Hin

25th dec 2023 soul sustenance telugu

December 25, 2023

క్రిస్మస్ లోని ఆధ్యాత్మిక అందాన్ని ఆస్వాదించడం (పార్ట్ 3)

  1. చివరగా, క్రిస్మస్ ప్రతి ఒక్కరినీ ప్రేమ మరియు ఆనందాలతో ఏకమైన బంధంలోకి తీసుకువస్తుంది. ప్రతి ఒక్కరూ భగవంతుడిని స్మరిస్తూ, ఎవరినీ బాధపెట్టమని, ప్రపంచంలో ఐక్యతను సృష్టిస్తామని వారికి వాగ్దానం చేస్తారు. పవిత్ర ఆత్మ అయిన జీసస్ క్రైస్ట్ బోధనల నుండి ప్రేరణ పొందుతారు. జీసస్ క్రైస్ట్ ప్రతి ఒక్కరికీ భగవంతుడిని గుర్తు చేసి, భగవంతుడు సర్వోన్నతుడు, దివ్య పరమ జ్యోతి  అని చెప్పారు. జీసస్ క్రైస్ట్ జ్ఞానం మరియు సత్యం కోసం నిలబడి ప్రపంచానికి మంచితనమనే ప్రకాశాన్ని అందించారు మరియు అందరికీ మంచిని పంచారు.

 

కాబట్టి మనమందరం క్రిస్మస్ పండుగను భగవంతుని స్మరణలో జరుపుకుందాం. దాని ఆధ్యాత్మిక సారాన్ని మన జీవితాల్లోకి తీసుకువద్దాము. పరమాత్మ లేదా ఆధ్యాత్మిక కేంద్ర స్థానంగా పిలవబడే భగవంతుడు స్వర్గ స్థాపకుడు. వారు సద్గుణాలతో నిత్యం విరసిల్లుతూ ఉంటారు. త్వరలో కొత్త ప్రపంచం వాస్తవికతగా మారుతుందని మరియు మనం వారి లాంటి దైవిక వ్యక్తిత్వంతో ఆ ప్రపంచంలోకి ప్రవేశిస్తాము అని పరమాత్మ అంటారు. ఇది బైబిల్‌లో ఇలా జ్ఞాపకం చేయబడింది – భగవంతుడు తన స్వరూపంలో మనిషిని సృష్టించారు. కాబట్టి మనం భగవంతునితో అనుసంధానమై వారి సందేశాన్ని అందరితో పంచుకుందాం. ఇది మనందరికీ భగవంతుని సందేశం – నేను పంచే జ్ఞానాన్ని వింటూ, మెడిటేషన్ ప్రక్రియ ద్వారా నన్ను గుర్తు చేసుకుంటూ నాలాగే పవిత్రంగా మరియు దివ్యంగా మారండి. మెడిటేషన్ లో మీరు స్వచ్ఛమైన పరంధామంలో నా స్వచ్ఛమైన దివ్య బిందురూపంపై దృష్టి పెట్టండి. పరంధామం అనేది విశ్వంతటికీ మరియు పంచ తత్వాల ప్రపంచానికి దూరంగా ఉంటుంది.

మీ సమీపంలో ఉన్న రాజయోగ మెడిటేషన్ సెంటర్ కొరకు

రికార్డు

14th feb 2025 soul sustenance telugu

విశ్వసించండి. ఇక మీరు విజయం సాధిస్తారు

మీరు మీ పెద్ద లేదా చిన్న లక్ష్యాల గురించి చాలా ఉత్సాహంగా ఉంటూ వాటిని చేరుకోవడానికి చాలా కష్టపడ్డారా… కానీ ఎక్కడో ఒక చోట విజయం సందేహాస్పదంగా అనిపించిందా? అది ఫలితాన్ని ఎలా ప్రభావితం

Read More »
13th feb 2025 soul sustenance telugu

స్వీయ నియంత్రణ కళలో ప్రావీణ్యం పొందటం

మనమందరం బాగా జీవించడానికి మన జీవితాలపై నియంత్రణ కలిగి ఉండాలని కోరుకుంటాము. మన మనస్సు, బుద్ధి మరియు స్వభావాన్ని నియంత్రించడం మన శక్తి. అది మన భౌతిక ఇంద్రియాలను కూడా ఆటోమేటిక్ గా నియంత్రిస్తుంది.

Read More »
12th feb 2025 soul sustenance telugu

నిద్రపోయే ముందు పనులకు సంబంధించిన కమ్యూనికేషన్ మరియు టెక్నాలజీ నుండి దూరమవ్వండి 

రాత్రి వరకు పనులకు సంబంధించిన కమ్యూనికేషన్ లో చిక్కుకోవడం వల్ల మనం నిద్రపోతున్నప్పుడు కూడా మనస్సు పనుల గురించి ఆలోచిస్తూ, మన నిద్రకు భంగం కలిగిస్తుంది. మన సాంకేతిక పరిజ్ఞాన వినియోగం అదుపు తప్పడం

Read More »