Hin

24th-oct-2023-soul-sustenance-telugu

October 24, 2023

దశరాలోని దివ్యమైన అంతరార్థం (పార్ట్ 2)

కామం, క్రోధం మరియు లోభం నరకానికి ద్వారాలు అని భగవద్గీతలో చెప్పబడింది. ఆ విధంగా, దేహ అభిమానం అనే రావణ ప్రభావంతో ఆత్మ రాముడి నుండి విడాకులు తీసుకుంది, దాని ఫలితంగా అది నరకం యొక్క ద్వారాలను తెరిచి దుఃఖాన్ని మరియు బాధను అనుభవిస్తుంది. రావణుడు అంటే నిన్ను ఏడిపించేవాడు అని అర్థం. ఈ రోజు ప్రతి ఆత్మ లేదా సీత ఐదు దుర్గుణాల సంకెళ్లలో చిక్కుకుని ఉంది, ఇది అన్ని భావోద్వేగ బాధలు, ఉద్రిక్తతలు మరియు దుఃఖాలకు మూలం; విముక్తి కోసం రామునికి మొర పెట్టుకుంటుంది ఆత్మ.

సర్వాత్మలకు తండ్రి అయిన నిరాకార పరమాత్మునికి ఉన్న అనేక నామాలలో రాముడు కూడా ఒక నామము. ఆ పరమాత్మ నిరాకారుడు, సదా అశరీరి, పరంధామ నివాసి, జననమరణాలకు అతీతుడు,  శాంతి సాగరుడు, ఆనంద సాగరుడు, ప్రేమ సాగరుడు. ఆత్మ రూపి సీతలందరినీ దుఃఖం నుండి విడుదల చేయడానికి కలియుగ అంతిమ సమయంలో పరమాత్మ ఈ భౌతిక ప్రపంచంలోకి అవతరించిన దానికి గుర్తే ఈ పండుగ. వారు చేసిన దివ్యమైన వాగ్దానం ప్రకారం, మానవాళి చరిత్రలోనే అతి ముఖ్యమైన సమయంలో పరమాత్ముని అవతరణ జరుగుతుంది. మానవాత్మ అపవిత్రమైన కోరికలు మరియు ఆనందాలకు బానిసై దేహ అభిమానంలో ఆత్మ కూరుకుపోయిన సమయంలో పరమాత్మ అవతరణ జరుగుతుంది. ఇది ఆ సమయమే. ఆధ్యాత్మికంగా బలహీనంగా ఉన్న ఆత్మలకు ఆత్మ జ్ఞానాన్ని అందించి వారిని పవిత్రంగా చేసి, దివ్య బుద్ధినిచ్చి ఆధ్యాత్మిక పరివర్తనను తీసుకువస్తారు. వారు సహజ రాజయోగాన్ని నేర్పించి  (రాజ +యోగము అనగా అన్ని యోగాలకెల్లా రాజు అయినది) తద్వారా ఆత్మలు తమ మనసును మరియు బుద్ధిని సర్వోన్నతుడైన పరమాత్మతో జోడించేలా శిక్షణ ఇస్తారు.

దశరా అంటే దశ-హరా. దశ అంటే పది, హరా అంటే హరించడము అని అర్థం. మన ఆధ్యాత్మిక వ్యక్తిత్వానికి అడ్డుగా నిలిచే పది వికారాలు అనే రావణుడిని ఆధ్యాత్మిక జ్ఞానమనే బాణము వేసి రాజయోగ జ్వాల అనే అగ్నితో దహించివేసినప్పుడే నిజమైన దశరాను జరుపుకుని సత్యమైన ఆనందాన్ని అనుభూతి చేస్తాము.

మీ సమీపంలో ఉన్న రాజయోగ మెడిటేషన్ సెంటర్ కొరకు

రికార్డు

15th june2024 soul sustenance telugu

దేవి దేవతల 5 అర్హతలు

కలియుగం (ఇనుప యుగం) చివరిలో మరియు సత్యయుగం (స్వర్ణయుగం) ప్రారంభానికి ముందు, మానవాళికి రాత్రి మరియు మానవాళికి పగలు మధ్య ఉన్న ప్రస్తుత సంగమయుగంలో భగవంతుడు మానవులను దేవీ దేవతలుగా మారుస్తున్నారు. దేవీ దేవతలకు

Read More »
14th june2024 soul sustenance telugu

వినయంగా ఉంటూ ప్రతి ఒక్కరికీ గౌరవం ఇవ్వండి

ప్రతి సమాజం మరియు ప్రతి కుటుంబం కూడా ప్రవర్తనలో కొన్ని నియమాలను పాటిస్తుంది. వ్యక్తుల పాత్రలు, పదవుల ఆధారంగా వారిని గౌరవించడానికి ఆ నియమాలు మనకు ప్రవర్తనా నియమావళిగా పనిచేస్తాయి. నిర్దిష్ట పాత్రలలో ఉన్న

Read More »
13th june2024 soul sustenance telugu

సంతోషాన్ని సరిగ్గా జీవించడం (పార్ట్ 3)

సంతోషం అనేది బాహ్య ప్రభావాలపై ఆధారపడినది మానసిక స్థితి. ఉదా. మీరు ఒక గొప్ప వార్త వింటారు – మీ కార్యాలయంలో మీకు ప్రమోషన్ వచ్చింది. ఇది వినడానికి చాలా బాగుంటుంది, మీకు సంతోషాన్ని

Read More »