Hin

24th dec 2023 soul sustenance telugu

December 24, 2023

క్రిస్మస్ లోని ఆధ్యాత్మిక అందాన్ని ఆస్వాదించడం (పార్ట్ 2)

  1. అలాగే, క్రిస్మస్ అంటే రెక్కలు, చేతిలో దివ్య దండెంతో ఉన్న చక్కని ఏంజిల్స్ మనకు గుర్తుకు వస్తారు. రెక్కలు తేలికైన మనసుకు సంకేతం, ఇది స్వచ్ఛత మరియు ఆత్మిక స్పృహ ద్వారా అనుభవం చేసుకోగలం. దివ్యమైన దండెం భగవంతుడి నుండి మనం ఆశీర్వాదాలను పొంది, వాటిని ప్రపంచంలోని ప్రతి ఆత్మతో పంచుతున్న దానికి చిహ్నం. అలాగే, ఏంజిల్స్ అయిన మనం, ప్రస్తుత సమయంలో, ప్రతి ఒక్కరికీ ఆధ్యాత్మిక జ్ఞానం యొక్క దివ్య సందేశాన్ని అందిస్తూ, ఆధ్యాత్మికంగా అజ్ఞాన నిద్ర నుండి వారిని మేల్కొల్పుతున్నాము. ఏంజిల్స్ ను  ముఖం చుట్టూ లేదా తలపై ఒక స్వచ్ఛమైన ప్రకాశంతో చూపిస్తారు, ఇది మేల్కొన్న స్పృహకు సంకేతం.

 

  1. క్రిస్మస్‌ రోజు అందరూ కలిసి ప్రత్యేక భోజనాలతో పాటు ఉల్లాసంగా బహుమతులను ఇచ్చిపుచ్చుకుంటూ ఉంటారు. ఈ ఉత్సవాలన్నింటికీ ఆధ్యాత్మిక ప్రాముఖ్యత ఉంది. మానవులుగా మనం భగవంతుడి నుండి పొందిన ఈశ్వరీయ సౌందర్యాన్ని మరియు మంచితనం అనే కానుకలను ఒకరికొకరు పంచుకొనేదానికి ప్రతీకలు ఈ ఉత్సవాలు. అలాగే, అదే సమయంలో భగవంతుడు మనకు ఆధ్యాత్మిక వివేకం కొరకు ఇచ్చిన మంచి ఆహారాన్ని ఆనందిస్తూ ఉంటాము. వారు మన బుద్ధికి ప్రతిరోజ ఆ పోషణను ఇస్తూ మనల్ని ఆధ్యాత్మికంగా ఆరోగ్యంగా, శక్తివంతంగా చేస్తారు.

 

  1. భగవంతుడు మనతో ఉన్నారని క్రిస్మస్ మనకు గుర్తుచేస్తుంది. మనం ప్రతిరోజూ ఈశ్వరీయ ప్రేమ మరియు వారి నిరంతర తోడును వేడుకను జరుపుకోవాలి. ఆధ్యాత్మిక నషాలో ఉండి, భగవంతుని వలె చాలా మధురంగా ఉండాలి. ప్రతి ఆలోచన, మాట మరియు చేతల ద్వారా ప్రతి ఒక్కరికీ ఆ మాధుర్యాన్ని ప్రసరింపజేయాలి.

(సశేషం)

మీ సమీపంలో ఉన్న రాజయోగ మెడిటేషన్ సెంటర్ కొరకు

రికార్డు

30th april 2025 soul sustenance telugu

విజయం యొక్క 5 అందమైన అంశాలు (పార్ట్ 3)

ప్రతి రోజు మీ వాట్సప్ లో ఒక మంచి విషయాన్ని తెలుసుకునేందుకు జీవితంలోని వివిధ లక్ష్యాలను సాధించేటప్పుడు మనం ఎంత వినయంగా మరియు నిజాయితీగా ఉన్నాము అనేదే మన విజయం. నమ్రత అన్నింటికంటే గొప్ప

Read More »
29th april 2025 soul sustenance telugu

విజయం యొక్క 5 అందమైన అంశాలు (పార్ట్ 2)

ప్రతి రోజు మీ వాట్సప్ లో ఒక మంచి విషయాన్ని తెలుసుకునేందుకు విజయం అంటే మన జీవతపు క్వాలిటి పెరగడం. మనం ఖరీదైన కారు,  ఖరీదైన బట్టలు కొనుగోలు చేసి  గర్వపడతాము. కొన్నిసార్లు ఈ

Read More »
28th april 2025 soul sustenance telugu

విజయం యొక్క 5 అందమైన అంశాలు (పార్ట్ 1)

ప్రతి రోజు మీ వాట్సప్ లో ఒక మంచి విషయాన్ని తెలుసుకునేందుకు మనమందరం మనకు మరియు ఇతరులకు సాధ్యమైనంత ఉత్తమమైన రీతిలో ప్రయోజనం చేకూర్చే పనులు చేసే ప్రత్యేకమైన వారము. ఉద్యోగంలో, మార్కెట్‌కు వెళ్లేటప్పుడు,

Read More »