ఏకాగ్రతను మన స్వభావంగా చేసుకోవటం

September 1, 2023

ఏకాగ్రతను మన స్వభావంగా చేసుకోవటం

ఏకాగ్రత ఎంత విలువైనదో మనందరికీ తెలుసు. చదువులలో కావచ్చు, ఆఫీస్ లోని ప్రాజెక్ట్ కావచ్చు లేదా ఇంటి పని కావచ్చు మన మనస్సుని శాంత పరిచి, మనం చేసే పని మీద ఏకాగ్రం చేయాలని కోరుకుంటాము. కానీ తరచుగా, మనం భావోద్వేగ లేదా ఇంద్రియ డిస్ట్రాక్షన్స్ కు లోనవుతాము. మన మనస్సు భ్రమించటం ప్రారంభిస్తుంది మరియు ఆలోచనలు చెల్లాచెదురవుతాయి. మనకు కావలసిన దిశలో మన ఆలోచనలను కేంద్రీకరించే సామర్థ్యాన్ని పెంపొందించుకోవడం విజయానికి కీలకం.

  1. ఏకాగ్రత యొక్క అంతులేని ప్రతిఫలాలు మీకు తెలుసు. కానీ మీరు మీటింగ్ లో ఉన్నప్పుడు, అక్కడ జరిగే చర్చ గురించి కాకుండా మీ దృష్టిని కుటుంబం వైపు, చెల్లించాల్సిన బిల్లుల వైపు లేదా వీకెండ్ ప్లాన్ వైపు మళ్లించారా? కొన్ని సమయాల్లో పూర్తిగా ఏకాగ్రం చేయగలగటం, ఇతర సమయాల్లో అస్సలు ఏకాగ్రం చేయలేకపోవడాన్ని అనుభవం చేసారా?
  2. ఏకాగ్రత కొరకు మనస్సు నిశ్చలత, శక్తి యొక్క ఎనర్జీ ని క్రియేట్ చేయగలిగేలా ఉండాలి. ఉదయం పూట 15 నిమిషాలు స్వచ్ఛమైన, పాజిటివ్ సమాచారంతో మనస్సుకు శిక్షణ ఇవ్వడంతో మరియు రోజంతా మంచిని  ఆలోచించడం ఏకాగ్రతను మెరుగుపరుస్తుంది. దృష్టిని ఇతర వైపులకు మరల్చటం, అతిగా ఆలోచించడం లేదా అల్లకల్లోలమైన ఆలోచనలు కలతచెందే శక్తిని తయారుచేస్తాయి. 
  3. ఒక పనిని ప్రారంభించే ముందు, పరధ్యానంలో ఉండకుండా, ఏవైనా పరిష్కరించని ప్రశ్నలకు మనస్సులో సమాధానం చెప్పుకోవడానికి ఒక నిమిషం మౌనం వహించండి. మీరు మొదలుపెట్టే పని గురించి కాలక్రమాన్ని తయారు చేసుకొని, ఒక ఉన్నత శక్తివంతమైన ఆలోచనను చేయండి. ఏ ఇతర ఆలోచన మిమ్ముల్ని డిస్టర్బ్ చెయ్యదు మరియు మీ మనస్సు నిశ్శబ్దంగా, నిశ్చలంగా, ఏకాగ్రతతో ఉంటుంది. 
  4. ఏకాగ్రతను ఒక అలవాటుగా, జీవన విధానంగా చేసుకోవాలి. మనస్సు మీది మరియు మీ సూచనలను పాటిస్తుంది. మీరు దానిని బోధించే కళలో ప్రావీణ్యం పొందాలి. మీకు మీరు గుర్తు చేసుకోండి – ప్రతి పనిని కష్టం లేకుండా సకాలంలో పూర్తి చేయడానికి నేను బాగా ఏకాగ్రం చేస్తున్నాను. నా మనస్సు నా సాధనం, అది నా సూచనలను పాటిస్తుంది.

మీ సమీపంలో ఉన్న రాజయోగ మెడిటేషన్ సెంటర్ కొరకు

రికార్డు

28th-sept-2023-soul-sustenance-telugu

ఆంతరిక అందానికి 3 అద్దాలు (పార్ట్ 4)

మూడవ అద్దం మీ ఆలోచనలు, మాటలు మరియు చర్యల అద్దం – మీ గురించి మరియు ఇతరుల గురించి మీరు ఏమనుకుంటున్నారో, ఏమి ఫీల్ అవుతున్నారో ఇతరులకు కనిపించదు కేవలం మీకు మాత్రమే తెలుస్తుంది.

Read More »
27th-sept-2023-soul-sustenance-telugu

ఆంతరిక అందానికి 3 అద్దాలు (పార్ట్ 3)

గత రెండు రోజుల సందేశాలలో, అంతర్గత అందానికి మొదటి అద్దం – ఆధ్యాత్మిక జ్ఞానం యొక్క అద్దం గురించి మేము వివరించాము. రెండవ అద్దం మెడిటేషన్ యొక్క అద్దం – మెడిటేషన్ యొక్క నిశ్చలత

Read More »
26th-sept-2023-soul-sustenance-telugu

ఆంతరిక అందానికి 3 అద్దాలు (పార్ట్ 2)

నిన్నటి సందేశంలో ఆధ్యాత్మిక జ్ఞానం అనే మొదటి అద్దం గురించి చర్చించుకున్నాం. ఈ అద్దం మీకు పరమాత్మను కూడా చూపుతుంది, వారి సద్గుణాలను , పదాలు మరియు చర్యలను గురించి మీకు గుర్తు చేస్తుంది.

Read More »