Hin

4th April 2025 Soul Sustenance Telugu

April 4, 2025

ఏకాగ్రతను మన స్వభావంగా చేసుకోవటం

ఏకాగ్రత ఎంత విలువైనదో మనందరికీ తెలుసు. చదువులలో కావచ్చు, ఆఫీస్ లోని ప్రాజెక్ట్ కావచ్చు లేదా ఇంటి పని కావచ్చు మన మనస్సుని శాంత పరిచి, మనం చేసే పని మీద ఏకాగ్రం చేయాలని కోరుకుంటాము. కానీ తరచుగా, మనం భావోద్వేగ లేదా ఇంద్రియ డిస్ట్రాక్షన్స్ కు లోనవుతాము. మన మనస్సు భ్రమించటం ప్రారంభించి ఆలోచనలు చెల్లాచెదురవుతాయి. మనకు కావలసిన దిశలో మన ఆలోచనలను కేంద్రీకరించే సామర్థ్యాన్ని పెంపొందించుకోవడం విజయానికి కీలకం.

 

  1. ఏకాగ్రత యొక్క అంతులేని ప్రతిఫలాలు మీకు తెలుసు. కానీ మీరు మీటింగ్ లో ఉన్నప్పుడు, అక్కడ జరిగే చర్చ గురించి కాకుండా మీ దృష్టిని కుటుంబం వైపు, చెల్లించాల్సిన బిల్లుల వైపు లేదా వీకెండ్ ప్లాన్ వైపు మళ్లించారా? కొన్ని సమయాల్లో పూర్తిగా ఏకాగ్రం చేయగలగటం, ఇతర సమయాల్లో అస్సలు ఏకాగ్రం చేయలేకపోవడాన్ని అనుభవం చేసారా?
  2. ఏకాగ్రత కొరకు మనస్సు నిశ్చలత, శక్తి యొక్క ఎనర్జీ ని క్రియేట్ చేయగలిగేలా ఉండాలి. ఉదయం పూట 15 నిమిషాలు స్వచ్ఛమైన, పాజిటివ్ సమాచారంతో మనస్సుకు శిక్షణ ఇవ్వడంతో మరియు రోజంతా మంచిని ఆలోచించడం ఏకాగ్రతను మెరుగుపరుస్తుంది. దృష్టిని ఇతర వైపులకు మరల్చటం, అతిగా ఆలోచించడం లేదా అల్లకల్లోలమైన ఆలోచనలు కలతచెందే శక్తిని తయారుచేస్తాయి. 
  3. ఒక పనిని ప్రారంభించే ముందు, పరధ్యానంలో ఉండకుండా, ఏవైనా పరిష్కరించని ప్రశ్నలకు మనస్సులో సమాధానం చెప్పుకోవడానికి ఒక నిమిషం మౌనం వహించండి. మీరు మొదలుపెట్టే పని గురించి కాలక్రమాన్ని తయారు చేసుకొని, ఒక ఉన్నత శక్తివంతమైన ఆలోచనను చేయండి. ఏ ఇతర ఆలోచన మిమ్ముల్ని డిస్టర్బ్ చెయ్యదు మరియు మీ మనస్సు నిశ్శబ్దంగా, నిశ్చలంగా, ఏకాగ్రతతో ఉంటుంది. 

4. ఏకాగ్రతను ఒక అలవాటుగా, జీవన విధానంగా చేసుకోవాలి. మనస్సు మీది మరియు మీ సూచనలను పాటిస్తుంది. మీరు దానిని బోధించే కళలో ప్రావీణ్యం పొందాలి. మీకు మీరు గుర్తు చేసుకోండి – ప్రతి పనిని కష్టం లేకుండా సకాలంలో పూర్తి చేయడానికి నేను బాగా ఏకాగ్రం చేస్తున్నాను. నా మనస్సు నా సాధనం, అది నా సూచనలను పాటిస్తుంది.

రికార్డు

22nd May 2025 Soul Sustenance Telugu

భోజనం చేసే ముందు భగవంతునికి ఆహారాన్ని అర్పించడం వల్ల కలిగే 7 ప్రయోజనాలు

ప్రతి రోజు మీ వాట్సప్ లో ఒక మంచి విషయాన్ని తెలుసుకునేందుకు మన ఆధ్యాత్మిక జీవితంలో మనం అలవర్చుకోవల్సిన ఒక అందమైన అలవాటు, భగవంతుని ధ్యానంలో ప్రతి భోజనాన్ని వండడం. అలాగే, ఒక రోజులో

Read More »
21st May 2025 Soul Sustenance Telugu

మీ వాస్తవిక సత్య గుణానికి తిరిగి వెళ్లడం

ప్రతి రోజు మీ వాట్సప్ లో ఒక మంచి విషయాన్ని తెలుసుకునేందుకు సత్యం మన వాస్తవిక గుణం, కానీ ఎప్పటికప్పుడు మన సౌలభ్యం కోసం లేదా స్వల్పకాలిక లాభాల కోసం అబద్ధాలు చెబుతాము. ఆసక్తికరమైన

Read More »
20th May 2025 Soul Sustenance Telugu

మీ పిల్లలతో తగినంత సమయం గడపకపోవడంపై అపరాధ భావాన్ని అధిగమించండి

ప్రతి రోజు మీ వాట్సప్ లో ఒక మంచి విషయాన్ని తెలుసుకునేందుకు వివిధ రకాల వ్యక్తిగత మరియు వృత్తిపరమైన నిబద్ధతలను గౌరవించేటప్పుడు, చాలా మంది తల్లిదండ్రులు తమ పిల్లలకు తగినంత నాణ్యమైన సమయాన్ని ఇవ్వకపోవడం

Read More »