Hin

15th jan 2024 soul sustenance telugu

January 15, 2024

ఎవరైనా మిమ్మల్ని విశ్వసించినప్పుడు గోప్యతను పాటించండి

వ్యక్తులు మనల్ని నమ్మి వారి గోప్యమైన, వ్యక్తిగత సమాచారాన్ని మనకు వినిపిస్తే, ఆ సమాచారాన్ని మనం గోప్యంగా ఉంచుతామని వారు నమ్ముతారు. మీ కుటుంబ సభ్యులు లేదా స్నేహితులు మిమ్మల్ని నమ్మి, మీకు తమ రహస్యాన్ని వినిపిస్తే మీరు కనీసం ఒక్కరికైనా దానిని బయటపెట్టిన సందర్భం మీకు గుర్తుందా? ఈ అలవాటు మన విశ్వసనీయతను, బంధాలను ప్రమాదంలో పడేస్తాయి.

  1. గోప్యతను పాటించడం మన వ్యక్తిత్వాన్ని ప్రతిబింబిస్తుంది – ఎంత నమ్మకంగా, విశ్వసనీయంగా, నమ్మదగినవారిగా ఉన్నారు! తమ వ్యక్తిగత సమాచారాన్ని పంచుకోవడానికి, వారికి తెలిసిన వందలాది మందిలో మిమ్మల్ని వారు ఎంచుకున్నారు. వారు మిమ్మల్ని నమ్ముతున్నారు; మీకు మాత్రమే తెలియాలి అనుకుంటున్నారు, మీ సలహాను కోరుకుంటున్నారు.
  2. ఎవరైనా తమ జీవితం గురించి లేక ఇతరుల జీవితంలోని ఒక సున్నితమైన అంశాన్ని మీతో పంచుకుంటే గోప్యతను గౌరవించండి. మీ కుటుంబ సభ్యులు వారి ఆరోగ్యం గురించి చెప్పవచ్చు లేదా మీ ఆఫీసరు వ్యాపార ఒప్పందం గురించి చెప్పవచ్చు. ఆ అంశాలను ఎట్టి పరిస్థితిలోనూ ఎవ్వరికీ చెప్పను అని మీకు మీరే ప్రతిజ్ఞ చేయండి, ఇతరులకు నమ్మబలకండి.
  3. తెలిసిన విషయాన్ని ఇతరులకు వినిపించాలని అప్పుడప్పుడూ అనిపిస్తుంది లేదా చెప్పమని ఇతరులు మిమ్మల్ని మరీమరీ అడగవచ్చు. మీరు చెబితే మిమ్మల్ని నమ్మిన వారి పేరును మీరు దెబ్బతీసిన వారవుతారు, అలాగే మీ విశ్వసనీయతను కూడా మీరు పోగొట్టుకుంటారు.
  4. ఏ బంధంలోనైనా, వృత్తిలోనైనా, వ్యక్తిగతంగానైనా గోప్యతను పాటించడం తప్పనిసరి. ఓపికగా వినండి, పూర్తిగా అర్థం చేసుకోండి, విమర్శనాత్మకంగా ఉండకండి. మీ నైతిక ప్రమాణాలను ప్రతిసారీ, ప్రతి ఒక్కరితో పాటించండి.

మీ సమీపంలో ఉన్న రాజయోగ మెడిటేషన్ సెంటర్ కొరకు

[drts-directory-search directory="bk_locations" size="lg" cache="1" style="padding:15px; background-color:rgba(0,0,0,0.15); border-radius:4px;"]

రికార్డు

18th july 2025 soul sustenance telugu

స్వీయ సందేహం మరియు అభద్రతలను అధిగమించడం

ప్రతి రోజు మీ వాట్సప్ లో ఒక మంచి విషయాన్ని తెలుసుకునేందుకు మన ఆనందాన్ని క్షీణింపజేసి, మనకు నిరాశ కలిగించే ఒక భావోద్వేగం – అభద్రత. మన గురించి, మన సంబంధాలు, ఆరోగ్యం, ఆర్థికం

Read More »
17th july 2025 soul sustenance telugu

ఇదే సరైన సమయం

ప్రతి రోజు మీ వాట్సప్ లో ఒక మంచి విషయాన్ని తెలుసుకునేందుకు మీరనుకున్న మార్పును తీసుకురావడానికి లేదా అసంపూర్ణంగా ఉన్న పనిని పూర్తి చేయడానికి ఏది సరైన సమయం? నేను నూతన సంవత్సరంలో ప్రారంభిస్తాను…

Read More »
16th july 2025 soul sustenance telugu

ఆధ్యాత్మికతతో మన భావోద్వేగ మరియు శారీరక ఆరోగ్యాన్ని కాపాడుకోవడం (పార్ట్ 3)

ప్రతి రోజు మీ వాట్సప్ లో ఒక మంచి విషయాన్ని తెలుసుకునేందుకు మెడిటేషన్ ని మీ ఔషధంగా చేసుకొని ఆ ఔషధాన్ని ప్రతి రోజు తీసుకోండి మెడిటేషన్ మన మనస్సును మరింత శక్తివంతంగా చేసి

Read More »