Hin

17th feb 2024 soul sustenance telugu

February 17, 2024

దూకుడు స్పందనలను సమర్థించవద్దు

కొన్ని సందర్భాలలో మన మాటలను, ప్రవర్తనను నియంత్రించుకోవడం చాలా కష్టంగా అనిపిస్తుంది, అలాంటప్పుడు మనం దూకుడుగా స్పందించేస్తుంటాం. అప్పుడు మన పొరపాటును అంగీకరించకపోగా, తరచూ మన స్పందనను సమర్థించుకుంటూ ఉంటాము. ఈరోజుల్లో మన పాత్రలు మరియు బాధ్యతలకు చాలా శక్తిని, సమయాన్ని కేటాయించాల్సి వస్తుంది, మనలో చాలామంది మన జీవితాలను హడావుడిగా పరిగెడుతూ గడుపుతున్నాము. మనం త్వరగా ఆలోచిస్తున్నాము, ఆలోచించకుండా మాట్లాడుతున్నాము, అకస్మాత్తుగా స్పందిస్తున్నాము. ఒక్క క్షణం ఆగి పరిస్థితికి తగ్గ సరైన స్పందనను ఎంచుకోవడం లేదు, పైగా మన దూకుడు స్పందనలను సమర్థించుకుంటున్నాము.

  1. మీరు దూకుడుగా స్పందించినప్పుడు, మీ ఈ దూకుడుకు ఏదీ, ఎవ్వరూ బాధ్యులు కారు అన్నది గుర్తించండి. దూకుడుగా ప్రవర్తించే స్వభావం వలన ముందుగా మీ ఆంతరిక శక్తి క్షీణిస్తుంది. తర్వాత, మీ ఆకస్మిక స్పందనకు బాహ్య పరిస్థితులను దోషిగా చేస్తే దాని వలన కూడా మీలోని శక్తి తగ్గుతుంది.
  2. ప్రతి గంటకు ఒకసారి, ఒక్క క్షణం ఆగి, మీ స్పందనల నాణ్యతను పరిశీలించుకుని అవసరమైతే మార్చుకోండి. గుర్తుంచుకోండి – నేను శక్తిశాలి ఆత్మను, ఏమి జరిగినా కానీ నేను ప్రతి దృశ్యంలో సరైన విధంగా స్పందించడాన్నే ఎంచుకుంటాను.
  3. సరైన విధంగా స్పందించిన ప్రతిసారీ మిమ్మల్ని మీరు ప్రశంసించుకోండి. ఏదైనా కర్మ లేక చర్య సరిగ్గా లేకపోతే, దాని గురించి ఆలోచించి ఇలా కాక మరింకెలా స్పందించి ఉంటే బాగుండేదో ఆలోచించండి. దీనిని మనసులో రిహార్సల్ చేసి, ఆ సరైన స్పందనను మనసులో చూసుకోండి.
  4. మీ నిజ గుణాలైన శాంతి, ప్రేమ మరియు గౌరవాలతో స్పందించడం అనేది శ్రద్ధ మరియు అవగాహనలకు క్రమ పద్ధతి. మీ ప్రవర్తనలో కనిపించేలా వెంటనే స్పందించకుండా ఉండటం మొదటి దశ, ఆ తర్వాత మీ మనసులో కూడా దూకుడుగా స్పందించకుండా ఉండాలి.

మీ సమీపంలో ఉన్న రాజయోగ మెడిటేషన్ సెంటర్ కొరకు

రికార్డు

8th october 2024 soul sustenance telugu

ఆలోచనలపై ప్రతికూల ప్రభావాలను అధిగమించడం (పార్ట్ 1)

మన ఆలోచనలు వివిధ రకాలు, వివిధ తీవ్రతలను కలిగి ఉంటాయి. వాటి సంఖ్య  కూడా మెలకువగా ఉన్నప్పుడు, నిద్రపోతున్నప్పుడు ఎప్పటికప్పుడు మారుతూ ఉంటుంది. ఆ నిర్దిష్ట సమయంలో మనం ఏ చర్య చేస్తున్నాం లేదా

Read More »
7th october 2024 soul sustenance telugu

వైఫల్యాలను సులభంగా అంగీకరించడం

మనం ఎంత కష్టపడినా కొన్నిసార్లు విఫలమవుతాము అనేది జీవితంలో ముఖ్యమైన పాఠాలలో ఒకటి. మనం వైఫల్యాలు, లోపాలను మన ప్రయాణంలో భాగంగా పరిగణించి అంగీకరించాలి. మనలో చాలా మంది జీవితంలో వైఫల్యాలకు భయపడతాము .

Read More »
6th october 2024 soul sustenance telugu

నిర్లిప్తంగా ఉండి, గమనించి మరల్చుకోండి

మన జీవితాలు ఎప్పటికప్పుడు వివిధ రకాల పరిస్థితులతో నిండి ఉంటాయి. మనం తరచుగా పరిస్థితుల వల్ల ప్రతికూలంగా ప్రభావితమవ్వడంతో మన ఆంతరిక శక్తి తగ్గుతుంది. నిర్లిప్తంగా ఉండి, గమనించి మరల్చుకోవటం అనేది ఆధ్యాత్మికత యొక్క

Read More »