Hin

28th november 2024 soul sustenance telugu

November 28, 2024

చింత లేని స్మృతిలో ఉండడం

మీ మనస్సు నిరంతరం ఆలా అయితే, ఎలా మరి, ఏమిటి, ఎప్పుడు అవుతుంది మొదలైన వాటి గురించి ఆందోళనలతో మునిగిపోతుందా? మీరు మీ జీవితాన్ని, ప్రపంచాన్ని ఎల్లప్పుడూ ఏదో ఒక ప్రబలమైన ముప్పు ఉన్నట్లుగా ప్రతికూల విధాలుగా చూస్తారా? నిరంతర ఆందోళన అనేది సవాళ్లను ఎదుర్కొనే మన సామర్థ్యాన్ని స్తంభింపజేస్తుంది. ఇది మనల్ని అలసిపోయేలా చేయటమే కాకుండా మన జీవితంలోకి మరింత ప్రతికూలతను కూడా ఆకర్షిస్తుంది. మీరు చింతించడం అలవాటు చేసుకున్నారా? మీరు మీ గురించి లేదా మీ ప్రియమైనవారి గురించి ప్రతికూల స్క్రిప్ట్ లను వ్రాస్తున్నారా, నిరంతరం చెడుకి భయపడుతున్నారా? చింత అనేది మన మనస్సు ప్రతికూల ఆలోచనలను సృష్టించినందుకు ఫలితం. మన చింతలు చాలావరకు గతం గురించి, అవి నియంత్రించలేనివి, అవ్వి ఎన్నటికీ కార్యరూపం దాల్చవు. కానీ చింత యొక్క ప్రతికూల వైబ్రేషన్లు మనల్ని క్షీణింపజేస్తాయి, మన పరిస్థితులకు ప్రసరింపజేస్తాయి మరియు వాటిని క్లిష్టతరం చేస్తాయి. మనం ఎక్కువగా ప్రేమ పేరుతో ఇతరుల గురించి చింతిస్తాము. చింతించడానికి బదులు, మనం శ్రద్ధ వహిద్దాము. శ్రద్ధ సానుకూల వైబ్రేషన్లను ప్రసరింపజేస్తుంది. శ్రద్ధ  వహించడంతో మనం ఉన్నతమైన ఆలోచనలను సృష్టిస్తాము, ఈ ఆలోచనలు జీవితంలో సానుకూలతను ఆకర్షిస్తాయి. మనమూ, మన జీవితం మంచిగా ఉండటానికి మనల్ని మనం విశ్వసించుదాం. మనం ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. మనం చేయలేని వాటిని అంగీకరిస్తూ మార్చగలిగిన వాటిని మార్చగలిగే శక్తి మనకు ఉంది.

 

మీరు శక్తివంతమైన వ్యక్తి అని ప్రతిరోజూ మీకు మీరు గుర్తు చేసుకోండి. మీ ఆంతరిక శక్తిని సృష్టించుకోండి. ఈ రోజు ప్రతి సన్నివేశంలో మీ శక్తిని ఉపయోగించుకోండి. మీరు నిర్భయంగా ఉన్నారు. శాంతిగా జీవించండి, తద్వారా దానిని విశ్వంలోకి ప్రసరింపజేయండి. పరిస్థితి ఏమైనప్పటికీ, ప్రశాంతంగా స్పందించండి. మీ జీవితం అందంగా ఉంటుంది, ఆరోగ్యం పరిపూర్ణంగా ఉంటుంది, సంబంధాలు సామరస్యంగా ఉంటాయి మరియు మీ వృత్తి విజయవంతమవుతుంది. దేని గురించి చింతించకండి. మీ మనసును జాగ్రత్తగా చూసుకోండి. ప్రతి గంట తరువాత మీ ఆలోచనలను చెక్ చేసుకోవటానికి ఒక నిమిషం విరామం ఇస్తూ చింత యొక్క స్వల్ప జాడలు ఏమైనా ఉంటే వాటిని మార్చుకోండి. ప్రతిరోజూ ధ్యానం, ఆధ్యాత్మిక అధ్యయనంతో మీ మనస్సును పోషించుకోండి. ప్రతిరోజూ మీ ఆంతరిక శక్తిని పెంచుకోండి. స్థిరత్వంతో ఏదైనా ఒత్తిడిని ఎదుర్కోవటానికి స్థితిస్థాపకతను పెంపొందించుకోండి. మీ కర్మలపై దృష్టి పెట్టండి. వాటిని సరిగ్గా ఉంచండి, తద్వారా మీరు మీ భవిష్యత్తు గురించి చింతించాల్సిన అవసరం లేదు. మీ సరైన ఆలోచనలు, మాటలు మరియు ప్రవర్తన యొక్క పరిణామాలు మీకు సురక్షితమైన భవిష్యత్తును సృష్టిస్తాయి. దేని గురించీ చింతించకండి. ఏదైనా సవాలు ఉన్నప్పటికీ, చింతించకండి. మీరు సమస్య పరిష్కారకర్త. మీ ఆంతరిక నిశ్చలత సమస్యకు శక్తిని ప్రసరింపజేస్తూ పరిస్థితిని గందరగోళం నుండి ప్రశాంతతకు మారుస్తుంది. మీ జీవితంలో ప్రతిదీ పరిపూర్ణంగా ఉంటుంది మరియు ఎల్లప్పుడూ ఉంటుంది.

మీ సమీపంలో ఉన్న రాజయోగ మెడిటేషన్ సెంటర్ కొరకు

రికార్డు

28th march 2025 soul sustenance telugu

సోషల్ మీడియా లైక్‌లు ముఖ్యమా?

ప్రతి రోజు మీ వాట్సప్ లో ఒక మంచి విషయాన్ని తెలుసుకునేందుకు సోషల్ మీడియా ఆధారిత సమాజంలో, మనం పోస్ట్ చేసే దానిపై ప్రజల ఆమోదం పొందడం మన స్వీయ-విలువ మరియు కీర్తికి కొలమానంగా

Read More »
27th march 2025 soul sustenance telugu

6 రకాల సంతృప్తులను మీ జీవితంలో భాగం చేసుకోండి

ప్రతి రోజు మీ వాట్సప్ లో ఒక మంచి విషయాన్ని తెలుసుకునేందుకు నేను నాతో సంతృప్తిగా ఉన్నానా – నాతో, నా సంస్కారాలతో, నా ఆలోచనలతో, మాటలు మరియు చర్యలతో సంతృప్తి చెందడం మరియు

Read More »
26th march 2025 soul sustenance telugu

ఈజీగా ఉండండి , బిజీగా కాదు

ప్రతి రోజు మీ వాట్సప్ లో ఒక మంచి విషయాన్ని తెలుసుకునేందుకు నేను చాలా బిజీగా ఉన్నాను…నాకు సమయం లేదు అని తరచుగా అంటూ ఉంటాము. ఇలాంటి మనస్తత్వం మనల్ని సమయానికి ప్రాధాన్యత ఇవ్వనివ్వదు.

Read More »