Hin

6th march 2025 soul sustenance telugu

March 6, 2025

చింతించే అలవాటును అధిగమించడం (పార్ట్ 2)

నిన్నటి సందేశంలో, ఆందోళన అనేది ఎలా మనస్సు, బుద్ధి యొక్క  పాజిటివ్ మరియు నిర్మాణాత్మక సామర్థ్యాన్ని తప్పుగా ఉపయోగించడం అని వివరించాము. మరోవైపు, సాధ్యమయ్యే పాజిటివ్ ఫలితాలను ఊహించడం వల్ల నెగిటివ్ ఫలితాలను మన నుండి దూరంగా ఉంచడమే కాకుండా (ఒక వేళ అవి సంభవించే అవకాశం ఉన్నప్పటికీ), పాజిటివ్ ఫలితాలను మన వైపుకు ఆకర్షిస్తాయి. కానీ ఈ రెండు ప్రక్రియలు జరిగేలా చూసుకోవడానికి, మీ మనస్సు, బుద్ధి లో కొంచం కూడా నెగిటివ్ ఫలితాలను జోడించకుండా ఉండటం ముఖ్యం. లేకపోతే, పాజిటివ్ భవిష్యత్తు వాస్తవికతగా మారే సంభావ్యత తగ్గుతుంది. ఆందోళన అనేది ఈ జోడించే ప్రక్రియకు మరో పదం.


ఆందోళన అనేది ఒక రకమైన మానసిక అలవాటు, ఇది ఆందోళన చెందడం మంచిదనే నమ్మకం నుండి పుడుతుంది. ఈ నమ్మకం మన చిన్నతనంలోనే అలవడుతుంది. ఆపై అది మన జీవిత అనుభవాలతో బలపడుతుంది. మనము ఈ నమ్మకంతో ప్రారంభిస్తాము. ఇది నెగిటివ్ పరిస్థితులను ఆకర్షిస్తుంది. ఫలితంగా, నమ్మకం మరింత బలపడుతుంది, ఎందుకంటే మనం జీవితంలో చాలా నెగిటివ్ పరిస్థితులతో నిండినందున, నెగిటివ్ ఫలితాల గురించి ముందే ఆలోచించడం చాలా ముఖ్యం అని అనిపిస్తుంది. మొదట ఈ నమ్మకం కారణంగానే, ఈ నెగిటివ్ పరిస్థితులు సంభవించాయని మనం గ్రహించము. మనం నెగిటివ్ పరిస్థితిని ఎదుర్కొన్నప్పుడు, మనం ఆ నమ్మకాన్ని కలిగి ఉన్నందున మళ్లీ ఆందోళన చెందుతాము. మళ్ళీ, అదే ఫలితం లభిస్తుంది. ఈ విధంగా, మనము ఒక విష చక్రంలో చిక్కుకుంటాము. ఈ చక్రం నుండి మనం ఎలా బయటపడాలి? ఆందోళన చెందడం మంచిది కాదు – అని ఈ నమ్మకాన్ని  మార్చడం ద్వారా. ఒకసారి మనం అలా చేస్తే, మన జీవితంలో నెగిటివ్ పరిస్థితులు పూర్తిగా ఆగిపోతాయని ఎటువంటి హామీ లేదు, ఎందుకంటే మనం గతంలో (ఈ జన్మలో లేదా గత జన్మలలో) నెగిటివ్ చర్యలను చేసాము, వాటిని మన వర్తమానంలో తీర్చుకోవాలి, కానీ నెగిటివ్ పరిస్థితుల పరిధి తగ్గుతుంది. మరియు అవి వచ్చినప్పటికీ, మనకు చింత లేని మనస్థితి ఉంటే, అవి త్వరగా వెళ్లిపోతాయి.

రికార్డు

28th march 2025 soul sustenance telugu

సోషల్ మీడియా లైక్‌లు ముఖ్యమా?

ప్రతి రోజు మీ వాట్సప్ లో ఒక మంచి విషయాన్ని తెలుసుకునేందుకు సోషల్ మీడియా ఆధారిత సమాజంలో, మనం పోస్ట్ చేసే దానిపై ప్రజల ఆమోదం పొందడం మన స్వీయ-విలువ మరియు కీర్తికి కొలమానంగా

Read More »
27th march 2025 soul sustenance telugu

6 రకాల సంతృప్తులను మీ జీవితంలో భాగం చేసుకోండి

ప్రతి రోజు మీ వాట్సప్ లో ఒక మంచి విషయాన్ని తెలుసుకునేందుకు నేను నాతో సంతృప్తిగా ఉన్నానా – నాతో, నా సంస్కారాలతో, నా ఆలోచనలతో, మాటలు మరియు చర్యలతో సంతృప్తి చెందడం మరియు

Read More »
26th march 2025 soul sustenance telugu

ఈజీగా ఉండండి , బిజీగా కాదు

ప్రతి రోజు మీ వాట్సప్ లో ఒక మంచి విషయాన్ని తెలుసుకునేందుకు నేను చాలా బిజీగా ఉన్నాను…నాకు సమయం లేదు అని తరచుగా అంటూ ఉంటాము. ఇలాంటి మనస్తత్వం మనల్ని సమయానికి ప్రాధాన్యత ఇవ్వనివ్వదు.

Read More »