Hin

23rd-oct-2023-soul-sustenance-telugu

October 23, 2023

దశరాలోని దివ్యమైన అంతరార్థం (పార్ట్ 1)

చెడుపై ధర్మం సాధించిన విజయాన్ని జరుపుకునే దశరా లేదా విజయదశమి (అక్టోబర్ 24)కి సంబంధించిన అనేక ఆసక్తికరమైన మరియు ప్రసిద్ధ పౌరాణిక కథలు ప్రపంచంలో ఉన్నాయి. ఈ కథలకు లోతైన ఆధ్యాత్మిక అర్థం మరియు ప్రాముఖ్యత ఉన్నాయి. 

బ్రహ్మా కుమారీల వద్ద చెప్పే ఆధ్యాత్మిక జ్ఞానం ప్రకారం, ఆత్మ నిజానికి ఒక మెరిసే నక్షత్రం వంటి చైతన్య శక్తి, శాంతి, స్వచ్ఛత మరియు ఆనందంతో నిండి ఉంది; ఆధ్యాత్మికంగా ఛార్జ్ అయ్యి ఆత్మల ప్రపంచంలో ఉండేది. ఈ ఆత్మల ప్రపంచాన్ని సాధారణంగా శాంతిధామము లేక ముక్తిధామము అంటారు. ఇది ఈ భౌతిక ప్రపంచానికి, పంచ తత్వాలకు అతీతమైన ప్రపంచం. ఆధ్యాత్మికంగా శక్తివంతమైన ఈ ఆత్మ భూమిపై తన పాత్రను పోషించడానికి భూమిపైకి మొదటిసారిగా వచ్చినప్పుడు, దాని స్వచ్ఛత సహజంగా భౌతిక శరీరం ద్వారా, దైవీ లక్షణాలుగా మరియు ఈ లక్షణాలతో నిండిన కర్మల రూపంలో కనిపించేవి. 

నెమ్మదిగా అది జననమరణాల చక్రంలోకి వస్తూ వస్తూ తనను తాను భౌతిక శరీరమని తప్పుగా గుర్తించడం మొదలుపెట్టి తాను ఒక చైతన్యమైన ఆత్మనన్న విషయాన్ని మర్చిపోయింది. ఈ ప్రయాణంలో పంచేంద్రియాలకు, ఇతర మనుషులకు, భౌతిక వస్తువులకు ఆకర్షితమవుతూ వచ్చింది. రామాయణంలో సీతను ఆకర్షించిన బంగారు జింక ఈ ఆకర్షణలకు ప్రతీక మరియు ఆత్మ అభిమానం యొక్క అంతర్గత దశ సీత దాటిన లక్ష్మణరేఖ రూపంలో చూపబడింది. ఆత్మ అభిమానం అనే గీతను దాటి దేహ అభిమానంలోకి రావడం వలన రావణుడిచే అపహరించబడటానికి మరియు రాముడి నుండి విడిపోవడానికి దారితీసింది. రావణుడు సీతను అపహరించిన ఘట్టం దుష్ట శక్తులు లేదా ఐదు దుర్గుణాలైన కామం, కోపం, దురాశ, మోహం మరియు అహంకారం ద్వారా ఆత్మను అపహరించడాన్ని సూచిస్తుంది. రావణుడిని దశాననుడు అని కూడా పిలుస్తారు అంటే పది తలలు ఉన్నవాడు అని అర్థం. అటువంటి మానవుని ఉనికి భౌతికంగా అసాధ్యం. కాబట్టి, ఈ పది తలలు తప్పనిసరిగా ప్రతీకాత్మకమైన మరియు లోతైన ఆధ్యాత్మిక ప్రాముఖ్యతను కలిగి ఉంటాయి, వీటిని మనం మరచిపోయినట్లు అనిపిస్తుంది. పది తలలు నేటి పురుషులలో ఐదు దుర్గుణాలను మరియు స్త్రీలలో ఐదు దుర్గుణాలను సూచిస్తాయి.

(రేపు కొనసాగుతుంది…)

మీ సమీపంలో ఉన్న రాజయోగ మెడిటేషన్ సెంటర్ కొరకు

రికార్డు

25th july 2024 soul sustenance telugu

ఇతరులకు బాధ్యతలను అప్పగించడం

మనం ఒక కుటుంబానికి పెద్ద అయినా లేదా మన కార్యాలయంలో ఒక టీమ్ లీడర్ అయినా, కొన్నిసార్లు ఇతరులకు బాధ్యతను అప్పగించడంలో మనం అసురక్షితంగా ఉంటాము, మన వద్దే బాధ్యతను ఉంచుకోవడానికి ప్రయత్నిస్తాము. మీరు

Read More »
24th july 2024 soul sustenance telugu

ప్రశంసల కోరిక నుండి విముక్తి పొందడం (పార్ట్ 3)

మనందరికీ వేర్వేరు స్వభావాలు లేదా వ్యక్తిత్వాలు ఉంటాయి. జన్మ, పునర్జన్మల కథలో మన ప్రయాణాలు కూడా భిన్నంగా ఉంటాయి. కాబట్టి, ఈ సమయంలో, మనమందరం వివిధ రకాలుగా విజయాన్ని పొందుతాము. వ్యక్తులతో ప్రేమగా వ్యవహరించడంలో

Read More »
23rd july 2024 soul sustenance telugu

ప్రశంసల కోరిక నుండి విముక్తి పొందడం (పార్ట్ 2)

మన రోజువారీ జీవితంలో, మనలో కొందరు అనుభవం చేసుకునే  చాలా సాధారణ భావన ఏమిటంటే మనం చేసిన పనికి ప్రశంసలు పొందాలనే కోరిక. మీ కోసం, మీ కుటుంబం మరియు స్నేహితుల కోసం అలాగే

Read More »