Hin

6th june2024 soul sustenance telugu

June 8, 2024

గాడ్జెట్‌ల వ్యసనాన్ని అధిగమించడం

మీరు ప్రతి 10 నిమిషాలకు మీ ఫోన్‌ని చెక్ చేస్తున్నారా? మీ ఫోన్ బ్యాటరీ 20 శాతానికి పడిపోయినప్పుడు మీరు గాభరాపడుతున్నారా? మీరు భోజన సమయంలో మొబైల్ లేదా టీవీ స్క్రీన్‌లను చూడకుండా ఉండగలరా? మీరు మీ కుటుంబంతో ఉన్నప్పుడు ఇమెయిల్‌లను చెక్ చేయడాన్ని ఆపలేకపోతున్నారా? గాడ్జెట్‌లను ఉపయోగించడం నుండి వాటిని దుర్వినియోగం చేయడం వరకు, గాడ్జెట్ వ్యసనం మన ఆనందాన్ని, ఆరోగ్యాన్ని మరియు సంబంధాలను దెబ్బతీస్తోంది. స్క్రీన్ సమయాన్ని పరిమితం చేయడం వల్ల మీ సమయం, శక్తి ఆదా అవుతాయి. ప్రతిరోజూ మీకు మీరు గుర్తు చేసుకోండి – నేను శక్తివంతమైన ఆత్మను. నేను నా గాడ్జెట్‌లను వాటి ప్రయోజనం కోసం ఉపయోగిస్తాను, నేను వాటిలో దేనికీ బానిసను కాదు. నేను సాంకేతికతతో నా సమయాన్ని పరిమితం చేసుకుంటాను. నా గాడ్జెట్‌లు నా సమయాన్ని, శక్తిని లేదా అలవాట్లను నియంత్రించవు.

మీరు డిజిటల్ స్క్రీన్‌లను అతిగా ఉపయోగిస్తున్నట్లు భావిస్తున్నారా? మీ గాడ్జెట్‌లు మీ జీవితంలో ఎక్కువ భాగం అవుతున్నాయా? డిజిటల్ స్క్రీన్లను చూసే అదనపు గంటలు వ్యసనంగా మారవచ్చు. ప్రతి వార్తను చదవడం, మరొక క్రికెట్ మ్యాచ్ చూడడం, మనం మిస్ అయిన టీవీ షో యొక్క ఎపిసోడ్‌లను తెలుసుకోవడం మరియు ఇలా… ఆలోచనలు చర్యకు దారితీస్తాయి, చర్యకు అలవాటు పడతాము మరియు అలవాటు వ్యసనంగా మారుతుంది. మీ స్క్రీన్ సమయాన్ని నిర్ణయించుకోండి. అది అలవాటు అయ్యే వరకు ఆ షెడ్యూల్‌కు కట్టుబడి ఉండండి. మీ ఉద్దేశాలను సమర్థించే మీ సంకల్ప శక్తి, క్రమశిక్షణ గాడ్జెట్ వ్యసనాన్ని అంతం చేస్తుంది. గాడ్జెట్‌ల ద్వారా ఇతరుల జీవితాలను చూసే బదులు, మీ జీవితంతో మరింత ఉత్పాదకంగా ఉండండి. ఆరోగ్యకరమైన మార్గాల్లో మీ గాడ్జెట్‌లు, సాంకేతికతతో సంబంధం కలిగి ఉండటం ప్రారంభించండి. మీ కంప్యూటర్, ఫోన్ మరియు టీవీ మీ జీవితాన్ని సౌకర్యవంతంగా మార్చాయి. మీ గాడ్జెట్‌లకు మాస్టర్ గా అయ్యి వాటిని మీ సాధనాలుగా చేసుకోండి. మీ గాడ్జెట్‌లకు బానిస కావద్దు. మీ గాడ్జెట్‌లు మీ మనస్సును నియంత్రించకుండా చూసుకోండి, మీకు సంతోషాన్ని లేదా బాధను అవి కలిగించవు. వాటి ప్రయోజనాన్ని మెచ్చుకోండి, వాటిని ఉపయోగించడం ఆనందించండి, అవసరమైనప్పుడు వాటిని ఉపయోగించండి, అవసరం లేనప్పుడు అసౌకర్యంగా భావించకుండా వాటికి దూరంగా ఉండండి. మీరు వాటిని ఏ కారణం చేతనైనా ఉపయోగించలేకపోతే కలవరపడకండి. రోజుకు x(నిర్ణయించుకున్న) గంటలు మాత్రమే టీవీ చూడండి, అవసరమైనప్పుడు మాత్రమే మీ కంప్యూటర్‌ను ఉపయోగించండి, అవసరమైనప్పుడు మాత్రమే ఫోన్ చేయండి, కొత్త మెసేజ్ ల కోసం చెక్ చేయవద్దు, మీడియా మరియు సోషల్ మీడియాలో ప్రతిదాన్ని చదవవద్దు లేదా చూడవద్దు. మీ మనస్సు మరియు శరీరానికి ఆరోగ్యకరమైన వాటిని మాత్రమే తీసుకోండి.

మీ సమీపంలో ఉన్న రాజయోగ మెడిటేషన్ సెంటర్ కొరకు

రికార్డు

22nd june2024 soul sustenance telugu

మీ మనస్సు ఒక బిడ్డ వంటిది

మనస్సు మన బిడ్డలాంటిది. మనం మన బాధ్యతలను నిర్వర్తిస్తున్నప్పటికీ, మీలో ఉన్న ఈ బిడ్డ  శ్రేయస్సుకు ప్రాధాన్యత ఇవ్వాలి. మనం దానిని ప్రేమించాలి, పాలన చేయాలి మరియు ఓదార్చాలి. మనుష్యులు తమ మనస్సుపై నియంత్రణ

Read More »
21st june2024 soul sustenance telugu

మనుష్యుల వైబ్రేషన్లను అనుభూతి చెందడం ప్రారంభించండి

మీరు ఎవరినైనా కలిసినప్పుడు, మీ దృష్టి ఎటు వెళుతుంది? ఒకటి: వారి రూపం మరియు వస్త్రాలు పై మీ దృష్టి వెళుతుంది. రెండు: వారి మాటలు మరియు చేతల పై దృష్టి వెళుతుంది. ఇపుడు

Read More »
20th june2024 soul sustenance telugu

పోటీ పడటం మానండి… ఈ క్షణాన్ని ఆస్వాదించండి (పార్ట్ 4)

మనం ఏదైనా పని చేస్తున్నప్పుడు సమతుల్య మనస్సును ఉంచుకోవడం కూడా చాలా ముఖ్యం. కోపం, ఆవేశం, అహం లేదా దురాశ మన ఆలోచనలలో అసమతుల్యతను సృష్టించవచ్చు. మనల్ని మనం మనలాగే అనుభవం చేసుకున్నప్పుడు మరియు

Read More »