Hin

17th April 2025 Soul Sustenance Telugu

April 17, 2025

ధ్యానంతో సానుకూల వాతావరణాన్ని సృష్టించడం

మనమందరం ఆధ్యాత్మిక శక్తులం, ఆలోచనలు మరియు భావాలతో కూడిన ఆత్మలం. మనం వాతావరణానికి ప్రకంపనలను ప్రసరింపజేస్తాము. మన వైబ్రేషన్ల నాణ్యత అనేది మన ఆలోచనలు మరియు భావాల నాణ్యతపై ఆధారపడి ఉంటుంది. మనం ఒక రోజులో వేలాది ఆలోచనలను సృష్టిస్తాము, ప్రతి ఆలోచన ఒక అనుభూతిని కలిగి ఉంటుంది. ఈ ఆలోచనలు మరియు భావాలలో కొన్ని అందమైనవి, స్వచ్ఛమైనవి మరియు సానుకూలమైనవి ఉండగా మరి కొన్ని అపవిత్రమైనవి, ప్రతికూలమైనవి మరియు వ్యర్థమైనవి కూడా ఉంటాయి. ఇవన్నీ వాతావరణానికి ప్రయాణించి ఇతర ఆత్మలను మరియు భౌతిక ప్రకృతిని తాకుతాయి. కాబట్టి, మన వాతావరణాన్ని శుద్ధి చేయడానికి మన జీవితంలోని ప్రతి క్షణం మన ప్రకంపనలతో మనం ఏమి చేయాలి అనే దాని గురించి మనం ఎప్పుడైనా ఆలోచించామా? అందుకు ఈ 5 ప్రాథమిక దశలను చూద్దాం – 

 

  1. ఆత్మ యొక్క అసలు గుణాలు శాంతి, సుఖము, ప్రేమ, ఆనందం, పవిత్రత, శక్తి మరియు జ్ఞానం. ఈ 7 గుణాల సారంతో నిండిన ఆలోచనలను సృష్టించుకుందాం. అవి ఉన్నతమైన ప్రకంపనలను ప్రసరింపజేసి వాతావరణాన్ని శక్తివంతం చేస్తాయి.

 

  1. మిమ్మల్ని మీరు ఒక ఆత్మగా భావించి, ప్రతి ఒక్కరినీ ఆత్మగా చూడటం ప్రారంభించండి. మీరు ఎంత ఎక్కువ అలా చేస్తే, మీ సౌరభం సానుకూలంగా ఛార్జ్ అవుతుంది మరియు మీ వైబ్రేషన్లు పర్యావరణాన్ని సానుకూలతతో ఛార్జ్ చేయడంతో అది కూడా శుద్ధి అవుతుంది.

 

  1. మీ ప్రతి మాటను మరియు చర్యను స్వచ్ఛంగా, మధురంగా మరియు సంతృప్తితో నిండి ఉండేలా చేయండి. ఇలా చేయడం ద్వారా, మీ సానుకూల చైతన్యం యొక్క శక్తి ఇతరుల చైతన్యాన్ని తాకుతుంది. మీరు మరియు ఇతరులు తమలో తాము ఈ సుగుణాలను అనుభూతి చేస్తారు. ఫలితంగా, వాతావరణం ఈ సుగుణాలతో నిండి ఉంటుంది.

 

  1. ప్రతి ఆత్మను, ప్రకృతిని గౌరవించడం అనగా మనం ఏ ఆత్మకు లేదా ప్రకృతికి వాటికీ నచ్చని దేనినీ మనం ఇవ్వకుండా చూసుకోవాలి. వాతావరణాన్ని వివిధ విధాలుగా సంరక్షించడం మరియు దానిని ఆధ్యాత్మికంగా పరిరక్షించడం చాలా ముఖ్యం.

 

  1. మన ఆధ్యాత్మిక స్వపరివర్తన ప్రయాణంలో ప్రపంచ పరివర్తనను ఒక ముఖ్యమైన అంశంగా చేసుకోవడం  కూడా చాలా ముఖ్యం. ధ్యానం మరియు ధ్యాన జీవనశైలి భగవంతుని నుండి మనం తీసుకునే వాటిని ఇతరులకు ఇవ్వడం మరియు ప్రసరింపజేయడంతో నిండి ఉండాలి.

రికార్డు

22nd May 2025 Soul Sustenance Telugu

భోజనం చేసే ముందు భగవంతునికి ఆహారాన్ని అర్పించడం వల్ల కలిగే 7 ప్రయోజనాలు

ప్రతి రోజు మీ వాట్సప్ లో ఒక మంచి విషయాన్ని తెలుసుకునేందుకు మన ఆధ్యాత్మిక జీవితంలో మనం అలవర్చుకోవల్సిన ఒక అందమైన అలవాటు, భగవంతుని ధ్యానంలో ప్రతి భోజనాన్ని వండడం. అలాగే, ఒక రోజులో

Read More »
21st May 2025 Soul Sustenance Telugu

మీ వాస్తవిక సత్య గుణానికి తిరిగి వెళ్లడం

ప్రతి రోజు మీ వాట్సప్ లో ఒక మంచి విషయాన్ని తెలుసుకునేందుకు సత్యం మన వాస్తవిక గుణం, కానీ ఎప్పటికప్పుడు మన సౌలభ్యం కోసం లేదా స్వల్పకాలిక లాభాల కోసం అబద్ధాలు చెబుతాము. ఆసక్తికరమైన

Read More »
20th May 2025 Soul Sustenance Telugu

మీ పిల్లలతో తగినంత సమయం గడపకపోవడంపై అపరాధ భావాన్ని అధిగమించండి

ప్రతి రోజు మీ వాట్సప్ లో ఒక మంచి విషయాన్ని తెలుసుకునేందుకు వివిధ రకాల వ్యక్తిగత మరియు వృత్తిపరమైన నిబద్ధతలను గౌరవించేటప్పుడు, చాలా మంది తల్లిదండ్రులు తమ పిల్లలకు తగినంత నాణ్యమైన సమయాన్ని ఇవ్వకపోవడం

Read More »