Hin

11th feb 2024 soul sustenance telugu

February 11, 2024

ఈ భువిని స్వర్గంగా మార్చడానికి 5 సోపానాలు

నేను భగవంతుడికి నిమిత్తమాత్రుడిని అన్న మంచి ఆలోచనను చేయండి – ఈ భువిపై స్వర్గాన్ని తీసుకురావడం భగవంతుని పని. మనమంతా పరమాత్ముని సంతానం, ఈ భువిపై స్వర్గాన్ని తీసుకురావడంలో మనం భగవంతునికి విధేయులైన నిమిత్తమాత్రులం. నిమిత్తమాత్రులు అంటే కుడి భుజాలుగా ఉండి విశ్వ పరివర్తనా కార్యంలో పరమాత్మకు సహకారిగా అవ్వడము. ఈ తలంపులో ఉన్నప్పుడు, ఈ భువిని స్వర్గంగా తిరిగి మార్చడంలో ఈ తలంపే మొదటి సోపానము లేక అడుగు అవుతుంది.

  1. పరమాత్మ శక్తిని, పవిత్రతను తీసుకుని ఆత్మిక లైట్ హౌస్‌గా అవ్వండి – ఎవరికైతే విశ్వ పరివర్తనా కార్యాన్ని పరమాత్మ ఇచ్చారో వారు పవిత్రతా సాగరుడైన పరమాత్మ నుండి పవిత్రతను తీసుకుని, రోజూ మెడిటేషన్‌తో పరమాత్మతో కనెక్ట్ అయి ఉంటూ వారి శక్తులను పొందాలి. ఆలోచన, మాట మరియు చేతలలో పవిత్రత మరియు శక్తి రెండు తరంగాలను  విశ్వానికి అందించడమే రెండవ సోపానము.
  2. పరమాత్మ జ్ఞానము అనే తాళం చెవిని అందరికీ అందించండి – కలియుగాంతంలో నేను విశ్వంలో అవతరించి ప్రపంచ పరివర్తనను చేస్తాను అని పరమాత్మ చెప్తారు. ఆధ్యాత్మిక జ్ఞానము అనే తాళం చెవిని తమ సంతానానికి పరమాత్మ అందించి తద్వారా స్వర్ణిమ యుగాన్ని లేదా సత్యయుగాన్ని స్థాపన చేస్తారు. ఎంత ఎక్కువగా మనం ఈ తాళం చెవిని పంచుతామో అంత ఎక్కువ సమీపంగా స్వర్గాన్ని తీసుకురాగలము.
  3. మీ ఇంటిని, ఆఫీసును స్వర్గంలా మార్చండి – మీరు ఎక్కువ సమయం గడిపే రెండు స్థానాలు- మీ ఇల్లు మరియు ఆఫీసు. భగవంతుని బాధ్యతాయుత సంతానంగా నేను ఈ రెండు స్థానాలను, శాంతి, ప్రేమ మరియు ఆనందాలతో నింపాలి, నేను ఈ తరంగాలను ప్రసరిస్తూ ఈ విశ్వంలో స్వర్గ స్థాపనకు దోహదపడుతున్నాను.
  4. ప్రతి అడుగులో భగవంతుని సలహా తీసుకుంటూ అందరినీ పరమాత్మ సాన్నిధ్యంలోకి తీసుకురండి – పరమాత్మతో కనెక్ట్ అయి ఉండటంలోని ప్రాముఖ్యతను, ప్రపంచంలో సానుకూల మార్పు యొక్క ఆవశ్యకతను అందరూ అర్థం చేసుకున్నప్పుడే సత్యయుగాన్ని మనం పునఃస్థాపించగలము. భగవంతుడు చేసేదే మనమూ చేయడం మన బాధ్యత – అందరినీ భగవంతుడికి దగ్గరగా తీసుకువచ్చి విశ్వ కుటుంబంతో ఏకం చేయాలి.

మీ సమీపంలో ఉన్న రాజయోగ మెడిటేషన్ సెంటర్ కొరకు

రికార్డు

8th dec 2024 soul sustenance telugu

నిర్భయంగా ఉండటానికి 5 మార్గాలు

స్వీయ గౌరవం యొక్క శక్తివంతమైన స్మృతిలో ఉండండి – మన భయాలన్నింటినీ అధిగమించగల మొదటి, అతి ముఖ్యమైన మార్గం మన స్వంత ఆధ్యాత్మిక ప్రాముఖ్యతను లోతుగా గ్రహించడం. ఇంకా, జ్ఞానం, సుగుణాలు, నైపుణ్యాలు మరియు

Read More »
7th dec 2024 soul sustenance telugu

పాత్ర-ప్రేరేపిత ఒత్తిడిని నివారించండి – ఇది ఒక పాత్ర మాత్రమే

చాలా పాత్రలు పోషించవలసి ఉన్నందున, మనం ఒత్తిడిని సహజంగా అంగీకరించాము. పాత్ర అభిమానం మన పదవి, విజయాలు మరియు వయస్సు ఆధారంగా ప్రదర్శించేలా చేస్తుంది. మనం కొన్నిసార్లు మన పాత్రలు, సంబంధాలు మరియు పదవుల

Read More »
6th dec 2024 soul sustenance telugu

అందమైన, స్వేచ్ఛాయుతమైన ప్రపంచాన్ని సృష్టించుకుందాం

వివిధ దేశాల నుండి వచ్చిన, వివిధ భాషలు మాట్లాడే, వివిధ మతాలను అనుసరించే, జీవితంలోని వివిధ రంగాలలో వివిధ రకాల చర్యలను నిర్వహించే కోట్లమంది మానవులతో నిండిన ప్రపంచంలో మనం జీవిస్తున్నాం. భగవంతుడు మన

Read More »