19th-sept-2023-soul-sustenance-telugu

September 19, 2023

గణేష్ చతుర్థి యొక్క ఆధ్యాత్మిక ప్రాముఖ్యత (పార్ట్ 1)

మనం శ్రీ గణేషుని యొక్క ఆగమనం మరియు జననాన్ని గొప్ప విశ్వాసంతో మరియు ఉత్సాహంతో జరుపుకుంటాము. మన జీవితంలోని విఘ్నాలను తొలగించమని వారిని  ప్రార్థిస్తాము. మనలో చాలా మందికి వారి పుట్టుక మరియు భౌతిక రూపం గురించి పురాణ కథలు సుపరిచితం. అన్ని పండుగల వలె  శ్రీ గణేష్ చతుర్థి (సెప్టెంబర్ 19 నుండి సెప్టెంబర్ 28 వరకు) అత్యంత ఆధ్యాత్మిక ప్రాముఖ్యతను కలిగి ఉంది. శ్రీ గణేషుడు మనలో ప్రతి ఒక్కరిలో ఉన్న దైవత్వాన్ని సూచిస్తారు. వారి రూపం అనేక సద్గుణాలకు ప్రతీక,  మన జీవితాల్లో మనం ధారణ చేసి అనుసరించడానికి మార్గదర్శక సూత్రాలతో నిండి ఉంది.

పార్వతి దేవి స్నానం చేయాలనుకొని  గేటు దగ్గర ఎవరినైనా కాపలాగా ఉంచాలని కోరుకున్నట్లు కథనం. తన శరీరంపై ఉన్న మట్టిలోంచి ఓ చిన్నారిని సృష్టించి, అతనికి ప్రాణం పోసి, కాపలాగా పెట్టింది. శంకరుడు 10 సంవత్సరాల తీవ్రమైన తపస్సు  నుండి ఇంటికి తిరిగి వచ్చారు, కాని బాల గణేషుడు శంకరుని ప్రవేశాన్ని నిరాకరించాడు. కోపోద్రిక్తుడైన శంకరుడు చిన్నారి తలను నరికి చంపాడు. అయితే తరువాత వాస్తవాన్ని తెలుసుకున్న శంకరుడు ఏనుగు తలను ఆ చిన్నారి శరీరంపై ఉంచి తిరిగి బతికించాడు.

 

ఇది ఆసక్తికరమైన కథ అయినప్పటికీ, అందులోని కొన్ని సంఘటనల ప్రవాహాన్ని మనం ఆగి ప్రశ్నించాలి. పార్వతి దేవి శరీరంపై బిడ్డను సృష్టించేంత మట్టి ఎలా ఉంది, మట్టి నుండి బిడ్డను ఎలా సృష్టించింది? శంకరుడు అన్నేళ్ల పాటు తపస్సు చేసి తిరిగి వచ్చిన వెంటనే అంత కోపం రావడం ఎలా సాధ్యమైంది? పైగా శంకరుడు కరుణామయుడు, మరి చిన్న కారణంతో అమాయకపు చిన్నారిని ఎందుకు చంపాడు? గణేషునికి  తన తల బదులుగా ఏనుగు తలను ఎందుకు పెట్టాల్సి  వచ్చింది?

కథ వెనుక ఉన్న సారాంశాన్ని అర్థం చేసుకుంటే, పై ప్రశ్నలకు సమాధానాలు మన జీవితానికి సంబంధించినవి. పార్వతి దేవి తన శరీరం నుండి సృష్టించిన బిడ్డ దేహ భ్రాంతిని సూచిస్తుంది. అతని అహం తన తండ్రిని గుర్తించనివ్వలేదు. ఆత్మలైన మనం దేహ భ్రాంతితో ఉంటే మన అహం సర్వశక్తివంతుడైన తండ్రి లేదా పరమాత్ముడిని గుర్తించకుండా మనల్ని నిరోధిస్తుంది. తల అహంకారాన్ని సూచిస్తుంది. శంకరుడు  బిడ్డ  తలను నరకడం అనగా పరమాత్ముడు మన అహాన్ని అంతం చేసి, దాని స్థానంలో జ్ఞానాన్ని ఇస్తాడని సూచిస్తుంది. వివేకం మన విఘ్నాలను తొలగించే శక్తిని ఇస్తుంది. శ్రీ గణేష్ జన్మ మరియు వారి సద్గుణాలు మనకు విఘ్న వినాశకులుగా అవ్వడం  లేదా విఘ్నాలను ఎలా తొలగించవచ్చో బోధిస్తాయి.

 (రేపు కొనసాగుతుంది…)

మీ సమీపంలో ఉన్న రాజయోగ మెడిటేషన్ సెంటర్ కొరకు

రికార్డు

24th-sept-2023-soul-sustenance-telugu

నెగిటివ్ పరిస్థితుల్లో పాజిటివ్ గా ఉండటానికి 5 మార్గాలు

మన జీవితంలో ఏదైనా పరిస్థితి నెగిటివ్ ఫలితాన్ని కలిగి ఉండవచ్చు. కానీ చాలా సార్లు  మనము నెగిటివ్ ఫలితం గురించి ఆలోచించడం ప్రారంభిస్తాము ఇంకా అది జరగడానికి ముందే భయపడతాము. వివేకంతో నిండిన బుద్ధి

Read More »
23rd-sept-2023-soul-sustenance-telugu

మిమ్మల్ని మీరు నెగిటివ్ గా లేబుల్ చేసుకోకండి

అందరూ తమ వ్యక్తిత్వం మరియు అవగాహనల ఫిల్టర్ ద్వారా మనల్ని చూసినట్లే, మనం స్వయంపై పెట్టుకొనే కొన్ని లేబుల్‌ల ద్వారా కూడా మనల్ని మనం చూసుకుంటాము. నేను సోమరిని, నాకు అజాగ్రత్త ఉంది వంటి

Read More »
22nd-sept-2023-soul-sustenance-telugu

ట్రాఫిక్ జామ్ – రోడ్డుపైనా లేక మనసులోనా?

మనలో చాలా మందికి, ట్రాఫిక్ రద్దీ, పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ లో  జాప్యం, ఫ్లైట్ మిస్ అవ్వటం లేదా క్యూలలో వేచి ఉండటం నిరాశ, ఒత్తిడి మరియు ఆందోళనకు మూలాలు. ఇవి రొటీన్ కావచ్చు, కావున

Read More »