Hin

21th-sept-2023-soul-sustenance-telugu

September 21, 2023

గణేష్ చతుర్థి యొక్క ఆధ్యాత్మిక ప్రాముఖ్యత (పార్ట్ 3)

  1. శ్రీ గణేష్ యొక్క పెద్ద ఉదరము ఇముడ్చుకునే శక్తిని సూచిస్తుంది. ఇతరుల బలహీనతలు మరియు వారి తప్పుడు చర్యల గురించి మనం ఇతరులతో మాట్లాడకూడదు.
  2. శ్రీ గణేష్ చేతిలో గొడ్డలి, తాడు మరియు కమలం చూపిస్తారు, ఒక చేయ్యి దీవెనలు ఇస్తోంది. గొడ్డలి నెగిటివ్ అలవాట్లను తగ్గించే శక్తిని సూచిస్తుంది. తాడు అనేది స్వచ్ఛమైన జీవనశైలి యొక్క క్రమశిక్షణతో ముడిపడి ఉండటానికి ప్రతీక. కమల పుష్పం వంటి జీవితం అంటే బురదతో నిండిన పరిసరాలలో జీవిస్తూ అంటీ ముట్టనట్టుగా, స్వచ్ఛంగా ఉండటం. వరద  హస్తం అంటే ఇతరులు ఎలా ప్రవర్తించినా, మన ఆలోచనలు మరియు మాటలు వారికి కేవలం ఆశీర్వాదం గానే ఉండాలి. 
  3. వారి  ఒక కాలు నేలను తాకినట్లు మరియు మరొకటి మడిచి కూర్చున్నట్లు చూపిస్తారు. స్థిరంగా మరియు నిరాడంబరంగా ఉండాలని ఇది మనకు గుర్తు చేస్తుంది. ప్రపంచం లో ఉంటూ అతీతంగా ఉండాలి.
  4. వారి ఒక చేతిలో ఉంచబడిన మోదకం కృషి కి ఫలితమైన విజయాన్ని సూచిస్తుంది. కానీ వారు  దానిని తినడం ఎప్పుడూ చూపించలేదు, అంటే విజయం సాధించడం కానీ దాని కోసం క్రెడిట్ తీసుకోవద్దు. మోదకం తయారు చేయడానికి మొత్తం 5 వేళ్ళు అవసరం, అది ఐక్యత మరియు సహకారాన్ని సూచిస్తుంది.
  5. శ్రీ గణేష్ పాదాలకు దగ్గరగా చూపించిన ఎలుక దుర్గుణాలు, కోరికలపై విజయాన్ని సూచిస్తుంది. ఒక చిన్న రంధ్రం ద్వారా కూడా ఎలుక నిశ్శబ్దంగా ఇంట్లోకి ప్రవేశించినట్లు, అప్రమత్తంగా లేని ఆత్మలోకి దుర్గుణాలు ప్రవేశిస్తాయి. శ్రీ గణేష్ యొక్క అన్ని లక్షణాలను మనం గ్రహించినప్పుడు, మన దుర్గుణాలను మరియు కోరికలను అధిగమిస్తాము.

మన ప్రతి ఆలోచన, మాట మరియు చర్యలో శ్రీ గణేశుడు సూచించిన దైవీ లక్షణాలను మనం అనుభవం చేసుకోవటం, వ్యక్తపరచడం ప్రారంభించినప్పుడు, మన ఆటంకాలు నాశనం అవుతాయి.  మన జీవితంలో అడుగడుగునా స్వచ్ఛత, శాంతి మరియు శ్రేయస్సును అనుభవిస్తాము.

మీ సమీపంలో ఉన్న రాజయోగ మెడిటేషన్ సెంటర్ కొరకు

రికార్డు

8th october 2024 soul sustenance telugu

ఆలోచనలపై ప్రతికూల ప్రభావాలను అధిగమించడం (పార్ట్ 1)

మన ఆలోచనలు వివిధ రకాలు, వివిధ తీవ్రతలను కలిగి ఉంటాయి. వాటి సంఖ్య  కూడా మెలకువగా ఉన్నప్పుడు, నిద్రపోతున్నప్పుడు ఎప్పటికప్పుడు మారుతూ ఉంటుంది. ఆ నిర్దిష్ట సమయంలో మనం ఏ చర్య చేస్తున్నాం లేదా

Read More »
7th october 2024 soul sustenance telugu

వైఫల్యాలను సులభంగా అంగీకరించడం

మనం ఎంత కష్టపడినా కొన్నిసార్లు విఫలమవుతాము అనేది జీవితంలో ముఖ్యమైన పాఠాలలో ఒకటి. మనం వైఫల్యాలు, లోపాలను మన ప్రయాణంలో భాగంగా పరిగణించి అంగీకరించాలి. మనలో చాలా మంది జీవితంలో వైఫల్యాలకు భయపడతాము .

Read More »
6th october 2024 soul sustenance telugu

నిర్లిప్తంగా ఉండి, గమనించి మరల్చుకోండి

మన జీవితాలు ఎప్పటికప్పుడు వివిధ రకాల పరిస్థితులతో నిండి ఉంటాయి. మనం తరచుగా పరిస్థితుల వల్ల ప్రతికూలంగా ప్రభావితమవ్వడంతో మన ఆంతరిక శక్తి తగ్గుతుంది. నిర్లిప్తంగా ఉండి, గమనించి మరల్చుకోవటం అనేది ఆధ్యాత్మికత యొక్క

Read More »