Hin

16th feb 2025 soul sustenance telugu

February 16, 2025

చక్కటి సంబంధాలను బలపరుచుకోవడానికి అహంకారాన్ని త్యాగం చేయడం (పార్ట్ 2)

మీరు మరొక వ్యక్తిని కలిసినప్పుడల్లా, మీరు మీలాగే ఉండాలి అని నిర్ధారించుకుంటూ, అదే సమయంలో ఎదుటి వ్యక్తిని కూడా వారిని వారిలానే ఉండనివ్వడం ద్వారా మీరు వారికీ ఒక స్వేచ్చని కలిపిస్తారు. దాని అర్థం ఏమిటంటే, అవతలి వ్యక్తి వారు కోరుకున్న విధంగా తమను తాము వ్యక్తీకరించుకోనివ్వండి, మీరు కోరుకునే విధంగా వారు వ్యక్తీకరించాలని లేదా వ్యవహరించాలని కాదు. వారు మీ చేతుల్లో తోలుబొమ్మలా ఉండకూడదు. వారికి చెప్పండి, వారికి మార్గనిర్దేశం చేయండి, కానీ మీరు ఖచ్చితంగా సరైనదని, పరిపూర్ణమైనదని భావించే మీ అభిప్రాయాన్ని, మీ దృక్పథాన్ని, మీ గుణం లేదా నిర్దిష్ట సంస్కారం పట్ల వ్యామోహాన్ని త్యాగం చేయడానికి ఎల్లప్పుడూ సిద్ధంగా ఉండండి. మీ ఇద్దరికీ సంబంధించిన పరిస్థితిని అవతలి వ్యక్తి తన అభిప్రాయం శాసించడానికి కూడా మీరు సిద్ధంగా ఉండండి. కొంతమంది దీనిని సంబంధాలలో చేయటానికి చాలా కష్టమైన పనిగా భావిస్తారు. దీనికి ఆధ్యాత్మిక శక్తి మరియు అవతలి వ్యక్తి పట్ల మీలో చాలా ప్రేమ కూడా అవసరం. అలాగే, మనకు వినయం మరియు సంతృప్తి వంటి లక్షణాలు చాలా ముఖ్యమైనవి. ఇది ఏ సంబంధమైనా కావొచ్చు, మీ ఇంట్లో లేదా మీ ఫ్రెండ్ సర్కిల్లో, లేదా మరెక్కడైనా కావొచ్చు, అది ఆడవారితో లేదా మగవారితో, మీ బిడ్డతో లేదా మీ యజమానితో, స్నేహితుడితో లేదా మీ జీవిత భాగస్వామితో కూడా కావొచ్చు.

 

మీరు సరైనది అని భావించే దాని పట్ల మరియు ఒక నిర్దిష్ట పరిస్థితి గురించి మీకు తెలిసిన దాని పట్ల చాలా ఆత్మగౌరవంతో ఉండడం మరియు ఆ ఆలోచనా ప్రక్రియలో అవతలి వ్యక్తి కూడా సహకరించే అవకాశం ఇవ్వటానికి సూక్ష్మ వ్యత్యాసం ఉంది. దాని అర్థం ఏమిటంటే, మీ ఆలోచనా ప్రక్రియలోని ఆ వ్యక్తిగత కోణంలోకి అవతలి వ్యక్తిని ప్రవేశించడానికి మీరు అనుమతించాలి. చాలా తరచుగా మనం మన ఆలోచనా ప్రక్రియ చుట్టూ గోడలను నిర్మిస్తాము, అవతలి వ్యక్తి ఆ ప్రదేశంలో ఆధిపత్యం చెలాయిస్తాడనే భయం లేదా మన స్వంత స్థలంతో వ్యామోహం కారణంగా అవతలి వ్యక్తిని లోపలికి అనుమతించము. ఇతరుల అభిప్రాయాలతో సౌకర్యంగా ఉంటూ, వాటిని గౌరవిస్తూ, తమ స్వంత అభిప్రాయాలు మరియు దృక్కోణాల వలె వారి అభిప్రాయాలకు కూడా గౌరవం ఇచ్చేవారే అందరి హృదయాలను ఏలేవారు అని గుర్తుంచుకోండి. వ్యక్తులు అధికారం ద్వారా పాలించబడరు, కానీ వారి ప్రేమ మరియు గౌరవాన్ని తిరిగి పొందడానికి వారి మనసులను ప్రేమతో నింపాలి. శారీరక స్థాయిలోనే కాకుండా ఆలోచన స్థాయిలో మరియు భావోద్వేగాల స్థాయిలో కూడా పరస్పర చర్యలలో మరొకరిని మీ కంటే ముందు ఉంచినప్పుడు ఇది జరుగుతుంది.

(సశేషం…)

రికార్డు

28th march 2025 soul sustenance telugu

సోషల్ మీడియా లైక్‌లు ముఖ్యమా?

ప్రతి రోజు మీ వాట్సప్ లో ఒక మంచి విషయాన్ని తెలుసుకునేందుకు సోషల్ మీడియా ఆధారిత సమాజంలో, మనం పోస్ట్ చేసే దానిపై ప్రజల ఆమోదం పొందడం మన స్వీయ-విలువ మరియు కీర్తికి కొలమానంగా

Read More »
27th march 2025 soul sustenance telugu

6 రకాల సంతృప్తులను మీ జీవితంలో భాగం చేసుకోండి

ప్రతి రోజు మీ వాట్సప్ లో ఒక మంచి విషయాన్ని తెలుసుకునేందుకు నేను నాతో సంతృప్తిగా ఉన్నానా – నాతో, నా సంస్కారాలతో, నా ఆలోచనలతో, మాటలు మరియు చర్యలతో సంతృప్తి చెందడం మరియు

Read More »
26th march 2025 soul sustenance telugu

ఈజీగా ఉండండి , బిజీగా కాదు

ప్రతి రోజు మీ వాట్సప్ లో ఒక మంచి విషయాన్ని తెలుసుకునేందుకు నేను చాలా బిజీగా ఉన్నాను…నాకు సమయం లేదు అని తరచుగా అంటూ ఉంటాము. ఇలాంటి మనస్తత్వం మనల్ని సమయానికి ప్రాధాన్యత ఇవ్వనివ్వదు.

Read More »