Hin

15th june2024 soul sustenance telugu

June 15, 2024

దేవి దేవతల 5 అర్హతలు

కలియుగం (ఇనుప యుగం) చివరిలో మరియు సత్యయుగం (స్వర్ణయుగం) ప్రారంభానికి ముందు, మానవాళికి రాత్రి మరియు మానవాళికి పగలు మధ్య ఉన్న ప్రస్తుత సంగమయుగంలో భగవంతుడు మానవులను దేవీ దేవతలుగా మారుస్తున్నారు. దేవీ దేవతలకు 5 ప్రధాన అర్హతలు ఉంటాయి. భగవంతుని ఆధ్యాత్మిక జ్ఞానాన్ని వింటూ, ధ్యానంలో వారిని స్మరించుకుంటూ ప్రస్తుతం మనం వాటిని ధారణ చేయవలసిన అవసరం ఉంది.

  1. 16 కళల సంపూర్ణులు – ఇది ఆత్మ యొక్క పరిపూర్ణతను సూచిస్తుంది మరియు పౌర్ణమితో పోల్చబడుతుంది. ఆత్మ యొక్క 7 ప్రాథమిక గుణాలైన శాంతి, సంతోషం, ప్రేమ, ఆనందం, స్వచ్ఛత, శక్తి మరియు సత్యత, ఆత్మలో 100% నిండినప్పుడు ఈ పరిపూర్ణత వస్తుంది. మనం పునర్జన్మలను తీసుకోవడంతో కళలు తగ్గడం ప్రారంభించినప్పుడు, 7 సద్గుణాలు 100% కంటే తక్కువ అవుతాయి. ఆత్మ యొక్క పరిపూర్ణత కొంచెం తక్కువగా ఉంటుంది, అంటే కొన్నిసార్లు మనం ఆకాశంలో చంద్రుడిని పౌర్ణమి కంటే కొంచం తక్కువగా ఉండటం చూసినట్లుగా ఉంటుంది. సత్యయుగంలో, 16 కళల సంపూర్ణ స్థితిలో, ఆత్మలో అన్ని భౌతిక మరియు భౌతికేతర నైపుణ్యాలు వాటి సంపూర్ణ స్ధితిలో ఉంటాయి. పరిపూర్ణత, కళలు తగ్గినప్పుడు, నైపుణ్యాలు కూడా తగ్గుతాయి. 16 కళలు 16 ఆనాలతో కూడా పోల్చవచ్చు, అంటే 1 రూపాయి, అంటే 100 పైసలు.
  2. సర్వ గుణ సంపన్నులు – ఇది 36 దివ్య గుణాలను సూచిస్తుంది. సత్యయుగం ప్రారంభంలో ఆత్మ 100% స్వచ్ఛంగా ఉన్నప్పుడు, 36 దివ్య గుణాలన్నీ నిండుగా ఉంటాయి. మనం పునర్జన్మల్లోకి వస్తున్నప్పుడు అవి తగ్గుతాయి.
  3. సంపూర్ణ నిర్వికారులు – ఇది ఆలోచనలు, మాటలు మరియు చర్యలలో పూర్తి స్వచ్ఛతను సూచిస్తుంది. సత్యయుగం ప్రారంభంలో ఆత్మ 100% స్వచ్ఛంగా ఉన్నప్పుడు ఇలా ఉంటుంది. మనం పునర్జన్మల్లోకి వస్తున్నప్పుడు అది తగ్గుతుంది.
  4. మర్యాదా పురుషోత్తములు – దీని అర్థం జీవితంలోని అన్ని గొప్ప సూత్రాలను అనుసరించే పరిపూర్ణ వ్యక్తి. దేవీ దేవతలందరూ మర్యాదా పురుషోత్తములే.
  5. అహింసా పరమోధర్మం – దీని అర్థం సంపూర్ణ అహింస యొక్క ఆధ్యాత్మిక మతాన్ని అనుసరించేవారు. కామం, క్రోధం యొక్క డబుల్ హింస నుండి విముక్తులు. దేవీ దేవతలందరూ డబుల్ అహింసకులు.

మీ సమీపంలో ఉన్న రాజయోగ మెడిటేషన్ సెంటర్ కొరకు

రికార్డు

17th march 2025 soul sustenance telugu

నెగటివ్ ఆలోచనలను ఆధ్యాత్మిక శక్తితో మార్చడం (పార్ట్ 2)

ప్రతి రోజు మీ వాట్సప్ లో ఒక మంచి విషయాన్ని తెలుసుకునేందుకు కష్టతరమైన పరిస్థితులను ఎదుర్కొంటున్న జీవితంలో మనలో ప్రతి ఒక్కరూ ఆధ్యాత్మిక జ్ఞానంతో మాత్రమే కాకుండా శక్తులతో సిద్ధపరుచుకోవాలి. చాలా సంవత్సరాల పాటు

Read More »
16th march 2025 soul sustenance telugu

నెగటివ్ ఆలోచనలను ఆధ్యాత్మిక శక్తితో మార్చడం (పార్ట్ 1)

ప్రతి రోజు మీ వాట్సప్ లో ఒక మంచి విషయాన్ని తెలుసుకునేందుకు వివిధ రకాల సంఘటనలతో, కొన్నిసార్లు ప్రతికూలతతో నిండిన వాటితో జీవితాన్ని అనుభవం చేయడం  కష్టతరం కావచ్చు మరియు జీవితాన్ని ఒడిదుడుకుల కష్టతరమైన

Read More »
15th march 2025 soul sustenance telugu

ద్వేషం నుండి మిమ్మల్ని మీరు విముక్తి చేసుకోవడం

ప్రతి రోజు మీ వాట్సప్ లో ఒక మంచి విషయాన్ని తెలుసుకునేందుకు మనం అనేక విభిన్న సంబంధాల ప్రపంచంలో జీవిస్తున్నాం. ఒక అందమైన సంబంధం ఎలాంటి ద్వేషం లేని నిజమైన ఆత్మిక ప్రేమ పై

Read More »