Hin

1st november 2024 soul sustenance telugu

November 1, 2024

ఈ దీపావళికి దివ్యమైన జ్యోతిని వెలిగించండి (పార్ట్ 2)

దీపాలను వెలిగించడం దీపావళికి అత్యంత ముఖ్యమైన అంశం. ఒక్క దీపం అపారమైన అందాన్ని కలిగి ఉండి చీకటిని తొలగిస్తుంది. ఆధ్యాత్మికంగా, మనం తొలగించాల్సిన చీకటి ఏమిటి? మన అసత్యపు గుర్తింపు మరియు అజ్ఞానం.  బంకమట్టితో తయారు చేయబడిన ప్రమిద  మన భౌతిక శరీరాన్ని సూచిస్తుంది. ప్రమిద లోపల వెలిగించే వత్తి, ఆత్మగా మన నిజమైన గుర్తింపును సూచిస్తుంది. శాంతి, ఆనందం, ప్రేమ, సుఖం, స్వచ్ఛత, శక్తి మరియు జ్ఞానం అనే అసలైన గుణాలతో మనందరం ఆత్మలం అనే ఆధ్యాత్మిక జ్ఞానాన్ని నూనె సూచిస్తుంది. దీపం వెలుగుతూనే ఉండటానికి మనం నూనెను వేస్తూనే ఉండాలి. అంటే ఆత్మలైన మనం ప్రకాశవంతంగా ఉండటానికి మన ప్రతి ఆలోచన, మాట మరియు చర్యలలో దివ్య గుణాలను ధారణ చేస్తూ ఉండాలి. ఈ జ్ఞాన ప్రకాశం మనకు ఇతర ఆత్మలను జాగృతం చేసే శక్తిని ఇస్తుంది. మరో ముఖ్యమైన సందేశం ఏమిటంటే, ప్రమిదతో సంబంధం లేకుండా ఆత్మను సూచించే జ్వాల అలాగే ఉంటుంది. ఇది అదే విధంగా కాలుతూ  ప్రకాశాన్ని ఇస్తుంది. మన బాహ్య రూపం, హోదా, లింగం, జాతీయత మరియు మతంతో సంబంధం లేకుండా ఆత్మలైన మనమందరం సమానమని ఇది సూచిస్తుంది.

బాణసంచా కాల్చడం అనేది గత బాధలను కాల్చి, అంతం చేసేయమనే సందేశం. ఒక జ్వాల మొత్తం బాణసంచా నంతటినీ పేల్చగలిగినట్లుగా, గతం ముగిసింది అనే ఒక ఆలోచన, మనం మోస్తున్న గత బాధల భారాలను అంతం చేయగలదు. ఇది క్షమాపణ, అంగీకరించటాన్ని సులభతరం చేస్తుంది. ఆగ్రహాన్ని పట్టుకొని ఉండటం మనల్ని మానసికంగా బలహీనపరచి ఇతరుల గురించి ప్రతికూల ఆలోచనలు చేసేలా చేస్తుంది. మనం వదిలేస్తే, మనస్సును స్వేచ్ఛగా ఉంచుకుంటాము. వ్యాపారులు పాత ఆర్థిక ఖాతాలను ముగించుకొని కొత్త ఖాతాలను ప్రారంభిస్తారు. ఇది విభేదాలను పరిష్కరించుకుంటూ, మనల్ని మనం మరియు ఒకరినొకరు క్షమించుకొంటూ మన సంబంధాలను ప్రేమ, నమ్మకం మరియు గౌరవం యొక్క వైబ్రేషన్లతో నింపుకొంటూ మన పాత కర్మల ఖాతాలను తీర్చుకునే దానికి ప్రతీకాత్మకం.

మనం ఈ విధంగా పండుగను జరుపుకున్నప్పుడు, అసత్యపు గుర్తింపు మరియు ఆధ్యాత్మిక అజ్ఞానం యొక్క చీకటిని జయించి, లోపల ఉన్న దివ్యమైన జ్ఞాన దీపాన్ని వెలిగిస్తాము. తిరిగి మనం స్వయంపై లేదా ఆంతరిక ప్రపంచంపై రాజ్యం చేస్తాము. అప్పుడు మనం మనలో శ్రీలక్ష్మి యొక్క దివ్యతను నిజంగా ప్రత్యక్షం చేయగలం. అంటే అపారమైన సంతోషం, ఆరోగ్యం మరియు సామరస్యాన్ని అనుభవం చేసుకోవటానికి కొత్తగా ఆలోచించే, జీవించే, ప్రవర్తించే, ఆత్మిక స్థితిలో ఉంటూ తయారయ్యే విధానాలను మనం స్వాగతిస్తామని దీని అర్థం.

మీ సమీపంలో ఉన్న రాజయోగ మెడిటేషన్ సెంటర్ కొరకు

[drts-directory-search directory="bk_locations" size="lg" style="padding:15px; background-color:rgba(0,0,0,0.15); border-radius:4px;"]

రికార్డు

9th july 2025 soul sustenance telugu

ఆరోగ్యకరమైన వర్క్-లైఫ్ బ్యాలన్స్ ను సాధించడం

ప్రతి రోజు మీ వాట్సప్ లో ఒక మంచి విషయాన్ని తెలుసుకునేందుకు జీవితం ఒక ప్రవాహంవంటిది, కనుక, మనం మన బాధ్యతల ప్రాధాన్యతలను మారుస్తూ ఉండాలి, మనకు మద్దతు ఇచ్చే జీవితంలోని అన్ని అంశాల

Read More »
8th july 2025 soul sustenance telugu

ప్రేమను ఆపేక్షలతో సమానం చేయకండి

ప్రతి రోజు మీ వాట్సప్ లో ఒక మంచి విషయాన్ని తెలుసుకునేందుకు మన స్వభావాలు, విలువలు, లక్ష్యాలకు అనుగుణంగానే ఇతరులు ప్రవర్తించాలని మనం సాధారణంగా కోరుకుంటాం. ఎవరైనా మన అంచనాలకు తగ్గట్లుగా ఉంటే, వారు

Read More »
7th july 2025 soul sustenance telugu

గతాన్ని వదిలేసేందుకు 7 పద్ధతులు (పార్ట్ 3)

ప్రతి రోజు మీ వాట్సప్ లో ఒక మంచి విషయాన్ని తెలుసుకునేందుకు సరిదిద్దుకోవటం – ఆత్మలో జ్ఞాపకాలు ఆత్మపై ముద్రలు వంటివి. కొన్ని ముద్రలు లోతైనవి, కొన్ని కాకపోవచ్చు. గత నెగిటివ్ అనుభవాలు ఆత్మపై

Read More »