Hin

16th june2024 soul sustenance telugu

June 16, 2024

 దేవీ దేవతల 36 దివ్య గుణాలు

నిన్నటి సందేశంలో, దేవీ దేవతలలో ఉన్న 36 దివ్య గుణాలను ప్రస్తావించాము. మనం పరిపూర్ణంగా, స్వచ్ఛంగా మరియు ప్రశంసనీయంగా తయారవ్వటానికి మనలో ప్రతి గుణం చెక్ చేసుకొని ధారణ చేద్దాము. ఈ గుణాలన్నింటినీ మనం ఎంతగా అలవరచుకుంటే, జీవితంలోని అన్ని రంగాలలో – వ్యక్తిగతంగా, వృత్తిపరంగా మరియు మన సంబంధాలు కూడా అందంగా మారతాయి.

ఒక గుణాన్ని ఎంచుకుని, దానిని ఒక వారం పాటు ఆచరణలోకి తెచ్చి, తర్వాత వారానికి కొత్త గుణాన్ని తీసుకోవడం మంచి అభ్యాసం. రోజు చివరిలో, ప్రతిరోజూ మిమ్మల్ని మీరు చెక్ చేసుకోండి. మీరు మీ జీవితంలో ఆ గుణాన్ని ఎంత బాగా ఆచరిస్తున్నారో మీ వ్యక్తిగత డైరీలో నోట్ చేసుకోండి. ఆ నిర్దిష్ట రోజులో మీ పురోగతిని బట్టి మీరు ప్రతిరోజూ 1 నుండి 10 వరకు ఉండే స్కేల్‌లో గుర్తు పెట్టుకొని మరుసటి రోజు మీ మార్కులను పెంచుకోవడానికి ప్రయత్నించండి. ఒక గుణం కోసం ఒక వారం ఇలా చేయండి. ప్రతి వారం విభిన్న గుణాలను తీసుకోండి. 36 వారాలు మొత్తం 36 దివ్య గుణాల కోసం ఇలా చేయండి.

36 దైవిక గుణాల జాబితా –

  1. ఖచ్చితత్వం 2. ప్రశంసించడం 3. పరోపకారం 4. నిశ్చింతత 5. ఉల్లాసం 6. పరిశుభ్రత 7. సంతృప్తి 8. సహకారం 9. ధైర్యం 10. నిర్లిప్తత 11. దృఢత్వం 12. క్రమశిక్షణ 13. సరళత 14. నిరహంకారం 15. శక్తివంతంగా ఉండటం 16. దూర-దృష్టి 17. నిర్భయత 18. ఉదారత 19. శుభ భావనలు 20. నిజాయితీ 21. వినయం 22. ఆత్మపరిశీలన 23. తేలికతనం 24. పరిపక్వత 25. దయ 26. విధేయత 27. క్రమబద్ధత 28. ఓర్పు 29. వినమ్రత 30. పవిత్రత 31. రాయల్టీ 32. ఆత్మవిశ్వాసం 33. సరళత 34. మధురత 35. అలసటలేనితనం 36. సహనం

మీ సమీపంలో ఉన్న రాజయోగ మెడిటేషన్ సెంటర్ కొరకు

రికార్డు

18th feb 2025 soul sustenance telugu

భగవంతుడు సర్వోన్నతుడైన తండ్రి మరియు తల్లి

ప్రపంచవ్యాప్తంగా పెద్ద సంఖ్యలో మత సంప్రదాయాలలో, భగవంతుడిని ఎల్లప్పుడూ పురుషుడిగా సూచిస్తారు. కానీ, ఆత్మకు లింగం లేదు, అది పురుష లేదా స్త్రీలింగం కాదు. అలాగే భగవంతుడిని అనగా పరమ ఆత్మ యొక్క లింగం

Read More »
17th feb 2025 soul sustenance telugu

చక్కటి సంబంధాలను బలపరుచుకోవడానికి అహంకారాన్ని త్యాగం చేయడం (పార్ట్ 3)

ప్రతి సంబంధంలో ఆ సంబంధం ఎలా ఉన్నా కూడా ఎదుటి వారిని ముందు ఉంచే వ్యక్తి సంబంధాన్ని నడిపిస్తాడని గుర్తుంచుకోండి. ఎదుటి వ్యక్తిని ముందు ఉంచడం అంటే కొన్ని సమయాల్లో మీరు ఒక నిర్దిష్ట

Read More »
16th feb 2025 soul sustenance telugu

చక్కటి సంబంధాలను బలపరుచుకోవడానికి అహంకారాన్ని త్యాగం చేయడం (పార్ట్ 2)

మీరు మరొక వ్యక్తిని కలిసినప్పుడల్లా, మీరు మీలాగే ఉండాలి అని నిర్ధారించుకుంటూ, అదే సమయంలో ఎదుటి వ్యక్తిని కూడా వారిని వారిలానే ఉండనివ్వడం ద్వారా మీరు వారికీ ఒక స్వేచ్చని కలిపిస్తారు. దాని అర్థం

Read More »