Hin

17th august 2024 soul sustenance telugu

August 17, 2024

గందరగోళం లేని జీవనశైలిని అవలంబించడం

మనలో ప్రతి ఒక్కరూ క్రమబద్ధమైన జీవితాన్ని గడపడానికి ఇష్టపడతారు. పరిశుభ్రత మరియు క్రమబద్ధత మన అసలు సంస్కారాలు. కాబట్టి మన చుట్టూ ఉన్న ప్రతిదీ – మన ఇల్లు, కార్యాలయం, వర్క్-డెస్క్, మన కంప్యూటర్ లేదా ఫోన్లోని ఫైల్లు, మన అల్మారాలు, తోట మొదలైనవి చక్కగా ఉండాలని మనం కోరుకుంటాము. చాలా మందికి క్రమం తప్పకుండా ఒక నిర్దిష్ట శుభ్రపరిచే షెడ్యూల్ కూడా ఉంటుంది. లేదా, మనం చుట్టూ అస్తవ్యస్తంగా పడి ఉన్న వస్తువులను చూస్తే, వెంటనే వాటిని సరైన స్థానంలో పెట్టడానికి ఇష్టపడతాము. కానీ మనం ఎంత తరచుగా అంతరగంలో ఉన్న గందరగోళాన్ని తొలగిస్తాము?  మన ఆలోచనలని లేదా అనుభూతి త్వరగా పొందగలిగే విధంగా మన మనస్సును చివరిసారిగా ఎప్పుడు వ్యవస్థీకరించాము? మన మనస్సు సరైన మరియు తప్పు ఆలోచనల యొక్క అపారమైన భాండాగారం. కొన్నిసార్లు మనం ఒక కార్యాచరణపై పని చేస్తున్నప్పుడు, మనస్సు భ్రమిస్తూ ప్రస్తుత పని గురించి, ఇలాంటి పని యొక్క గత అనుభవాల గురించి, పనికి సంబంధించిన వ్యక్తుల గురించి లేదా పూర్తిగా సంబంధం లేని పని గురించి చాలా ఆలోచనలను సృష్టిస్తుంది. ఫలితం యొక్క నాణ్యత కూడా ప్రశ్నార్థకంగా మారవచ్చు. మనం కార్యం చేసేటప్పుడు స్వస్థితిపై శ్రద్ధ చూపనప్పుడు, ఆ  కార్యాచరణను పూర్తి చేయడానికి మనం ఎందుకు ఎక్కువ సమయం తీసుకున్నామో లేదా ఎందుకు అలసిపోయామో మనకు అర్థం కాకపోవచ్చు.

చాలా మంది ఉద్యోగులు తమ కార్యాలయాల్లో రోజుకు 8-10 గంటలు గడుపుతారు. మనం ఉత్పాదక గంటల వాస్తవ సంఖ్యను గమనిస్తే, అది మన మనస్సు-బుద్ది యొక్క మానసిక ఆరోగ్యానికి మంచి సూచిక. మనలో కొంతమందికి సోషల్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియాలో సందేశాలను చదవడానికి ప్రతి కొన్ని నిమిషాలకు ఒకసారి మన ఫోన్లు లేదా కంప్యూటర్లను చెక్ చేయడం అలవాటు. కాబట్టి మన పరికరాలు మాత్రమే కాదు, మన మనస్సు కూడా సమాచారంతో నిండిపోతుంది. సమాచారం ఆలోచనలకు మూలం, కాబట్టి మనస్సు ఒకే నాణ్యత గల అనేక ఆలోచనలను సృష్టించడం ప్రారంభించి మన ఆంతరిక శక్తిని తగ్గిస్తుంది.రోజులో క్రమమైన వ్యవధిలో సానుకూల సమాచారం యొక్క ఇన్‌పుట్‌లు మరియు రోజు సమయంలో అనవసరమైన సమాచారం నుండి నిర్లిప్తత మనల్ని మరింత దృష్టి కేంద్రీకరిస్తుంది, మానసికంగా అలసిపోకుండా మరియు అడుగడుగునా చురుకుగా ఉంచుతుంది, చర్యలో సమర్థతను తీసుకువస్తుంది.

మీ సమీపంలో ఉన్న రాజయోగ మెడిటేషన్ సెంటర్ కొరకు

రికార్డు

20th march 2025 soul sustenance telugu

సంబంధాల్లో కలిగే బాధ నుండి విముక్తిని పొందడం (పార్ట్ 1)

ప్రతి రోజు మీ వాట్సప్ లో ఒక మంచి విషయాన్ని తెలుసుకునేందుకు జీవితంలోని వివిధ రంగాలలో వేర్వేరు సంబంధాలలోకి వచ్చినప్పుడు, కొన్నిసార్లు మన అంతర్గత ప్రపంచంలోకి మరొక ఆత్మను అనుమతించినప్పుడు, మనల్ని వారు అర్థం

Read More »
19th march 2025 soul sustenance telugu

జీవితంలోని వివిధ దృశ్యాలలో సాకులు చెప్పడం మానుకోండి

ప్రతి రోజు మీ వాట్సప్ లో ఒక మంచి విషయాన్ని తెలుసుకునేందుకు మనలో చాలా మంది మన విశ్వసనీయతను కాపాడుకోవడానికి, ఇతరులపై లేదా పరిస్థితులపై నిందలు వేయడానికి సాకులు చెబుతారు. కొన్నిసార్లు మనకు, మన

Read More »
18th march 2025 soul sustenance telugu

నెగటివ్ ఆలోచనలను ఆధ్యాత్మిక శక్తితో మార్చడం (పార్ట్ 3)

ప్రతి రోజు మీ వాట్సప్ లో ఒక మంచి విషయాన్ని తెలుసుకునేందుకు అంతర్గత బలం యొక్క సానుకూల సంస్కారాలను సృష్టించడానికి, మనం ముందుగా పట్టుదల యొక్క మొదటి అడుగు వేయాలి. పట్టుదల అంటే నేను

Read More »