Hin

5th october 2024 soul sustenance telugu 1

October 5, 2024

ధనం  ఆశీర్వాదాలతో  సంపాదించడం

ధనం సంపాదించడం చాలా ముఖ్యం. ఆ ధనంతో మనం కొనుగోలు చేయగల అన్ని భౌతిక సౌకర్యాలను కొనుగోలు చేయడం కూడా ముఖ్యం. కానీ ధనం అంటే కేవలం కరెన్సీ మాత్రమే కాదు, అది ఒక శక్తి కూడా. నైతికంగా సంపాదించిన ధనం ఇతరులకు శాంతి మరియు ఆనందాన్ని ఇచ్చి ఆశీర్వాదాలతో ఇంటికి వస్తుంది. ధనం అనేకులకు సంతృప్తిని  ఇవ్వనిదిగా మారింది. మీరు సంపాదిస్తున్న దానితో మీరు ఎప్పుడైనా సంతృప్తి చెందారా? మీకు ఎంత ఎక్కువ ఉంటే, అంత ఎక్కువ కోరుకుంటున్నారని అనిపిస్తుందా? ధనం అవసరం వలనో లేదా దురాశ కారణంగానో ఎక్కువ  సంపాదించడంలో వారి నైతికతపై రాజీ పడినవారు ఎవరైనా మీకు తెలుసా? ధనం  అంటే  కేవలం కనిపించే కరెన్సీ కాదు. దానిని ఎలా సంపాదించారో అంటే మన ఉద్దేశాలు, ఆలోచనలు, నమ్మకాలు, ప్రవర్తనలు, నైతికతలు, నియమాలతో ఉన్న ఆ అదృశ్య శక్తిని కూడా కలిగి ఉంటుంది. ఈ శక్తి స్వచ్ఛంగా, సానుకూలంగా ఉంటే, మనం డబ్బును మాత్రమే కాకుండా శాంతి, ఆనందం మరియు ప్రేమ అనే శక్తులను కూడా ఇంటికి తీసుకువస్తాము. అటువంటి డబ్బును దాని స్వచ్ఛమైన శక్తితో మన కుటుంబ అవసరాలు, సౌకర్యాలను తీర్చడానికి ఉపయోగించినప్పుడు, తప్పకుండా అందరూ సుఖంగా ఉంటారు. మనం ఎంత సంపాదిస్తున్నామో మాత్రమే కాకుండా, ఎలా సంపాదిస్తున్నామో కూడా చూసుకోవడం ప్రారంభిద్దాం. మన ఆలోచనలు మరియు మాటలలో నిజాయితీగా, స్వచ్ఛంగా మరియు ప్రామాణికంగా ఉందాం. మనం అందరితో సహకరించి, మన విలువలతో ఉంటూ, మనతో కలిసి పనిచేసే ప్రతి ఒక్కరి ఆశీర్వాదాలను సంపాదించుకుందాం. మనం సంపాదించిన డబ్బులో ఒకరి బాధ, అసంతృప్తి లేదా అసౌకర్యం ఏమాత్రం ఉండకూడదు. సంపాదించే విధానాల గురించి మీ నియమాలు, నైతికతలను రూపొందించుకోండి మరియు రాజీ పడకండి.

మీరు స్వచ్ఛమైన వ్యక్తి అని ప్రతి ఉదయం మీకు మీరే గుర్తు చేసుకోండి. మీరు చేసే ప్రతి పనిలో నిజాయితీగా ఉండండి. మీరు పని చేసే ప్రదేశంలో స్వచ్ఛమైన శక్తిని ఉంచండి. మీ ఆలోచనలు, మాటలు మరియు ప్రవర్తనలు రోజంతా, ఇంట్లో, ఆఫీస్ లో మీకు ఆశీర్వాదాలను అందిస్తాయి. మంచి వృత్తిపరమైన సంబంధాలను కలిగి ఉండండి. విజయవంతం కావాలంటే మీరు డబ్బు సంపాదించడంతో పాటు ఆశీర్వాదాలను సంపాదించాలి, మీ పనులను సకాలంలో, సామర్థ్యంతో పూర్తి చేయాలి అని అర్థం చేసుకోండి. మీ సహోద్యోగులకు మరియు అందరికీ సహకరించండి. దీవెనలు ఇవ్వండి, దీవెనలు పొందండి. మీ పనితీరు, అంకితభావంతో అందరికీ  సంతోషాన్ని పంచండి. మీరు సంపాదించే డబ్బు మీతో పనిచేసే వ్యక్తులకు, మీ పర్యవేక్షకులకు, సహోద్యోగులకు, క్లయింట్లకు సంతృప్తి కలిగించే శక్తితో వస్తూ సంతోషం యొక్క వైబ్రేషన్లతో శక్తివంతం అయ్యేలా చూసుకోండి. ధనం మాత్రమే కాకుండా ఆశీర్వాదాలను సంపాదించుకొని ఇంటికి రండి. ఆహారం, సౌకర్యాలు, పొదుపు, మీరు మీ స్వచ్ఛమైన ధనంతో కొనుగోలు చేసే ప్రతిదీ ఉన్నతమైన ఫ్రీక్వెన్సీలో ప్రసరిస్తుంది. ఆ ధనం నుండి వచ్చే ఆశీర్వాదాలు మీకు ఆరోగ్యం, సంతోషం, సామరస్యం మరియు విజయాన్ని తెస్తాయి.

మీ సమీపంలో ఉన్న రాజయోగ మెడిటేషన్ సెంటర్ కొరకు

రికార్డు

17th march 2025 soul sustenance telugu

నెగటివ్ ఆలోచనలను ఆధ్యాత్మిక శక్తితో మార్చడం (పార్ట్ 2)

ప్రతి రోజు మీ వాట్సప్ లో ఒక మంచి విషయాన్ని తెలుసుకునేందుకు కష్టతరమైన పరిస్థితులను ఎదుర్కొంటున్న జీవితంలో మనలో ప్రతి ఒక్కరూ ఆధ్యాత్మిక జ్ఞానంతో మాత్రమే కాకుండా శక్తులతో సిద్ధపరుచుకోవాలి. చాలా సంవత్సరాల పాటు

Read More »
16th march 2025 soul sustenance telugu

నెగటివ్ ఆలోచనలను ఆధ్యాత్మిక శక్తితో మార్చడం (పార్ట్ 1)

ప్రతి రోజు మీ వాట్సప్ లో ఒక మంచి విషయాన్ని తెలుసుకునేందుకు వివిధ రకాల సంఘటనలతో, కొన్నిసార్లు ప్రతికూలతతో నిండిన వాటితో జీవితాన్ని అనుభవం చేయడం  కష్టతరం కావచ్చు మరియు జీవితాన్ని ఒడిదుడుకుల కష్టతరమైన

Read More »
15th march 2025 soul sustenance telugu

ద్వేషం నుండి మిమ్మల్ని మీరు విముక్తి చేసుకోవడం

ప్రతి రోజు మీ వాట్సప్ లో ఒక మంచి విషయాన్ని తెలుసుకునేందుకు మనం అనేక విభిన్న సంబంధాల ప్రపంచంలో జీవిస్తున్నాం. ఒక అందమైన సంబంధం ఎలాంటి ద్వేషం లేని నిజమైన ఆత్మిక ప్రేమ పై

Read More »