Hin

3rd october 2024 soul sustenance telugu

October 3, 2024

ఈ నవరాత్రులలో మీ ఆంతరిక శక్తులను అనుభవం చేసుకోండి

నవరాత్రి (అక్టోబర్ 3 నుండి అక్టోబర్ 11 వరకు) ఆచారాలు మన దివ్యత్వాన్ని ఎలా నిలుపుకుంటామనే దానిపై చాలా చెబుతాయి. నవరాత్రి యొక్క ఆధ్యాత్మిక అర్ధాన్ని తెలుసుకొని మన ఆంతరిక శక్తులను అనుభవం చేసుకుందాము.

  1. శివుడు మరియు శక్తి అంటే పరమాత్ముడు మరియు ఆత్మ. ప్రతి దేవత ఒక కుమారి(కన్య) కానీ వారిని తల్లి(అమ్మ) అని పిలుస్తారు, ప్రతి దేవత రాక్షసులను వధించడానికి ఆయుధాలతో చూపబడుతుంది. ఆత్మనైన నేను (శక్తి) భగవంతుడు (శివుడు)తో కనెక్ట్ అయినప్పుడు, నా నుండి పవిత్రత (కుమారి యొక్క గుణం), ప్రేమ (తల్లి యొక్క గుణం) మరియు శక్తి (రాక్షసులను చంపే ఆయుధాలు) వెలువడతాయి.
  2. ఆ శక్తి స్వరూపిణి 8 భుజాలు కలది. ఇది ప్రతి ఆత్మకు ఉన్న 8 శక్తులను సూచిస్తుంది – సహన శక్తి, సర్దుకునే శక్తి, ఎదుర్కొనే శక్తి, ఇముడ్చుకునే శక్తి, పరిశీలన శక్తి, నిర్ణయ శక్తి, సంకీర్ణ శక్తి మరియు సహయోగ శక్తి.
  3. ఆ శక్తి స్వరూపిణి 8 చేతులలో ఒక్కొక్క ఆయుధాన్ని పట్టుకుని రాక్షసులను జయిస్తుంది. ఆయుధాలు జ్ఞానం యొక్క సాధనాలను సూచిస్తాయి. మనము ఈ సాధనాలను ఉపయోగించి బలహీనతలు మరియు వికారాలనే రాక్షసులను అంతం చేస్తాము.
  4. ఉపవాసం అంటే పైన ఉండే భగవంతుని తో కనెక్ట్ అయ్యి వారి స్మృతిలో ఉండటం. ఉపవాసం అంటే మన సంకల్పాలలో, మాటల్లో, చర్యల లో వికారాలు లేకుండా ఉంటామని ప్రతిజ్ఞ చేయటము. కావున ఇది కోపం, విమర్శించడం, అహం, ఇతర చేదు అలవాట్లకు దూరంగా ఉండటం.
  5. సాత్విక ఆహారం మరియు స్వచ్ఛత – ఆత్మ మరియు శరీరం యొక్క స్వచ్ఛతను పెంచడానికి మనం చూసే, చదివే, వినే, మాట్లాడే, తినే మరియు త్రాగే ప్రతిదీ ఉన్నతమైన ఆధ్యాత్మిక శక్తితో నిండి ఉండాలి.
  6. జాగరణ – అంధకారం అనేది విలువలు అనే వెలుగు లేకపోవడాన్ని, తప్పుఒప్పుల అజ్ఞానతను సూచిస్తుంది. ఒక కొత్త ఆలోచనా విధానాన్ని జాగృతం చేసుకొని, ధారణ చేస్తూ జీవించడమే జాగరణ.
  7. రాస్ లేదా గర్బా డ్యాన్స్ – ప్రతి వ్యక్తి తమ స్టెప్పులను పక్క వ్యక్తి యొక్క స్టెప్పులకు అనుగుణంగా సమన్వయంతో చేయాల్సిన నృత్యం. ఏదైనా స్టెప్ మిస్ అయితే, గాయం అవ్వగలదు. ఇది మన సంబంధాలను సూచిస్తుంది. ఎలా అయితే మనం ఇతరుల సంస్కారాల ప్రకారం అడ్జెస్ట్ అవుతాము, దీనిని సంస్కరాల రాస్ అని కూడా అంటారు. మనం అడ్జస్ట్ అయ్యి సహించగలిగితే జీవితంలోని సంబంధాలు హ్యాపీ డ్యాన్స్‌గా ఉంటుంది, లేకపోతే గొడవలుగా మారగలదు.

మీ సమీపంలో ఉన్న రాజయోగ మెడిటేషన్ సెంటర్ కొరకు

రికార్డు

28th march 2025 soul sustenance telugu

సోషల్ మీడియా లైక్‌లు ముఖ్యమా?

ప్రతి రోజు మీ వాట్సప్ లో ఒక మంచి విషయాన్ని తెలుసుకునేందుకు సోషల్ మీడియా ఆధారిత సమాజంలో, మనం పోస్ట్ చేసే దానిపై ప్రజల ఆమోదం పొందడం మన స్వీయ-విలువ మరియు కీర్తికి కొలమానంగా

Read More »
27th march 2025 soul sustenance telugu

6 రకాల సంతృప్తులను మీ జీవితంలో భాగం చేసుకోండి

ప్రతి రోజు మీ వాట్సప్ లో ఒక మంచి విషయాన్ని తెలుసుకునేందుకు నేను నాతో సంతృప్తిగా ఉన్నానా – నాతో, నా సంస్కారాలతో, నా ఆలోచనలతో, మాటలు మరియు చర్యలతో సంతృప్తి చెందడం మరియు

Read More »
26th march 2025 soul sustenance telugu

ఈజీగా ఉండండి , బిజీగా కాదు

ప్రతి రోజు మీ వాట్సప్ లో ఒక మంచి విషయాన్ని తెలుసుకునేందుకు నేను చాలా బిజీగా ఉన్నాను…నాకు సమయం లేదు అని తరచుగా అంటూ ఉంటాము. ఇలాంటి మనస్తత్వం మనల్ని సమయానికి ప్రాధాన్యత ఇవ్వనివ్వదు.

Read More »