Hin

1st dec 2024 soul sustenance telugu

December 1, 2024

దివ్యమైన ఆత్మ యొక్క 12 లక్షణాలు (పార్ట్  2)

  1. స్వయంలోని బలహీనతలను, లోపాలను సులభంగా పరిశీలించుకోగలిగే అద్దం లాంటి వారు దివ్యమైన ఆత్మ. వారిలో భగవంతుని మంచితనాన్ని, శక్తులను చూడగలుగుతాము.
  2. వారు భగవంతునితో స్వచ్ఛంగా, సత్యంగా ఉంటారు. వారు ప్రతిదీ ఎలా ఆచరణలోకి తీసుకురావాలనే దానిపై ఎటువంటి సందేహాలు, భయాలు లేకుండా భగవంతుడు ఆదేశించే ప్రతిదాన్ని అనుసరిస్తారు.
  3. భగవంతుడు తన జ్ఞానాన్ని, సుగుణాలను, శక్తులను విశ్వంలోకి ప్రసరించడానికి ప్రతి క్షణం ఉపయోగించే స్వచ్ఛమైన, పారదర్శకమైన మాధ్యమం లాంటి వారు.
  4. ఆత్మ భూమి మీదకు రాకముందు శరీర రహితంగా ఆత్మిక రూపంలో తన ఆధ్యాత్మిక ఇంట్లో ఉంటుంది. అదే అనాది స్వచ్ఛత కలిగి ఉన్న పరంధామం. భౌతిక శరీరంతో తన పాత్రను అభినయించిన మొదటి యుగం అనగా స్వర్ణ యుగంలో ఆది స్వచ్ఛత ఉంటుంది. దివ్యమైన ఆత్మ పరంధామం లోని అనాది మరియు స్వర్ణ యుగం లోని ఆది స్వచ్ఛతలను సదా అనుభవం చేసుకుంటూ ఇతరులకు ప్రసరింపచేస్తారు.
  5. వారి ముఖ కవళికలు, వ్యక్తిత్వం ద్వారా ఆత్మిక స్మృతి యొక్క బలమైన వైబ్రేషన్లను ప్రసరింపజేస్తూ ప్రతి ఒక్కరినీ భగవంతుని బలమైన ఆధ్యాత్మిక వైబ్రేషన్ కు దగ్గర చేస్తారు.
  6. వారు నిరంతరం భగవంతునితో కనెక్ట్ అయ్యి వినయంతో నిండి ఉంటారు. భగవంతుని జ్ఞాపకంలో వారు చేసే సేవ యొక్క ఘనతనంతటినీ భగవంతునికి ఇస్తూ చాలా తేలికగా సేవ చేస్తారు.

మీ సమీపంలో ఉన్న రాజయోగ మెడిటేషన్ సెంటర్ కొరకు

రికార్డు

15th jan 2025 soul sustenance telugu

బ్రహ్మా కుమారీల 7 రోజుల కోర్సు (పార్ట్ 3)

ఆత్మ మరియు భగవంతుని జ్ఞానాన్ని పంచుకున్న తరువాత, బ్రహ్మా కుమారీల 7 రోజుల పరిచయ కోర్సు ప్రపంచ నాటకం అంటే ఏమిటి మరియు అది 4 యుగాలతో ఎలా రూపొందించబడిందో మనకు బోధిస్తుంది –

Read More »
14th jan 2025 soul sustenance telugu 2

బ్రహ్మా కుమారీల 7 రోజుల కోర్సు (పార్ట్ 2)

మనలాగే, భగవంతుని ఆధ్యాత్మిక రూపం కూడా భౌతిక కళ్ళకు కనిపించని ఉన్నతోన్నతమైన జ్యోతిర్బిందువని తెలుసుకున్న తరువాత, ఎలా మనం భగవంతుడిని అర్థం చేసుకొని వారితో ఎలా అనుసంధానించగలము అనేదానికి బ్రహ్మా కుమారీల 7 రోజుల

Read More »
13th jan 2025 soul sustenance telugu 3

బ్రహ్మా కుమారీల 7 రోజుల కోర్సు (పార్ట్ 1)

మనమందరం భగవంతుడి నుండి ఆధ్యాత్మిక జ్ఞానాన్ని నేర్చుకుంటూ ప్రతిరోజూ ధ్యానాన్ని అభ్యసించే ఆధ్యాత్మిక విద్యార్థులం. ధ్యానం అంటే భగవంతునితో ఆధ్యాత్మిక అనుసంధానం. ఆధ్యాత్మిక జీవితంలోని ఈ రెండు అంశాలతో  అనగా ఆధ్యాత్మిక జ్ఞానం మరియు

Read More »