేయడం (పార్ట్ 1)

సంబంధాలు జీవితానికి ప్రాధమిక నిధి, కానీ సంబంధంలో ఏ వ్యక్తిలోనైనా అహం పెరిగినప్పుడు అవి తప్పుడు మార్గంలో వెళ్తాయి. వ్యక్తులు ఎల్లప్పుడూ వినయపూర్వకమైన వారితో సంతృప్తి చెందుతారని మీరు కనుగొంటారు. అలాగే అహంకారం లేని వారి సంబంధాలు సమస్య రహితమైనవి మరియు అభిప్రాయ భేదాలు లేనివి. అలాగే, ఏ వ్యక్తి అయినా సరైన సమయంలో మరియు అవసరమైనప్పుడు తన అహంభావాన్ని త్యాగం చేయడం నేర్చుకునే వారున్న సంబంధం, నిరంతర శాంతి మరియు సద్భావన కలిగి ఉంటుంది. చాలా తరచుగా సంబంధంలో అడ్డంకులకు ఏకైక కారణం నేను, నాకు మరియు నాది అనే భావాన్ని త్యాగం చేయలేకపోవడం. ఇది కొన్నిసార్లు చాలా వింతగా అనిపిస్తుంది. కానీ అహంకారాన్ని మలచుకొని, త్యాగం చేసి అవతలి వ్యక్తి ఆశించినట్లుగా ఉండనివ్వనందున చాలా సంబంధాలలో ప్రేమ అంతమవుతుంది. అభిప్రాయాల తేడాలు తరచుగా అన్ని సంబంధాలలో కనిపిస్తాయి, కానీ వాటిని పరిష్కరించగలగడం మరియు వాటిని అధిగమించగలగడం అనేది వాస్తవానికి ప్రతి మానవుడు ఏదో ఒక సమయంలో ఎదుర్కోవాల్సిన సవాలు. మనమందరం ప్రేమతో నిండిన సంబంధాలను కోరుకుంటాం, కానీ అంతగా అవసరమైన త్యాగం మనం చేయగలమా? దాని అర్థం ఏమిటి? ఇలాంటివి – నేను ఓడిపోతాను లేదా నేను ఎల్లప్పుడూ సరైనవాడిని కాదు లేదా దయచేసి నా కంటే ముందు వెళ్ళండి లేదా మీరు బాధ్యతలు స్వీకరించండి లేదా మీరు నాకంటే మంచివారని అంగీకరించడం.

 

కొన్నిసార్లు కుటుంబంలో లేదా కార్యాలయంలో అనేక రకాల సంబంధాలలో ఇది కనిపిస్తుంది, మొదట ప్రతిదీ బాగానే ఉంటుంది, తరువాత సమయం గడిచేకొద్దీ ఇద్దరు వ్యక్తులు ఒకరికొకరు దగ్గరవుతారు, అపార్థాలు వస్తాయి. ఈ సంబంధం చుక్కాని లేని పడవలా మారి, దాని దిశను కోల్పోతుంది. ఇది ఎందుకు జరుగుతుంది మరియు ప్రారంభంలోనే ఎందుకు జరగదు? ప్రారంభంలో హృదయాలు దగ్గరగా ఉంటాయి మరియు త్యాగం చేయడం, సంబంధంలో తక్కువ ఆధిపత్యం కలిగిన వ్యక్తిగా ఉండటం వంటి ప్రతిదీ సులభం. కానీ నెమ్మదిగా ఇద్దరు వ్యక్తులు ఒకరినొకరు తేలికగా తీసుకోవడం ప్రారంభిస్తారు మరియు పూర్తిగా అర్థం చేసుకోవటంతో ఉన్న అందమైన సంబంధంలా అనిపించినది ఇక దుఃఖం మరియు వ్యక్తిత్వ ఘర్షణల ముళ్ళతో నిండి ఉంటుంది.

(సశేషం…)

రికార్డు

28th march 2025 soul sustenance telugu

సోషల్ మీడియా లైక్‌లు ముఖ్యమా?

ప్రతి రోజు మీ వాట్సప్ లో ఒక మంచి విషయాన్ని తెలుసుకునేందుకు సోషల్ మీడియా ఆధారిత సమాజంలో, మనం పోస్ట్ చేసే దానిపై ప్రజల ఆమోదం పొందడం మన స్వీయ-విలువ మరియు కీర్తికి కొలమానంగా

Read More »
27th march 2025 soul sustenance telugu

6 రకాల సంతృప్తులను మీ జీవితంలో భాగం చేసుకోండి

ప్రతి రోజు మీ వాట్సప్ లో ఒక మంచి విషయాన్ని తెలుసుకునేందుకు నేను నాతో సంతృప్తిగా ఉన్నానా – నాతో, నా సంస్కారాలతో, నా ఆలోచనలతో, మాటలు మరియు చర్యలతో సంతృప్తి చెందడం మరియు

Read More »
26th march 2025 soul sustenance telugu

ఈజీగా ఉండండి , బిజీగా కాదు

ప్రతి రోజు మీ వాట్సప్ లో ఒక మంచి విషయాన్ని తెలుసుకునేందుకు నేను చాలా బిజీగా ఉన్నాను…నాకు సమయం లేదు అని తరచుగా అంటూ ఉంటాము. ఇలాంటి మనస్తత్వం మనల్ని సమయానికి ప్రాధాన్యత ఇవ్వనివ్వదు.

Read More »